29 January 2020

ఫజల్-ఎ-హక్ ఖైరాబాది Fazl-e-Haq Khairabadi



Image result for Fazl-e-Haq Khairabadi-.



అల్లామా ఫజల్-ఎ-హక్1797 లో అప్పటి అవధ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా ఖైరాబాద్లో జన్మించినాడు. ఇతను   1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం  లో పాల్గొన్న ప్రముఖ  భారతీయ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఆనాటి ప్రసిద్ద  కవులలో ఒకరు. అతను ఒక తత్వవేత్త, రచయిత, కవి, మత పండితుడు, 1857 లో ఫిరంగిలకు  వ్యతిరేకంగా ముస్లింలను సాయుధ పోరాటం (జిహాద్) చేయమని ఫత్వా జారీ చేసి ప్రసిద్దుడు అయినాడు.
అతని తండ్రి మొఘల్ వంశస్తులకు ధార్మిక విషయాలలో సలహాదారుడు (sadr-ul-sadur). అతను 13 సంవత్సరాల వయస్సులో ఉపాధ్యాయుడయ్యాడు. 1828 లో అతను ఖాజా (Qaza) విభాగంలో ముఫ్తీగా నియమించబడ్డాడు.

అతను ఇస్లామిక్ అధ్యయనాలు మరియు వేదాంతశాస్త్రం యొక్క పండితుడు కాకుండా, అతను సాహిత్య వ్యక్తిత్వం, ముఖ్యంగా ఉర్దూ, అరబిక్ మరియు పెర్షియన్ సాహిత్యం లో పండితుడు. అరబిక్‌లో 400 కన్నా ఎక్కువ ద్విపదలు ఆయన రచించినాడు.. అతను గాలిబ్ అభ్యర్థన మేరకు మీర్జా గాలిబ్ యొక్క మొదటి దివాన్‌ను ఎడిట్ చేసాడు.

అతను అసాధారణమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నాడు మరియు ఖురాన్ ను కేవలం 4 నెలల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. అతను పదమూడు సంవత్సరాల వయస్సులో అరబిక్, పెర్షియన్ మరియు మత అధ్యయనo పూర్తి చేశాడు.

అతని లోతైన జ్ఞానం మరియు పాండిత్యం కారణంగా అతన్ని అల్లామా అని పిలిచారు మరియు తరువాత గొప్ప సూఫీగా గౌరవించబడినాడు. అతనికి ఇమామ్ హిక్మత్ మరియు కలాం (తర్కం, తత్వశాస్త్రం మరియు సాహిత్యం యొక్క ఇమామ్) అనే బిరుదు కూడా లభించింది. ఫత్వాస్ లేదా మతపరమైన తీర్పులను జారీ చేయడంలో ఆయనకు తుది అధికారం లభించింది.

అతను అసాధారణ మేధావి మరియు చమత్కారి. మీర్జా గాలిబ్ మరియు ఇతర సమకాలీన ప్రముఖ కవులు, రచయితలు మరియు మేధావులతో అయన సంవాదం గురించి చాలా కదలు గలవు.

అతను మరియు అతని కుమారుడు అబ్దుల్ అల్-హక్ ఖైరాబాది ఉత్తర భారతదేశంలో మదర్సా ఖైరాబాద్ను స్థాపించారు. దానిలో చాలా మంది పండితులు చదువుకున్నారు. అతను రిసాలా-ఎ-సౌరతుల్ హిందీయా Risala-e-Sauratul Hindia  ను అరబిక్ భాషలో వ్రాసాడు మరియు అస్-సౌరత్ అల్ హిందీయా As-Saurat al Hindiya లో తిరుగుబాటు గురించి వివరించాడు.

మౌల్వి ఫజల్-ఇ-హక్ ఖైరాబాది 1857 నాటి భారత తిరుగుబాటులో అత్యంత చురుకైన పాత్ర పోషించాడు. డిల్లి తిరుగుబాటు ప్రభుత్వానికి తాత్కాలిక రాజ్యాంగాన్ని సిద్ధం చేశాడు మరియు మిలిటరీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. బ్రిటిష్ వారు దిల్లిని తిరిగి ఆక్రమించిన తరువాత; లక్నో మరియు అవధ్ విప్లవకారులలో చేరడం ద్వారా మౌల్వి తన బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించాడు. రాంపూర్ వద్ద, మౌల్వి ఖైరాబాది సివిల్ మరియు క్రిమినల్ విషయాలపై అనువాదకుడు, శిక్షకుడు మరియు అధికారిగా పనిచేశారు. నవాబ్ వాజిద్ అలీ షా అవధ్ రాజ్యానికి పాలకుడు అయినప్పుడు మౌల్వి కైరాబాదీ లక్నోకు బయలుదేరాడు.

