న్యూఢిల్లీ –
రంషా అన్సారీ
మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలో 1575 మార్కులకు 878 స్కోరుతో టాప్ 10లో ఆరవ స్థానాన్ని
కైవసం చేసుకుంది.
భోపాల్‌లోని ఒక సాధారణ కుటుంబానికి
చెందిన రంషా అన్సారీ త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా రాష్ట్రంలో
శాంతిభద్రతలకు తోడ్పడనుంది.
తండ్రి అష్రఫ్ అన్సారీ వ్యవసాయ శాఖ
నుండి రిటైర్డ్ క్లర్క్ కాగా, తల్లి సంజీదా అన్సారీ గృహిణి. రంషా అక్క చార్టర్డ్ అకౌంటెంట్.
భోపాల్‌లోని ఎక్సలెన్స్ కాలేజీ
నుండి ఎకనామిక్స్‌లో బిఎ ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత రంషా అన్సారీ ఇగ్నోలో
దూరవిద్య ద్వారా చరిత్రలో ఎంఏ పూర్తి చేసి, యుజిసి-నెట్-జెఆర్ఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
రంషా అన్సారీ మొదట యూనియన్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) పరీక్షలకు ఆతర్వాత MPPSC పరిక్షలకు ప్రిపేర్ అయ్యింది. రంషా ఏడు సంవత్సరాలు మరియు నాలుగు
ప్రయత్నాల తర్వాత చివరకు తన కలను సాధించింది.
సర్విస్ కమిషన్ పరిక్షలలో ఆశావహ
అభ్యర్థులు ప్రతిరోజూ 8 నుండి 10 గంటల అధ్యయనం
చేయాలని రాంషా సలహా ఇచ్చింది. “2 నుండి 3 సంవత్సరాలు పూర్తి దృష్టితో సిద్ధ౦ కావాలి అంది.
తన చదువుతో పాటు, భోపాల్‌లోని ఒక
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో MPPSC పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడంలో కూడా రంషా అన్సారీ
సహాయపడింది. "నా ఉపాధ్యాయులు, కుటుంబం మరియు నా విద్యార్థులు సృష్టించిన సానుకూల
వాతావరణం నిరంతరం ప్రేరణకు మూలంగా ఉంది" అని రంషా అన్సారీ అన్నారు.
రంషా అన్సారీ సాధించిన విజయం ముస్లిం బాలికలు మరియు మహిళలకు ప్రేరణగా నిలిచింది.
విద్యలో అవకాశాలు కలిగి సామాజిక మరియు
కుటుంబ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న చాలా మంది యువ ముస్లిం బాలికలకు రంషా అన్సారీ
విజయం ఆశాకిరణం.
ముస్లిం సమాజానికి, ముఖ్యంగా బాలికలకు
రంషా అన్సారీ సందేశం
‘విద్య మాత్రమే
జీవితాలను మెరుగుపరుస్తుంది’. ముస్లిం యువత
మరియు బాలికలు పౌర సేవలను లక్ష్యంగా చేసుకోవాలి మరియు దేశ పురోగతిలో భాగం కావాలి అని రంషా అన్సారీ
అన్నారు.
రంషా అన్సారీ పెద్ద కలలు కనడానికి
ధైర్యం చేసే చాలా మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.
No comments:
Post a Comment