7 January 2020

అల్ కిండి: ప్రఖ్యాత ముస్లిం శాస్త్రవేత్త మరియు తత్వవేత్త Al Kindi : The Renowned Muslim Scientist and Philosopher

Image result for al-kindi


-.




801 లో ఇరాక్‌లో పుట్టి పెరిగిన అరబ్ ముస్లిం తత్వవేత్త అల్-కిండి. అతనికి "అరబ్ మరియు ఇస్లామిక్ తత్వశాస్త్ర పితామహుడు" అని కూడా పేరు కలదు. గణితం, భౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్, సంగీతం, నీతి, తర్కం, మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం, ఔషధం, ఫార్మకాలజీ, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రంతో పాటు ఆప్టిక్స్ రంగాలలో  ఆయనకు ప్రావిణ్యత కలదు.

పరిచయం:

అల్-కిండి జన్మించే నాటికి ఇరాక్ అరబ్ ప్రపంచానికి విద్యా కేంద్రంగా ఉంది. అల్ కిండి అక్కడే చదువుకున్నాడు. అతని తండ్రి మరియు తాత కుఫా నగర గవర్నర్ల క్రింద పనిచేసే ఉద్యోగులు. అతను రాయల్ కిండా తెగకు వారసుడు అందువల్ల అతనికి "అల్-కిండి" అనే బిరుదు కలదు. అరేబియా లోని వివిధ తెగలలో కిండా తెగ చాలా ప్రముఖమైనది.

అల్ కిండి తన ప్రాథమిక విద్యను కుఫా నగరం లో పొందాడు, తరువాత బాగ్దాద్ వెళ్లి తదుపరి విద్యను పొందాడు. అతను గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు మరియు అతను ఖలిఫా అల్ మామున్ దృష్టిలో మంచి పేరు సంపాదించినాడు. ఖలిఫా అల్ మామున్ ది హౌస్ ఆఫ్ విజ్డమ్లేదా బైత్ అల్-హిక్మా Bayt Al-Hikma” ను స్థాపించాడు.

బైత్ అల్-హిక్మా (Bayt Al-Hikma) ప్రఖ్యాత పండితుల పుస్తకాలు మరియు పరిశోధనలపై పనిచేసే కేంద్రంగా ఉంది. ఖలిఫా అల్ మామున్ బైత్ అల్-హిక్మా Bayt Al-Hikma లో అల్ కిండిని నియమించాడు మరియు  అక్కడ అతను గ్రీకు శాస్త్రీయ మాన్యుస్క్రిప్ట్‌లను అనువదించాడు. అక్కడ చాలా కాలం పనిచేసిన తరువాత, గ్రీకు శాస్త్రవేత్తలు  మరియు తత్వవేత్తలతో అతను ప్రభావితుడు అయ్యాడు. అల్-కిండి క్రిప్టానాలిసిస్“Cryptanalysis” మరియు ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ Frequency analysis” ను కూడా కనుగొన్నారు.

అతని రచనలు:

క్షేత్ర మనస్తత్వశాస్త్రానికి (field psychology) అల్ కిండి ఎనలేని కృషి చేసాడు. అసంబద్ధమైన పదార్థాలు (incorporeal substances) మరియు ఆత్మపై ఉపన్యాసం (Discourse on the soul”) అనే పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాల రచనలో అతను అరిస్టోటేలియన్ తత్వశాస్త్రం చే ప్రభావితుడు అయి  మానవ ఆత్మ యొక్క అపరిపక్వ స్వభావం గురించి చర్చించాడు. అతను "ఆన్ ది ఇంటెలెక్స్“On the Intellect " అనే పుస్తకాన్నికూడా రచించినాడు.. ఈ పుస్తకాలలో, అతను మానవుడియొక్క నేర్చుకునే  మరియు కనుగొనే స్వభావం  గురించి వివరించాడు.

ఇబ్న్ అల్ నదీమ్ ప్రకారం, అల్ కిండి సుమారు 260 పుస్తకాలు రాశారు, వీటిలో 32 పుస్తకాలు జ్యామితిపై, 22 పుస్తకాలు ఔషధం మరియు తత్వశాస్త్రం పై, 9 పుస్తకాలు తర్కం పై  మరియు భౌతిక శాస్త్రo పై 12 పుస్తకాలు కలవు. అతను ఖగోళ శాస్త్రo పై కూడా రచనలు చేసాడు. అందులో సౌర వ్యవస్థ యొక్క గ్రహాల స్థానం మరియు ప్రకృతి యొక్క అంశాలను ప్రముఖంగా వివరించి నాడు.

తన రచనలు మరియు తాత్విక ఆలోచనల ద్వారా ఇస్లామిక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ గౌరవనీయ పండితుడిగా అల్ కిండి పరిగణించబడతాడు

అతని మాటలు His Words

అతను శాస్త్రీయ రంగంలో నిపుణుడు. అల్ కిండి నమ్మకమైనవాడు మరియు జీవితాన్ని లోతుగా చూశాడు. అతని మాటలలో "ఈ అసాధారణ ప్రపంచంలో మన నివాసం తాత్కాలికం; ఇది శాశ్వతమైన వైపు ఒక ప్రయాణం. అత్యంత దయనీయమైన మనిషి ఎవరంటే ఆధ్యాత్మికానికి పైన ఉన్న పదార్థాన్ని ఇష్టపడేవాడు. ఆధ్యాత్మిక ప్రపంచానికి మన మార్గాన్ని అడ్డుకునే పదార్ధాన్ని కోరుకోనేవాడు. మానవుడు అన్ని మానవ దుర్మార్గాల నుండి తనను తాను రక్షించుకునే మార్గాలను విస్మరించకూడదు మరియు మానవ ధర్మాల యొక్క అత్యున్నత శిఖరాలను చేరటానికి ప్రయత్నించాలి. అనగా  ఆధ్యాత్మిక మరియు శారీరక వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకునే జ్ఞానము మరియు మంచితనం పెంపొందించే   మానవ సద్గుణాలను సంపాదించాలి.”

ఇది అల్ కిండి జీవిత దృక్పథం. శాస్త్రీయ రంగంలో అతని పేరు మరపురానిది.

No comments:

Post a Comment