1856 లో, బ్రిటిష్ ప్రభుత్వం అవధ్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, రాజా వినయ్ సింగ్ ఆహ్వానం మేరకు మౌల్వి ఖైరాబాది అల్వార్‌కు వెళ్లారు. అతను ఒకటిన్నర సంవత్సరాలు అల్వార్ రాజ్యం లో లో వేర్వేరు పదవులను నిర్వహించాడు.  1857 ఆగస్టులో ఉత్తర భారతదేశం అంతటా తిరుగుబాటు జరిగినప్పుడు అతను డిల్లికి తిరిగి వచ్చాడు. ఆరుగురు సైనిక, నలుగురు పౌర పురుషుల మండలి తో పరిపాలనను నిర్వహించడానికి మౌల్వి ఖైరాబాది రాజ్యాంగాన్ని సిద్ధం చేసినాడు.. విప్లవాత్మక ప్రభుత్వ పాలకమండలిలో మౌల్వి ఖైరాబాది చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిపాలనా మండలి లేదా పాలకమండలి సభ్యులలో మౌల్వి ఖైరాబాదీ ఒకరు.

మౌల్వి ఖైరాబాది బ్రిటీష్వారికి వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేశారు. జనరల్ బఖ్త్ ఖాన్ యొక్క వ్యూహాన్ని అనుసరించి మౌల్వి జిహాద్ యొక్క ఫత్వాను జారీ చేశాడని చెబుతారు, మౌలానా ఫజల్-ఇ-హక్ ఖైరాబాది ఫత్వా సమకాలీన వార్తాపత్రిక సాదికుల్‌లో ప్రచురించబడింది.

1857 నాటి భారత తిరుగుబాటు విఫలమైన కొద్దికాలానికే, అతన్ని హింసను ప్రేరేపించినందుకు గాను బ్రిటిష్ అధికారులు 1859 జనవరి 30 న ఖైరాబాద్‌లో అరెస్టు చేశారు. 'జిహాద్'లో హత్య మరియు హింస ను ప్రోత్సహించినందుకు అతన్ని విచారించి  దోషిగా నిర్ధారించారు. అతను కేసులో సొంతంగా వాదించుకొన్నాడు. అతని వాదనలు మరియు అతని డిఫెన్స్ చాలా నమ్మకంగా ఉన్నాయి మరియు  తను అబద్ధం చెప్పలేనని ఫత్వా ఇచ్చినట్లు స్వయంగా ఒప్పుకున్నప్పుడు ఇక ప్రిసైడింగ్ మేజిస్ట్రేట్ కు గత్యంతరం లేక అతనిని బహిష్కరిస్తునట్లు తీర్పు  ప్రకటించాడు.

ఆజీవన జైలు శిక్ష విధించి ఆయనను అండమాన్ ద్వీపంలోని కలపాణి (సెల్యులార్ జైలు) కి తరలించారు మరియు  ఆయన ఆస్తిని జ్యుడిషియల్ కమిషనర్ అఫ్ అవధ్ కోర్టు జప్తు చేసింది. అతను 1859 అక్టోబర్ 8 న స్టీమ్ ఫ్రిగేట్ "ఫైర్ క్వీన్" లో అండమాన్ చేరుకున్నాడు. అతను 1861 లో 64 సంవత్సరాల వయస్సు లో ఆగస్టు 20, 1861 అక్కడి సెల్యులర్ జైలులో మరణించారు

ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ తుది ప్రవక్త, మరియు అతని తరువాత వేరే ప్రవక్త లేదా "దూత" ఉండరని ఆయన రాశారు.

అతను ఫరూకి. అతని కుమారులలో ఒకరైన అబ్దుల్ హక్ కూడా ఒక ప్రముఖ, గౌరవనీయ పండితుడు మరియు అతనికి షంసుల్ ఉలేమా అనే బిరుదు ఇవ్వబడింది. అతని వారసులు భారత ఉపఖండంలో ప్రసిద్ద  కవులు. వారు: మనవడు ముజ్తార్ ఖైరాబాది, ముని మనవడు జాన్ నిసార్ అక్తర్ మరియు ముని-ముని -మనవడు జావేద్ అక్తర్.  అతని వారసులలో దర్శకులు జోయా అక్తర్ మరియు ఫర్హాన్ అక్తర్ (జావేద్ అక్తర్ పిల్లలు) మరియు కబీర్ అక్తర్ (జావేద్ సోదరుడు సల్మాన్ అక్తర్ కుమారుడు) ఉన్నారు


















No comments:

Post a Comment