27 January 2020

వక్కోమ్ మజీద్ Vakkom Majeed 1909-2000

Image result for vakkom majeed




వక్కం మజీద్ అని పిలువబడే ఎస్. అబ్దుల్ మజీద్ జననం 20 డిసెంబర్ 1909ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియాలో జరిగింది. వక్కం 10 జూలై 2000, తిరువనంతపురం, కేరళ లో 90 ఏళ్ల వయసులో  మరణించారు

వక్కం మజీద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సబ్యుడు మరియు ఇతని జీవిత భాగస్వామి లేట్ సులేహా బీవి మరియు  పిల్లలు ఫాతిమా, నజ్మా (లేట్ ),షమీమా (లేట్) వక్కం మజీద్ తల్లిదండ్రులు:మొహమ్మద్ బీవి (తల్లి),సయ్యద్ మొహమ్మద్ (తండ్రి)

వక్కోమ్ మజీద్ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ సభ్యుడు. అతను ట్రావెన్కోర్లోని ప్రముఖ కులీన ముస్లిం కుటుంబoలో జన్మించాడు. తన మామ వక్కం మౌలవి రచనల ప్రభావంతో సామాజిక, రాజకీయ సంస్కరణ ఉద్యమాలలో పాలు పంచుకున్నాడు. ట్రావెన్కోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో మజీద్ ఒకరు, చివరికి అట్టింగల్ నియోజకవర్గం (1948-1952) నుంచి  శాసనసభ సభ్యుడయ్యాడు. 20 వ శతాబ్దపు గొప్ప భారతీయ జాతీయవాదులలో ఒకరిగా పరిగణించబడుతున్న మజీద్ రాజకీయంగా అంతర్గతంగా విలువ ఆధారిత, లౌకిక మరియు మానవతావాదం సంప్రదాయానికి చెందినవాడు.

మజీద్ కుటుంబం మదురై మరియు హైదరాబాదు పూర్వీకుల మూలాలను కలిగి ఉంది. అతని ముత్తాత(తల్లి తరుపు) తోపిల్ తంపి మరియు తాత(తల్లి తరుపు)మొహమ్మద్ కుంజు తమ కాలం నాటి ప్రముఖులు.. అతని మేనమామ వక్కం మౌలావి దూరదృష్టి గల, సామాజిక సంస్కర్త, పండితుడు, విద్యావేత్త, రచయిత, జర్నలిస్ట్ మరియు స్వదేశాభిమణి వార్తాపత్రిక వ్యవస్థాపకుడు.

సయ్యద్ మొహమ్మద్, మొహమ్మద్ బీవీ దంపతులకు జన్మించిన నలుగురు పిల్లలలో మజీద్ మొదటివాడు. అతనికి ఒక సోదరి ఉన్నారు: సఫియా బీవి (1912-1986) మరియు ఇద్దరు సోదరులు: మొహమ్మద్ అబ్దా (1914-1992), మరియు అబ్దుల్ లాతీఫ్ (1917-1999).

మజీద్ తన ప్రారంభ విద్యను అంజెంగోలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో పొందాడు. 1936 లో, మజీద్ వక్కం మౌలవి మేనకోడలు సులేహా బీవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఐదుగురు పిల్లలు పుట్టారు: ఫాతిమా (జననం 1937), శిశు బాలుడు infant boy (1939-1940), నజ్మా (1943–1957), శిశు అమ్మాయి infant girl (1953-పుట్టిన వెంటనే మరణించారు) మరియు షమీమా (1957–2011).

అతను తన మేనమామ వక్కం మౌలవి, అలాగే నారాయణ గురు యొక్క సామాజిక సంస్కరణ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. తన ప్రారంభ పాఠశాల రోజుల్లోనే రాజకీయాలలో ప్రవేశించారు.  కేరళలో భారత జాతీయ ఉద్యమం ఉద్భవించినప్పుడు, మజీద్ దాని నాయకత్వంలో ముందంజలో ఉన్నారు. ట్రావెన్కోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్థాపకుల్లో ఆయన ఒకరు. యువకుడిగా, అతను సామాజిక సంస్కరణ ఉద్యమంలో కూడా బాగా పాల్గొన్నాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడిన అపార ధైర్యాన్ని ప్రదర్శించిన ట్రావెన్కోర్ లోని కొద్దిమంది కాంగ్రెస్ నాయకులలో మజీద్ ఒకరు.

