16 December 2024

బాగా నిద్ర పోవడానికి సైన్స్-ఆధారిత నిద్ర చిట్కాలు Science-Backed Sleep Tips to Help Snooze Better

 

 


ఉద్యోగాలు, పాఠశాల, పిల్లలు మరియు శారీరక మరియు మానసిక శ్రమల మధ్య, మనమందరం మెరుగైన, ప్రశాంతమైన నిద్రను కోరుకొంటాము.. మన ఆరోగ్యానికి నిద్రపోవడం ముఖ్యం అనడంలో సందేహం లేదు. అసమతుల్య చక్కెర స్థాయిలు, జీవక్రియ మరియు చిత్తవైకల్యంతో సహా హృదయ సంబంధ సమస్యలు మరియు నాడీ సంబంధిత పరిస్థితులు   తక్కువగా నిద్ర పోవడంతో  ముడిపెడివుంటాయి..

నిద్ర నిపుణులు అత్యంత ఉపయోగకరమైన నిద్ర పోవడానికి సైన్స్-ఆధారిత చిట్కాలు కొన్నింటిని ప్రస్తావిస్తున్నారు..

చిన్నపాటి, తేలిక  మద్యానపు నిద్రలతో  మనసుకు పదును పెట్టండి

రోజు కొద్దిసేపు మద్యానం పూట నిద్రపోవడం మెదడుకు అవసరమైన రిఫ్రెష్‌గా ఉంటుంది. మద్యానం పూట న్యాప్స్ ఆలోచనా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి, ఉత్పాదకత మరియు మానసిక స్థితికి ఊతం ఇస్తాయని సూచిస్తున్నాయి.

మద్యానం. "తేలికపాటి నిద్ర" పోవడానికి తగిన సమయం,. కానీ ఎక్కువసేపు నిద్రపోవడం అనేది అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం అని గమనించండి.

రోజంతా బెడ్‌లో ఉండడం మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది

" ఎక్కువ కాలం పాటు మంచం మీద ఉండటాన్ని ఎంచుకోవడం అనేది మానసిక ఆనారోగ్య ధోరణులలో ఒకటి. దాని స్థానం లో కొంతసేపు వ్యాయామం చేయడం లేదా అధ్యయనం చేయడం మంచిది..

నిపుణులు ఎక్కువ కాలం పాటు మంచం మీద ఉండట౦ శరీరం యొక్క అంతర్గత గడియారాన్ని లేదా నిద్ర-మేల్కొనే చక్రాలను నియంత్రించే సిర్కాడియన్ రిథమ్‌ను పాడు చేస్తుందని అంటున్నారు. మేల్కొన్న తర్వాత ఒక గంట సహజ కాంతిని పొందండి.

 నిద్రకు మెగ్నీషియం ముఖ్యమైనది

మెగ్నీషియం సులభంగా నిద్రలోకి జారుకోవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం కండరాలను సడలించడంలో సహాయపడుతుంది మరియు మానసిక స్థితి మరియు ఆందోళనను స్థిరీకరించే మెదడులోని మార్గాలను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని మెగ్నీషియం సప్లిమెంట్లు  నిద్రకు భంగం కలిగించే భేదిమందుగా పనిచేస్తాయి.

నేలపై పడుకోవడం వీపుకు ప్రయోజనం చేకూరుస్తుంది-కొన్నిసార్లు

ప్రజలు శతాబ్దాలుగా నేలపై నిద్రిస్తున్నారు-మరియు వెన్నునొప్పి ఉన్న కొంతమందికి నేల మీద నిద్ర కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొంతమంది ఫిజియోథెరపిస్ట్‌ల ప్రకారం, చదునుగా ఉన్న నేలపై పడుకోవడం, వీపుపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడును. నేల యొక్క దృఢత్వం కూడా చాలా మృదువైన mattress కంటే ఎక్కువ మద్దతునిస్తుంది.

అయితే, ప్రతి బ్యాక్ కండిషన్‌కు నేలమీద నిద్ర తగినది కాదని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఫ్లాట్‌నెస్ కీళ్ల దృఢత్వానికి దారితీయవచ్చు, తుంటి మరియు పిరుదులపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది లేదా వెన్నెముక యొక్క వంపు ఆకారాన్ని తగ్గిస్తుంది, దీని ఫలితంగా వెన్నునొప్పి వస్తుంది.

ఒంటరిగా నిద్రపోవడం మంచిది

2023 సర్వేలో U.S.లో మూడవ వంతు జంటలు "నిద్ర విడాకులు" పొందారని కనుగొంది.

కొన్ని జంటలకు ఒంటరిగా నిద్రపోవడం మంచిదని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. రాత్రి షిఫ్ట్ వర్కర్లు మరియు డే షిఫ్ట్ వర్కర్లు వంటి భిన్నమైన నిద్ర షెడ్యూల్‌లు ఉన్న వ్యక్తులు బెడ్‌ను పంచుకుంటే వారికి నిద్ర సరిగా ఉండదు మరియు ఎక్కువ గురకతో నిద్రపోవడం వల్ల మరుసటి రోజు అలసట మరియు పగటి నిద్ర వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. .అయితే  సహ-నిద్ర చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు ఆంగికరిస్తున్నారు-ఇది ఒత్తిడిని తగ్గించే ఓదార్పు మరియు భావోద్వేగ మద్దతును అందిస్తుంది.

నిద్ర తో ఆందోళన నివారణలు

ఏదైనా ఒత్తిడితో కూడిన సంఘటన నిద్ర నాణ్యతకు అంతరాయం కలిగిస్తుంది, పడుకునే ముందు, స్క్రీన్‌లను దూరంగా ఉంచండి కోపంగా ఉన్నట్లయితే, పడుకునే ముందు ధ్యానం చేయడం, వెచ్చని పానీయం తాగడం, పజిల్ చేయడం లేదా అల్లడం వంటివి చేయండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా కృతజ్ఞతతో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రతికూల ఆలోచనలను సానుకూలంగా మార్చడానికి ప్రయత్నించండి, సానుకూల ఆలోచనలు శాంతపరుస్తాయి మరియు మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మంచి నిద్రకు సహాయపడుతాయి.

 

-Scientific American, December 13, 2024 సౌజన్యం తో 

No comments:

Post a Comment