ప్రవక్త ముహమ్మద్ (స)
గారి యువ సహచరులు తమ మాటల లోనే కాదు, తమ ప్రవర్తన లో కూడా అత్యున్నత నైతికత విలువలను
ప్రదర్శించినారు. ఇస్లాం మరియు
దాని సందేశానికి గొప్ప విజయంగా మారినారు.
విశ్వం ప్రారంభం నుండి
అల్లాహ్ సూచించిన ఏకైక జీవన విధానం ఇస్లాం. ఇది ఆదమ్ (స) నుండి చివరి ప్రవక్త
మొహమ్మద్ (స) వరకు ప్రవక్తలందరి ధర్మం మరియు జీవన విధానం. ఒక దేవుడుని ఆరాధించమని, మరియు ఆతని ఆదేశాలను పాటించమని వారంతా మానవాళికి ఒకే సందేశాన్ని ఇచ్చారు. సమాజం/ప్రపంచంలో
మంచిని ప్రోత్సహించడం, మానవాళికి సేవ
చేయడం అందరు ప్రవక్తల ప్రయత్నం. సర్వజ్ఞుడు
అత్యంత శక్తివంతుడు అయిన అల్లాహ్ తన
సృష్టి (మానవుల) కోసం నిర్దేశించిన చివరి గ్రంథం ఖురాన్ మరియు అతని చివరి ప్రవక్త
మొహమ్మద్ (స).
(మానవులారా ) ముహమ్మద్ మీ లోని ఎ పురుషునికి
తండ్రి కారు, కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే
చివరి వారు. అల్లాహ్ అన్ని విషయాల జ్ఞానం కలవాడు..
(ఖురాన్ 33: 40)
ప్రవక్తల పరంపర ప్రవక్త
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ముగుస్తుంది కాబట్టి,
మనం మరే ఇతర ప్రవక్తను అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ సందేశాన్ని మిగతా
ప్రపంచానికి అందించవలసిన బాధ్యత ముస్లింపై ఉంది. యువత శక్తి,
ఆరోగ్యం, , దృడత్వం,
బలం, కలలు,
విజయాలు మరియు ఆకాంక్షలకు చిహ్నంగా ఉన్నందున,
వారు ఈ బాధ్యతను ఉత్తమ పద్ధతిలో నిర్వహించగలరు. ప్రవక్త(స)
యువతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఇదే. చరిత్ర గతిని మార్చడంలో
యువ సహబాస్ (ప్రవక్త సహచరులు- పురుషులు మరియు మహిళలు) పాత్ర విశిష్టమైనది.
చిన్న వయసులోనే ఇస్లాంను
అంగీకరించి దాని కోసం పనిచేసిన యువ సహబాస్ లలో అలీ -10 సంవత్సరాల వయస్సు,
ఉక్బా బిన్ అమీర్ 14,
జాబీర్ బిన్ అబ్దుల్లా మరియు జాయద్ బిన్ హరిస్ 15 సంవత్సరాల
వయస్సు, అబ్దుల్లా బిన్ మసూద్,
హబ్బాబ్ బిన్ ఆరెట్ మరియు జుబైర్ బిన్ అవమ్ 16 సంవత్సరాలు,
మువాజ్ బిన్ జాబెల్ మరియు ముసాబ్ బిన్ ఉమైర్ 18,
అబూ ముసా అల్-అషారీ 19,
జాఫర్ బిన్ అబూ తాలిబ్ 22,
ఉస్మాన్ బిన్ హువేరిస్,
ఉస్మాన్ బి అఫాన్,
అబూ ఉబైదా, అబూ హురైరా మరియు
ఉమర్ 25-31 కలరు.
ఆగర్భ శ్రీమంతుడు అయిన హజ్రత్
ముస్సాబ్ బిన్ ఉమైర్(ర) మక్కా లోని సంపన్న కుటుంబo లో జన్మించారు. అతను సుఖంగా
మరియు సమృద్ధిగా పెరిగారు. ముస్సాబ్ సాధించని ప్రాపంచిక ఆశీర్వాదం లేదు. అతను
ఇస్లాంను అంగీకరించినప్పుడు, అతని కుటుంబం అతనిని
ఇస్లాం ధర్మం నుంచి విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ముసాబ్ తన
కుటుంబం, అదృష్టం మరియు మక్కాను
విడిచిపెట్టి అబిస్నియాకు వలస వచ్చారు. మదీనా ప్రజలకు ఇస్లాం బోధించడానికి ప్రవక్త(స)
అతన్ని నియమించారు. మదీనాలో చాలా మంది అతని కృషి వలన ఇస్లాంలోకి ప్రవేశించారు
మరియు చాలా మంది అతని నుండి ఇస్లాం నేర్చుకున్నారు. ఉహుద్ యుద్ధంలో అతను
అమరవీరుడైనప్పుడు, అతని శరీరమంతా
కప్పడానికి తగిన వస్త్రం కూడా అతని వద్ద లేదు. ఇస్లాంను వ్యాప్తి చేయడoలో ప్రవక్త సహచరుల ఉత్సాహం మరియు త్యాగం అలాంటిది.
పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా అల్లాహ్
సేవలో మరియు ఇస్లాం కొరకు తమ అద్భుతమైన కృషిని ప్రదర్శించారు.
ప్రవక్త మొహమ్మద్ (స)
ప్రియమైన భార్య హజ్రత్ అయేషా బింతె అబూ బకర్(ర) విద్యావంతురాలు అయిన మహిళ. ఆమె ప్రవక్త(స) నుండి మత
శాస్త్రాలు నేర్చుకున్నారు. హజ్రత్ అయేషా (ర) గొప్ప ధార్మిక పండితురాలు,
మరియు ఆమె ఇస్లాంలో మొట్టమొదటి ఫిఖ్ (న్యాయ శాస్త్రం)
పాఠశాలను ప్రారంభించింది. హజ్రత్ అయేషా (ర) మహిళలను చదువుకోమని బాగా ప్రోత్సహించినారు
మరియు ఆమె
పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో మహిళా విద్యార్థులను కలిగి ఉంది.