 అతను చాలా నెలలు జైలులో ఉన్నాడు. తదనంతరం, "స్వతంత్ర ట్రావెన్కోర్" ఆలోచన రూపొందించినప్పుడు, మజీద్ ఈ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నాడు. అతన్ని చాలా నెలలు నిర్బంధించారు. ఐఎన్ఎ హీరో వక్కం కదిర్‌కు బ్రిటిష్ వారు మరణశిక్ష విధించినప్పుడు, మజీద్ మద్రాస్ సెంట్రల్ జైలులో ఆయనను సందర్శించారు. కదిర్ యొక్క చివరి లేఖను ఉరితీసే ముందు అతని  తండ్రికి తీసుకువచ్చినది మజీద్.

మజీద్ 20 వ శతాబ్దంలో కేరళ సామాజిక-రాజకీయ రంగంలో గొప్ప రాజకీయ నాయకుడు-అసాధారణ వ్యక్తి. టూ-నేషన్ థియరీ మరియు పాకిస్తాన్ ఉద్యమానికి గట్టి వ్యతిరేకి. లౌకిక-జాతీయవాద భారతదేశం మాత్రమే ప్రజల హృదయాన్ని మరియు ఆత్మను కలిసి ఉంచగలదని భావించారు.  1948 లో (పోటీ లేకుండా).  అట్టింగల్ నియోజకవర్గం నుండి ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు 1952 లో తన పదవీకాలం ముగిసినప్పుడు, అతను ఆచరణాత్మక రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియు తీవ్రమైన పఠనానికి  అంకితం అయారు.


అతను బెర్ట్రాండ్ రస్సెల్, M.N. రాయ్ మరియు అనేక మంది ఫ్రెంచ్ రచయితల రచనల చే ప్రభావితుడయ్యాడు. మజీద్ సిద్ధాంత రాజకీయాలను వ్యతిరేకించారు మరియు రాజకీయాలు మరియు సామాజిక సమస్యలలో లౌకిక-మానవతావాద దృక్పథం కోసం వాదించారు. మజీద్ ఇస్లాంలో లిబరలిజం మరియు మోడరనిజం యొక్క విలువలను సమర్థించాడు మరియు ఇస్లామిక్ సంప్రదాయాలలో ఇజ్తిహాద్ (ఆలోచన స్వేచ్ఛ) తిరిగి రావాలని పిలుపునిచ్చారు. అతను నారాయణ గురు ఆలోచనలను విలువ నిచ్చారు  మరియు "కులరహిత" సమాజంలో పట్ల పెరుగుతున్న ఆదరణను ప్రశంసించాడు.

వక్కోమ్ మజీద్ యొక్క చివరి మూడు దశాబ్దాలు జాతీయవాద చరిత్ర, భావజాలం మరియు అభ్యాసం యొక్క తీవ్రమైన అన్వేషణ మరియు పఠనం లో గడిచినవి.  1972 లో, భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు దేశం 'తామ్రపత్ర' ఇచ్చి ఆయనను సత్కరించింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ఆయన 'తామ్రపత్ర' అందుకున్నారు. 1980 ల చివరినాటికి, మజీద్ ఆరోగ్యం క్షీణించింది, అతను ఒక సంవత్సరం పాటు మంచం పట్టాడు.

అతని భార్య సులేహా బీవి 18 జూన్ 1993 న మరణించారు. 1990  తరువాత అతను కొన్ని సామాజిక-రాజకీయ కార్యక్రమాలకు హాజరైనప్పటికీ, అతని ఆరోగ్యం దెబ్బతింది. 8 జూలై 2000, అతను తీవ్ర అనారోగ్యానికి గురై ఒక ప్రైవేట్ క్లినిక్‌లో చేరారు. అతని పరిస్థితి మరింత దిగజారి, తిరువనంతపురంలోని కాస్మోపాలిటన్ ఆసుపత్రిలోని సిసియు (క్రిటికల్ కేర్ యూనిట్) కు మార్చబడినాడు. 10 జూలై 2000 న గుండెపోటుతో స్థానిక సమయం 6:30 గంటలకు (1:00 UTC) మరణించినట్లు ప్రకటించారు. మజీద్‌ను అతని పూర్వీకులతో పాటు వక్కోమ్‌లోని తూర్పు జమాత్ మసీదు (వక్కం పాడింజారే జమాత్ మసీదు) లో ఖననం చేశారు.

No comments:

Post a Comment