ఇక్లాస్ ఖాన్
చరిత్ర పుటల్లోంచి:
దక్షిణ-మధ్య భారతదేశంలోని దక్కన్
ప్రాంతంలో సంక్లిష్టమైన, బహుళ సాంస్కృతిక సమాజం ఉంది. పెర్షియన్,
డచ్,
ఫ్రెంచ్,
బ్రిటీష్,
డానిష్,
పోర్చుగీస్,
మధ్య
ఆసియా మరియు ఆఫ్రికన్ ప్రజలందరూ వాణిజ్యం మరియు ఆక్రమణల కోసం ఈ ప్రాంతం వచ్చారు. కొందరు చివరికి
ఈ ప్రాంతం లో స్థిరపడి, తమ తరాల వారసులను విడిచిపెట్టారు. డెక్కన్
యొక్క సామాజిక సంస్కృతిలో, ఆఫ్రికన్ వలసదారులు ప్రభువుల స్థాయికి
ఎదగగలిగారు.
హబ్షి అనేది అబిస్సియన్ కోసం వాడే అరబిక్
పదం,
ఈ
పదం భారతదేశంలో నివసించడానికి వచ్చిన ఆఫ్రికన్లను వర్ణించడానికి ఉపయోగిస్తారు.
ఆఫ్రికన్లు భారత దేశానికి వ్యాపారులు,
మత్స్యకారులు మరియు బానిసలుగా వచ్చారు.
సిడి ("మై లార్డ్") అనేది
మరొక అరబిక్ పదం, కానీ ఈ పదం ఆఫ్రికన్ల లో ఉన్నత స్థితిని
సూచిస్తుంది.
ఉపఖండంలో ఆఫ్రికన్ల రాక ఏడవ శతాబ్దం
ప్రారంభంలోనే జరిగింది మరియు గుజరాత్, కర్ణాటక,
బొంబాయి,
గోవా
మరియు హైదరాబాద్ అంతటా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు భారతదేశంలోని ఈ ప్రాంతాలలో
దాదాపు అరవై ఐదు వేల మంది ఆఫ్రికన్లు హబ్షి, సిడి కమ్యూనిటీలలో నివసిస్తున్నారు.
హబ్సిలలో మాలిక్ అంబర్( 1548–1626),
అత్యంత ప్రసిద్ధి చెందాడు ఇథియోపియాలో జన్మించాడు, తరువాత బాగ్దాద్‌లో
బానిసగా విక్రయించబడ్డాడు, అక్కడ అంబర్ ఇస్లాం మతంలోకి మారాడు
మరియు "అంబెర్‌గ్రిస్" అనే అరబిక్ పదం నుండి అతనికి అంబర్ అనే పేరు
పెట్టారు.
అంబర్ అత్యుత్తమ తెలివితేటలు మరియు మేధాతనానికి
ప్రసిద్ది చెందాడు, అంబర్ అహ్మదాబాద్ వజీర్ చేత కొనుగోలు
చేయబడ్డాడు, అంబర్ తన యజమాని మరణం తరువాత,
విముక్తి పొందాడు మరియు ఉన్నత స్థాయికి ఎదిగాడు.
ఆ
తర్వాత అంబర్ మాలిక్ ("రాజు")
అనే బిరుదు పొందాడు.
అంబర్ ఆఫ్రికన్ మాజీ బానిస సైనికుల
సైన్యాన్ని నిర్మించాడు మరియు అహ్మద్‌నగర్‌కు డీఫ్యాక్తో /వాస్తవిక రాజు అయ్యాడు మరియు అహ్మద్‌నగర్
సుల్తాన్ కుమార్తె ను వివాహం చేసుకోవడంతో మరింత ప్రభావవంతంగా మారినాడు. మాలిక్ అంబర్
కళలకు బలమైన కళా పోషకుడు, మరియు అతని యొక్క అనేక ఛాయాచిత్రాలు
ప్రపంచవ్యాప్తంగా మ్యూజియం సేకరణలలో ఉన్నాయి.
మాలిక్ అంబర్ లాగానే, బీజాపూర్‌కు చెందిన రైహాన్ (మ. 1656) విముక్తి పొందిన బానిస. రైహాన్ బీజాపూర్ సంస్థానం లో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. మాలిక్ రైహాన్ 'ఆదిల్ షా' అనే పేరును బట్టి, రైహాన్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా II (r. 1580-1627)కు సేవ చేస్తూ పెరిగాడు మరియు సుల్తాన్ కుమారుడు ప్రిన్స్ ముహమ్మద్ 'ఆదిల్ షా (r. 1627-1656) కు సమవయస్కుడు. ప్రిన్స్ ముహమ్మద్ సింహాసనాన్ని స్వీకరించినప్పుడు, రైహాన్, మాలిక్ రైహాన్ గా పదోన్నతి పొందాడు.
రైహాన్ బానిస స్థితి నుండి విముక్తి పొంది, బీజాపూర్ దళాలకు రైహాన్ కమాండర్ మరియు సుల్తాన్‌కు ముఖ్యమైన సలహాదారు అయ్యాడు. చివరికి రైహాన్ గోల్కొండ సరిహద్దులో ఉన్న ఒక ప్రావిన్స్‌కు గవర్నర్‌గా నియమించబడ్డాడు మరియు 1635లో ఇఖ్లాస్ ఖాన్ అనే బిరుదును అందుకున్నాడు.
హబ్షి, సిడిల వారసులు ఆధునిక భారతదేశంలో అభివృద్ధి
చెందుతూనే ఉన్నారు.
హబ్షి,
సిడి కమ్యూనిటీ భారత దేశం లో దాని
ప్రత్యేకమైన మరియు దీర్ఘకాల సాంస్కృతిక సమీకరణకు నిదర్శనం.
No comments:
Post a Comment