-
ఇస్లాం మానవ హక్కులు, విలువలకు ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇచ్చే సంపూర్ణ
ధర్మం. ఇస్లాం ధర్మం లో మహిళలు, పురుషుల తో పాటు సమాన హక్కులు అనుభవించారు. ప్రపంచంలోనే ఏ ఇతర
ధర్మం మరియు సంస్కృతి స్త్రీలకు ఇస్లాం ఇచ్చినంత ఉన్నత స్థానం ఇవ్వలేదు. ఇస్లాంలో
మహిళల స్థితి ఆమె గుర్తింపును శక్తివంతం చేస్తుంది మరియు ప్రపంచాన్ని జయించే
స్వేచ్ఛను ఇస్తుంది.
ఇస్లాం లో హిజాబ్ అనేది
నమ్రత(modesty)కు చిహ్నం గా ఉంది. కానీ
ఆధునిక పడమటి ప్రపంచం లోని చాలా మంది హిజాబ్ అనేది మహిళలను వెనుక యుగానికి
తీసుకువచ్చే ప్రయత్నానికి సంకేతంగా ఇప్పటికీ భావిస్తున్నారు. ఇస్లాం లో హిజాబ్ అనేది
సమాజం యొక్క చెడు కళ్ళ నుండి మహిళలను రక్షించడానికి ఉద్దేశించినది కనుక ఇది
స్త్రీలకు గౌరవ చిహ్నం గా భావించబడుతుంది.
ఇస్లాంలో హిజాబ్
అర్థం Meaning of Hijab in Islam:
హిజాబ్ ఇస్లాంలో ఎక్కువ
ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు ఖురాన్లో ఏడు సార్లు హైలైట్ చేయబడింది. పవిత్ర ఖురాన్
హిజాబ్ యొక్క ఖచ్చితమైన అర్ధాన్ని కర్టెన్(తెర,ముసుగు), వేరు(separation) మరియు గోడ(wall)గా
సూచిస్తుంది. హిజాబ్ యొక్క సాహిత్య అర్ధం రక్షించేది ఏదైనా.
పవిత్ర ఖురాన్లో హిజాబ్
యొక్క ప్రాముఖ్యత The significance of Hijab in the Holy Quran
సర్వశక్తిమంతుడైన అల్లాహ్
పవిత్ర ఖురాన్లో అంటున్నాడు: ”విశ్వాసులైన ప్రజలారా, దైవ ప్రవక్త ఇళ్లలోకి అనుమతి లేకుడా ప్రవేశించకండి.... ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగావలసి ఉంటె, తెరచాటున(హిజాబ్)
ఉంది అడగండి.” (దివ్య ఖురాన్ 33
: 53)
ఇస్లాంలో హిజాబ్ ఒక రక్షణ
మరియు స్త్రీ సర్వశక్తికి సమర్పించడాన్ని సూచిస్తుంది మరియు ఆమె కు సృష్టికర్త
పట్ల ఉన్న సంబంధాన్ని మరియు విశ్వాసాన్ని బలపరుస్తుంది. హిజాబ్ మహిళలు
నెరవేర్చాల్సిన మతపరమైన బాధ్యత. ఒక స్త్రీ హిజాబ్ లేదా ముసుగు ధరించినప్పుడు, ఆమె అల్లాహ్ కు దగ్గరగా ఉంటుంది మరియు తనను
తాను అల్లాహ్ (SWT) కి సమర్పించుకుంటుంది.
ప్రవక్త! నీ భార్యలకు, నీ
కూతుళ్ళకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ
దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడతీసుకోమని చెప్పు, వారు గుర్తిoపబడటానికి,
వేదిoపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్దత్తి. అల్లాహ్ క్షమించే వాడు,
కరుణించే వాడూను.(దివ్య ఖురాన్ 33:59)
మహిళల డ్రెస్సింగ్ విషయానికి
వస్తే, రెండు ప్రాథమిక అవసరాలు పూరించాలి. మొదట స్త్రీ
ముఖం, చేతులు, కాళ్ళు తప్ప
శరీరాన్ని పూర్తిగా కప్పాలి. రెండవది, ఆమె దుస్తులు
తగినంత వదులుగా ఉండాలి, తద్వారా స్త్రీ తన
శరీరాకృతిని దాచగలదు. హిజాబ్ ముస్లిం
మహిళల గుర్తింపును ప్రస్పుటం చేస్తుంది.
మహిళలకు డ్రెస్‌కోడ్
పవిత్ర ఖురాన్లో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ విధంగా మహిళల దుస్తుల నియమావళిని ప్రస్తావించాడు:
“...ప్రవక్తా!
విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాoగాలను రక్షించుకోండి
అన, తమ అలంకరణను ప్రదర్సిoచవలదని,- దానంతట అదే కనిపించేది తప్ప- తమ వక్ష:స్టలాలను
ఒణి అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ
ప్రదర్శించ కూడదని: భర్త,తండ్రి, భర్తలత్రండ్రులు, తమ కుమారులు, భర్తల కుమారులు,
అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, అక్కచెల్లేళ్ళ కుమారులు తమతో కలసి మెలసి ఉండే
స్త్రీలు. తమ
స్త్రిపురుష బానిసలు, వేరే ఏ ఉద్దేశం లేని వారిక్రింద పనిచేసే పురుష సేవకులు,
స్త్రీల గుప్త విషయాలను ఇంకా తెలియని బాలురు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ
ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నెల పై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు.
విశ్వసించిన ప్రజలారా! మీరంతా
కలసి అల్లాహ్ వైపునాకు మరలి క్షమాబిక్షను వేడుకొంది. మీకు సాపల్యం కలుగ వచ్చు.”(దివ్య ఖురాన్,
24:31)
ఇస్లాంలో హిజాబ్ ముస్లిం
మహిళలకు అడ్డంకి/పరిమితి కాదని చెప్పవచ్చు, అది ధరించేవారికి
గుర్తింపు/గౌరవం ఇస్తుంది.. మహిళలు హిజాబ్
ద్వారా తమను తాము అందంగా రూపొందించు కొంటారు
మరియు సమాజం నుండి గౌరవం పొందుతారు. ఇస్లాం లో హిజాబ్ కారణంగానే మహిళలు
అవాంతరాలు మరియు ఇతర ప్రతికూలతల నుండి విముక్తి పొందుతారు.. కాబట్టి ముస్లిం మహిళ
హిజాబ్ యొక్క వాస్తవం బోధించడానికి మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకo లో సర్వశక్తిమంతుడైన
అల్లాహ్(SWT) నుండి ఆశీర్వాదం సంపాదించడానికి ధరించాలి.
No comments:
Post a Comment