న్యూ డిల్లి భారతీయ సూఫీ ఆధ్యాత్మికవేత్తల ఆధ్యాత్మిక రాజధాని అని మనలో చాలా
మందికి తెలియదు మరియు అది చారిత్రాత్మకంగా దక్షిణాసియా సూఫీలలో “బైస్ ఖ్వాజావోన్ కి చౌఖాట్” (22 ప్రముఖ సాధువుల నగరం) గా గౌరవించబడింది. న్యూ డిల్లి లోని చిష్తి
సూఫీ క్రమం యొక్క ప్రముఖ ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి.
హజ్రత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి భారతదేశంలో వహ్దతుల్ వాజుద్ (ఉనికి యొక్క ఐక్యత unity of
existence)) యొక్క ప్రధాన
ప్రతిపాదకుడిగా ఉద్భవించినారు., ఇది అద్వైత లేదా ద్వంద్వవాదం అనే వేద భావనతో సమానంగా
ఉంటుంది. కుతుబ్ సాహెబ్ గా ప్రసిద్ది చెందిన అతను అజ్మీర్‌కు చెందిన ఖ్వాజా ఘరీబ్
నవాజ్ మొయినుద్దీన్ చిష్తి యొక్క ఆధ్యాత్మిక మరియు మేధో వారసుడు. ఆధ్యాత్మికంగా అతనిని అరబిక్‌లో
“పోల్” అని అంటారు మరియు ఇది సూఫిజంలో ప్రాంతీయ సోపానక్రమం యొక్క
అధిపతిగా సూచిoచబడుతుంది.
కాకి (కుతుబ్ సాహెబ్) ముఖ్యంగా రెండు కారణాల వల్ల ప్రసిద్ది చెందాడు: దైవిక
మరియు మానవజాతితో అతని వ్యక్తిగత సంబంధం మరియు ఆధ్యాత్మిక ఆరాధన. అతని భక్తి
పద్ధతులు చాలావరకు బాహ్యంగా తెలియవు.
అతను తన ఆధ్యాత్మికను ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. వాస్తవానికి,
అల్లాహ్‌ను రహస్యంగా మరియు ఏకాంతంగా ఆరాధించడం సూఫీయిజం
యొక్క ప్రధాన లక్షణం. మొయినుద్దీన్ చిష్తి ఖ్వాజా (ఖ్వాజా-ఎ-ఖ్వాజగన్) వలే మెహ్రౌలి షరీఫ్ యొక్క ఈ ఆధ్యాత్మికతవేత్తను భారతదేశంపు
కుతుబ్-ఉల్-అక్తాబ్ (గొప్ప కుతుబ్) అని కూడా పిలుస్తారు.
కాకి తన ఆధ్యాత్మిక గురువు అయిన ఖ్వాజా ఘారిబ్ నవాజ్ పాదాల వద్ద
పడిపోయినప్పుడు, వారు అతనిని ఆప్యాయంగా
ఆలింగనం చేసుకున్నారు, ఆశీర్వదించారు మరియు అతను వారినుండి జ్ఞానోదయం
పొందాడు. ఖ్వాజా శిష్యత్వంలో పెరిగిన అతను : "మీ ముఖాన్ని సత్య వెలుగు నుండి
ఎప్పటికీ తిప్పకండి మరియు దైవిక మార్గంలో ధైర్యవంతుడని నిరూపించుకోండి."అని
అన్నారు.
ఖ్వాజా ఘరీబ్
నవాజ్ మరణం తరువాత,
ఖ్వాజా కాకి ఉపఖండంలోని చిష్తి సూఫీ క్రమం యొక్క అధిపతి
అయ్యాడు మరియు అతని వారసత్వాన్ని పూర్తి భక్తితో ముందుకు తీసుకువెళ్ళాడు. బాబా
ఫరీదుద్దీన్ గంజ్ షకర్ తన అత్యంత ప్రియమైన శిష్యులలో మరియు ప్రత్యక్ష ఆధ్యాత్మిక
వారసులలో ఒకరు. సుల్తాన్ షంసుద్దీన్ ఇల్తుట్మిష్ పాలనలో చిష్టి సూఫీలు హింసను
ఎదుర్కొన్నప్పటికీ ,
బక్తియార్ కాకి మరియు బాబా ఫరీద్ ఇద్దరూ ముస్లింలు మరియు
ముస్లిమేతరులచే గౌరవిoచపడినారు. మహాత్మా గాంధీ కూడా తన ఆధ్యాత్మిక ఆలోచనలపై ఖ్వాజా
కాకి యొక్క ప్రభావం ఉంది అని పేర్కొన్నారు.
జనవరి 27, 1948 న,
ఖ్వాజా బఖ్తియార్ కాకి మెహ్రౌలీ మందిరంలో గాంధీజీ తన చివరి
బహిరంగ ప్రసంగం చేశారు. దివంగత ఖుష్వంత్ సింగ్ తన పుస్తకం” ది నావెల్” లో ఇలా వివరించాడు: “గాంధీ కాకి సమాధికి నమస్కరిoచారు. అతనితో పాటు వచ్చిన
ముసల్మాన్లు గాంధీజిని సురా “అల్-ఫతేహా”ను పఠిoచమని అభ్యర్థించారు. మహాత్ముడు “అనంతకరుణామయుడు,
అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంబిస్తున్నాను”. అని అల్ ఫాతియా పఠిoచారు.
”తన ప్రారంభ జీవితంలో శ్రీమద్ రాజ్‌చంద్ర యొక్క ఉపన్యాసాలను“
ఆధ్యాత్మిక సంక్షోభ ”క్షణాల్లో తన మార్గదర్శిగా గాంధీ జీ ఆశ్రయించారు. చివరి
క్షణాలు అనగా తన బలిదానానికి
మూడు రోజుల ముందు, గాంధీజీ కాకి సమాధి దర్శించారు.
గాంధీజీ తరచుగా సూఫీ కవి అహ్మద్ జాన్ యొక్క ద్విపద(couplet)ను ఉదహరించేవారు.:
"లొంగిపోవడం మరియు ఆనందం యొక్క బాకుతో కాల్చి చంపబడిన వారు
కనిపించని విధంగా పునర్జన్మ పొందుతారు
Those who are shot dead with the dagger of
surrender and pleasure are reborn in the unseen.”
."
No comments:
Post a Comment