20 December 2024

మధుమేహులకు మిల్లెట్లు గొప్ప ఆహారం Millets for Diabetes

 


మిల్లెట్లు మధుమేహం సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ GI కలిగిన మిల్లెట్లు అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల, ఆహారంగా తీసుకుంటే చక్కెర స్థాయిలను సులభంగా తగ్గించుకోవచ్చని పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. మిల్లెట్లు మధుమేహులకు వరం అని చెప్పాలి, ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెరను శోషిస్తాయి.

మధుమేహ రోగులకు అద్భుతమైన పలితాలు ఇచ్చే మిల్లెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం


జొన్నలు

మధుమేహం సమస్య ఉన్నవారు జొన్నరొట్టెలు తినాలి. జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం, మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జొన్నలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, అంటే ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కాదు.


రాగులు

రాగి పిండిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, రాగి గ్లూటెన్ రహిత, అధిక కాల్షియం, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన సూపర్ ఫుడ్. రాగి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇంకా రాగి లోని ఫైబర్ చక్కెర జీవక్రియను వేగవంతం చేస్తుంది.


సజ్జలు

సజ్జలు డయాబెటిక్ రోగులు తీసుకుంటే, దీనిలోని ఫైబర్ చక్కెరను వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.


బార్లీ

బార్లీ గింజలు తినదగినవి, బార్లీ ధాన్యాన్ని పిండిగా చేసుకొని వాటితో రొట్టెలు చేసుకోవచ్చు. బార్లీ రొట్టెలు కూడా మధుమేహులకు మంచిది. బార్లీ గ్లూకాన్‌ను కలిగి ఉంటుంది, బార్లీ రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.


ఓట్స్

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ పిండి తినడం చాలా మంచిది. ఓట్స్ పిండితో ఓట్స్ ఇడ్లీలుఓట్స్ దోశలు కూడా చేసుకొని తినవచ్చు. ఇందులోని మెగ్నీషియం, ప్రొటీన్లు చక్కెరను వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

 

మిల్లెట్లను  ఆహారంగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.


 

No comments:

Post a Comment