-
E C ముహమ్మద్ ముహ్సిన్ కుటుంబం.
కేరళకు చెందిన ముహమ్మద్
ముహ్సిన్ ఇ.సి తన ఇద్దరు చెల్లెళ్ళతో మాట్లాడుతూ, అతను ఐఎఎస్ అధికారి అయిన తర్వాత వారు కూడా ప్రసిద్ధి చెందుతారని చెప్పాడు. కాని విధి
మరోరకంగా అతనిని ప్రసిద్ధి చేసింది. మరణం ఎదురుగా లొంగని ధైర్యాన్ని
ప్రదర్శించినందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ “నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ 2019” కు
దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మంది పిల్లలలో
కోజికోడ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ముహ్సిన్
మరణానంతర (posthumous) విజేత.
తిక్కోడి గ్రామంలో
నివసిస్తున్న ముహ్సిన్ గత ఏడాది అక్టోబర్ 21 న కొడిక్కల్ బీచ్‌లో తన స్నేహితులతో కలిసి
క్రికెట్ ఆడటానికి వెళ్ళాడు. ఆ రోజు వాతావరణ హెచ్చరిక ఆలస్యంగా వచ్చిందని ముస్తఫా(అతని
తండ్రి) గుర్తు చేసుకున్నారు.
"వాతావరణ హెచ్చరిక వచ్చే సమయానికి, పిల్లలు అప్పటికే
సముద్ర తీరంలో ఉన్నారు, తరంగాలతో
పోరాడుతున్నారు.ముహ్సిన్ ముగ్గురు స్నేహితులు అల్లకల్లోలంగా గా ఉన్న సముద్రంలోకి
ప్రవేశించారు ఒడ్డున చాలా మంది ఉన్నప్పటికీ, పిల్లలను రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు.
"ముహ్సిన్ సముద్రంలోకి దూకి ఇద్దరు స్నేహితులను
ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఆ ప్రయత్నం లో అతని తల సముద్రపు నీటి కింద దాగి ఉన్న
బండరాయికి తగిలి చనిపోయాడు. అతని శవం మూడు రోజుల తరువాత సముద్ర తీరాన తేలింది"
అని తండ్రి గుర్తు చేసుకున్నారు.
“నేను అస్సలు బాధపడను:
అతను తన జీవితాన్ని మంచి కారణం కోసం ఇచ్చాడు. అతను ధైర్యంగా మరణించాడు. నా భార్య నాసిలా
కన్నీళ్లతో అతనిని గుర్తుచేసుకొంటుంది కాని ముహ్సిన్ ఏ సాధారణ వ్యక్తి చేయలేనిది
చేసాడు అని "ఖతార్లో
పనిచేస్తున్న ముహ్సిన్ తండ్రి ముస్తఫా అన్నారు.
"నా ముగ్గురు పిల్లలు మాట్లాడినదాన్ని నేను
ఎప్పటికీ మరచిపోలేను. ముహ్సిన్ తన సోదరీమణులు మిన్హా ఫాతిమా 11, మరియు అయేషా
మెహ్రిన్ 8, లకు చెప్పేవాడు, అతను ఒక ఐఎఎస్
అధికారి అయిన తర్వాత వారి పేర్లు కూడా ఒక
రోజు ప్రసిద్ధి చెందుతాయని"
No comments:
Post a Comment