అబూ వాలిద్ మొహమ్మద్
ఇబ్న్ రష్ద్ 1128 C.E. లో స్పెయిన్లోని కార్డోవా లో జన్మించాడు. ప్రపంచంలోని గొప్ప ఆలోచనాపరులు మరియు శాస్త్రవేత్తలలో ఒకడు..
ఇబ్న్ రష్ద్ ప్రముఖ ముస్లిం శాస్త్రీయ ఆలోచనాపరుడు
మరియు అతనిని లాటిన్ లో అవెర్రోస్ గా పిలుస్తారు. తత్వశాస్త్రాన్ని ఇస్లామిక్ ఆలోచనతో అనుసంధానించాడు.
మతం మరియు తత్వశాస్త్రం మధ్య తేడా లేదని అన్నాడు.అతను అరిస్టాటిల్ రచనల పై సమగ్ర వ్యాఖ్యానాలు
చేసాడు.అతను తన రచనలో ఇస్లాం యొక్క అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
.
ఇబ్న్ రష్; ముస్లిం సైంటిఫిక్ థింకర్ Ibn Rush; Muslim Scientific Thinker
ఇబ్న్ రష్ద్ హదీసులు, భాషాశాస్త్రం, న్యాయ శాస్త్రంతో
పాటు విద్యా, వేదాంతశాస్త్రలను అధ్యయనం చేసాడు. అతను తత్వశాస్త్రం, మెటాఫిజిక్స్, మనస్తత్వశాస్త్రం
మరియు విశ్వం యొక్క మూలం గురించి రచనలు చేసాడు. తత్వశాస్త్రం మరియు న్యాయ శాస్త్ర రంగంలో
రాణించాడు. అందుకే అతనిని “న్యాయ శాస్త్ర తత్వవేత్త”.అని పిలుస్తారు.
అతని రచనలు:.
అతను 67 రచనలు చేసాడు అందులో
తత్వశాస్త్రం పై 28 రచనలు, 20 మెడిసిన్‌కు, 8 చట్టానికి, 5 వేదాంతశాస్త్రo పైకలవు.
4 రచనలు వ్యాకరణo పై కలవు. అతను అరిస్టాటిల్
రచనల పై మరియు ప్లేటో యొక్క "ది రిపబ్లిక్" పై వ్యాఖ్యానాలు చేశాడు.
అతని ప్రకారం శరీర
నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తి సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తిపై విశ్వాసం
కలిగి ఉంటాడు.మానసిక ఆరోగ్యం ద్వారా మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలడని అతని భావన. సర్వశక్తిమంతుడైన భగవంతుడు వివరించిన మార్గాల్లో పనిచేసే వ్యక్తులు జీవితంలో
ఆనందాన్ని పొందుతారు.
ఖగోళ శాస్త్రo లో
కృషి
ముస్లిం శాస్త్రీయ
ఆలోచనాపరుడిగా ఇబ్న్ రష్ద్ 25 సంవత్సరాల వయసులో మొరాకోలో వివిధ ఖగోళ పరిశీలనలు జరిపారు. ఈ పరిశీలనలు అతన్ని
ఇంతవరకు పరిశీలించని ఒక నక్షత్రాన్ని కనుగొనటానికి దారితీశాయి. అంతేకాక, చంద్రుడు అపారదర్శకంగా opaque ఉన్నాడని మరియు దానిలో
కొన్ని భాగాలు మందంగా కలిగి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
చంద్రుని యొక్క మందమైన భాగాలు సూర్యుడి నుండి ఎక్కువ కాంతిని పొందుతున్నాయి
అన్నాడు. అతను సన్ స్పాట్స్(SUN SPOTS) ను
కూడా పరిశిలించాడు.
మెడిసిన్ రంగం లో
కృషి Work in Medicine
Field
ఔషధ రంగంలో చాలా ముఖ్యమైన
కృషి చేశాడు. అతను కితాబ్ అల్ కులయత్ ఫి అల్ టిబ్ (Kitab al Kulyat fi al Tibb) అనే ప్రసిద్ధ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లాటిన్లోకి కూడా అనువదించబడింది. దిని
లాటిన్ వెర్షన్ “కొల్లిగెట్ Colliget”. దీనిలో శరీర నిర్మాణ
శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, పాథాలజీ, సింప్టోమాటాలజీ, ఫార్మకాలజీ, పరిశుభ్రత మరియు చికిత్సా అంశాలతో (anatomy, physiology, pathology, symptomatology,
pharmacology, hygiene and therapeutics) కూడిన 7 పుస్తకాలు ఉన్నాయి.
అనేక వ్యాధుల నిర్ధారణ, మరియు నివారణ గురించినాడు.
తాత్విక రంగం లో
కృషి Philosophical
work
ఇబ్న్ రష్ద్ గొప్ప
ముస్లిం శాస్త్రీయ ఆలోచనాపరుడు, అతని ఆలోచనలు శక్తివంతమైన వాదనలతో సృజనాత్మకంగా ఉంటాయి. తత్వశాస్త్రంలో, అతని ముఖ్యమైన పని
తుహాఫుత్ అల్-తుహాఫుట్ Tuhafut al-Tuhafut.. ఇది అల్-గజాలి యొక్క రచనకు ప్రతిస్పందన.
అతని రచన చాలా మంది ముస్లిం పండితుల విమర్శలకు గురైనప్పటికీ చాలా మందిని ప్రభావితం
చేసింది. ఏదేమైనా, ఇందులో దివ్య ఖురాన్ భావనల వివరణ ఆధారంగా ఇబ్న్ రష్ద్ సుదీర్ఘ వ్యాఖ్యానం చేశాడు.
అతను 1198 లో మర్రకేష్లో (Marrakesh) మరణించాడు. గొప్ప ఆలోచనాపరులలో ఇబ్న్ రష్ ఒకరు.
No comments:
Post a Comment