కోట జిల్లా, రాజస్థాన్:
1857 స్వాతంత్ర్య
సంగ్రామం లో భాగంగా రాజస్థాన్‌లోని కోట జిల్లాలో లాలా జైదయాల్ భట్నాగర్ మరియు
మెహ్రబ్ ఖాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది.లాలా జైదయాల్ 1812 ఏప్రిల్ 4వ తేదీన భరత్‌పూర్‌లోని కామాలో
జన్మించారు. లాలా జైదయాల్ కోట లో జరిగిన తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు. లాలా
జైదయాల్ సహచరుడు మెహ్రాబ్ ఖాన్, కోట సైన్యంలో 'రిసల్దార్' మరియు 1815 మే 11న కరోలిలో జన్మించాడు.
హిందువులు
మరియు ముస్లింల మతపరమైన మనోభావాలకు విరుద్ధంగా జంతుమాంసంతో తయారు చేసిన బ్రిటిష్
సైన్యం ఉపయోగించిన కొత్త ఆయుధం( తుపాకి గుళ్ళు) గురించి, మెహ్రబ్ ఖాన్‌తో పాటు లాలా జైదయాల్
వివరంగా ఒక లేఖ జారీ చేశారు. బ్రిటీష్ వారిని నాశనం చేయాలని భారతీయ సిపాయులకు విజ్ఞప్తి
చేశారు.
కోటా రాజ్య
పాలకుడు హండా రాజ్‌పుత్ మహారావ్ రామ్ సింగ్‌కు కోట బ్రిటిష్ రాజకీయ ఏజెంట్ మేజర్
బర్టన్ తన బ్రిటీష్‌యేతర సైనికుల్లో కొందరిని తొలగించమని సలహా ఇచ్చాడు. ఈ సందేశం
సైనికులలో అసంతృప్తిని రేకెత్తించింది. కోపోద్రిక్తులైన కోట రాజ్ పుల్తాన్/పటాలం, మరుసటి రోజు అంటే 1857 అక్టోబర్ 15న కోట రాజు మరియు మేజర్ బర్టన్‌లపై
తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆగ్రహానికి
లోనైన కోటా రాజ్ సైన్యం లోని తిరుగుబాటు సైనికులు
కత్తులు, తుపాకులతో
బ్రిటిష్ ఏజెంట్ రెసిడెన్సీ బంగ్లాను
చుట్టుముట్టారు. వీరికి స్థానిక పౌరులు కూడా తోడయ్యారు. తిరుగుబాటుదారులు మేజర్
బర్టన్ మరియు అతని ఇద్దరు కుమారులను చంపారు. మేజర్ బర్టన్ యొక్క కత్తిరించబడిన
తలతో నగరంలో తిరుగుబాటుదారులు కవాతు నిర్వహించారు మరియు తరువాత తుపాకీతో కాల్పులు
జరిపారు.
తిరుగుబాటుదారులు
కోటా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు లాలా జైదయాల్ కోటా నగర పరిపాలనకు
బాధ్యత వహించారు. కోటా రాజ్య పాలకుడు మహారావు బంధించబడ్డాడు మరియు తిరుగుబాటుదారులతో
ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది.
6నెలల
పాటు, కోట
పరిపాలన జైదయాల్ ఆధ్వర్యంలో ఉంది మరియు మెహ్రబ్ ఖాన్ నగర రక్షణకు బాధ్యత వహించాడు.
కానీ వారి పాలన ఎక్కువ కాలం కొనసాగలేదు. జైదయాల్ మరియు మెహ్రబ్ ఖాన్ 1858 మార్చి 30న కరౌలీ మహారాజుతో కూడిన బ్రిటిష్
దళాలచే పదవి నుండి తొలగించబడినారు.. జైదయాల్ కోటను విడిచిపెట్టి బికనీర్‌కు
వెళ్లారు. కోట మరియు బండి పాలకులు జైదయాల్ పై 12000 రూపాయల బహుమతి ప్రకటించారు.:
కోటా సిపాయుల తిరుగుబాటు క్రూరంగా
అణిచివేయబడినది. బ్రిటిష్ సేనలు ప్రజల ఇళ్లు మరియు ఆస్తులను తగలబెట్టారు మరియు
వారు చూసిన ప్రతి ఇంటిని దోచుకున్నారు. లాలా జైదయాల్ మరియు మెహ్రబ్ ఖాన్ అనుచరులు
కష్టాలు అనుభవించారు మరియు కనికరంలేని హింసకు గురయ్యారు.
లిలియా అనే వ్యక్తి డబ్బుపై దురాశ తో
లాలా జైదయాల్ భట్నాగర్ అరెస్టుకు కారణమైనాడు. ఏప్రిల్-మే 1860 లో హదౌతి రాజకీయ ఏజెంట్ W.H బెనన్ కోర్టులో
విచారణ ప్రారంభమైంది. మరియు లాలా జైదయాల్ భట్నాగర్ కి 17 సెప్టెంబర్ 1860న కోటాలో మరణశిక్ష
విధించబడింది.
No comments:
Post a Comment