ఆమె విద్యార్థులలో ఉమర్
ఇబ్న్ అల్ ఖత్తాబ్, అబూ హురైరా,
ఇమామ్ బుఖారీ మరియు ప్రవక్త(స) కుటుంబంతో సహా అనేక మంది
సహచరులు కలరు. అబూ ఉమర్ బిన్ అబ్దుల్ బార్ మాట్లాడుతూ,
“హజ్రత్ అయేషా (ర) మూడు శాస్త్రాలలో -ఇస్లామిక్ న్యాయ శాస్త్రం,
వైద్య శాస్త్రం మరియు కవిత్వ శాస్త్రం లో పరిజ్ఞానం కలిగిఉన్నారు. హజ్రత్ అయేషా(ర) అద్భుతమైన మరియు అనర్గళమైన
ఉపన్యాసకురాలు కూడా. ఇస్లామిక్ చరిత్ర యొక్క పుటలను మనం తిప్పితే, మత, ధర్మ, రాజకీయ విషయాలలో
పరిజ్ఞానం కలిగి జ్ఞానం మరియు మంచి పనులకు మార్గదర్శిగా మారిన అయేషా(రా) వంటి మరే మహిళను
మనం చూడలేము.
హజ్రత్ అస్మా బింతె అబూ బకర్ (ర) మొదటి ఖలీఫా అబూ
బకర్(ర) కుమార్తె. ఇస్లాం ప్రశంసించిన లక్షణాలన్నీ అస్మా(ర)లో ఉన్నాయి. ఆమెలో
భక్తి, దూరదృష్టి,
తెలివితేటలు, ధైర్యం మరియు
సమగ్రత మరియు ఔదార్యం మొదలగు మంచి లక్షణాలు కలవు. ప్రవక్త మొహమ్మద్(స) మదీనాకు వలస
వచ్చినప్పుడు ఆమె ఒక చిన్న అమ్మాయి. ప్రవక్త (స) మరియు హజ్రత్ అబూబకర్ తవార్ (thawr) గుహలో ఆశ్రయం పొందవలసి
వచ్చినప్పుడు ధైర్యవంతురాలైన ఆమె
అరణ్యంలో ఒంటరిగా ప్రయాణించి ఆహారాన్ని
వారికి అందించింది. అబూ జహ్ల్ అనే ప్రత్యర్థి ఆమెను ప్రవక్త(స) మరియు ఆమె తండ్రి
గురించి విచారించినప్పుడు, ఆమె వారి గురించి
ఎటువంటి వివరాలు ఇవ్వడానికి నిరాకరించింది మరియు ధైర్యంగా అతని కోపాన్ని ఎదుర్కొంది,
కాని రహస్యాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఖవ్లా బింతె అల్ అజ్వర్ (ర) బని అసద్ తెగ
ప్రముఖుని కుమార్తె. ఆమె తన సోదరుడు దిరార్ నుండి అన్ని రకాల ఖడ్గ విద్య కళలను
నేర్చుకుంది మరియు పరిపూర్ణ యోధురాలు అయ్యింది. రోమన్లు వ్యతిరేకంగా జెరూసలేం
సమీపంలో జరిగిన అజ్నాదిన్ యుద్ధంలో,
ఆమె సోదరుడిని రోమన్లు ఖైదీగా తీసుకున్నారు. ఖవ్లా,
తన సోదరుడిని కాపాడటానికి పురుష వస్త్రధారణ ధరించి కరవాలం
తో ధేర్యంగా రోమన్ శత్రువుల శ్రేణిని ఎదుర్కొంది. ఆ పోరాటం లో బంది అయిన ఆమె మరియు అనేకమంది మహిళా బందీలు తమ పవిత్రత(honour)కాపడుకొనుట కొరకు ఆమె నాయకత్వం లో ప్రణాళిక ప్రకారం గుడారాల
స్తంభాలు మరియు పెగ్లను తీసుకొని రోమన్ గార్డులపై దాడి చేశారు. ఆ యుద్ధంలో,
ఖవ్లా రోమన్ సైన్య నాయకుడితో సహా ఐదుగురు శత్రు యోధులను
సంహరించినది. ఆమె ధైర్యసాహసాలకు ముస్లిం సైన్య నాయకుడు ఖలీద్(ర) ఎంతో
ప్రశంసించారు.
అల్లాహ్ ఆజ్ఞను
నెరవేర్చడానికి మరియు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వారి జీవితంలోని అత్యంత
ప్రియమైన వయస్సులో వారి సమయం, సామర్థ్యం,
సామర్థ్యాలు, ఆరోగ్యం మరియు
సంపదను త్యాగం చేసిన యువతీ-యువకులు వీరు. మానవత్వం,
విలువలు, మంచిని
ప్రోత్సహించడం మరియు చెడును తగ్గించడం, అల్లాహ్
సందేశాన్ని వ్యాప్తి చేయడం మరియు ఉత్సాహం నైతికత లో వీరు ఎల్లప్పుడూ ముందు ఉన్నారు.
మాటలలోనే కాదు ప్రవర్తన కూడా వీరు
అత్యున్నత నైతికవిలువలను ప్రదర్శించారు. ఇస్లాం
మరియు దాని సందేశానికి గొప్ప విజయ పతాకాలుగా మారారు..
No comments:
Post a Comment