జనవరి 15, 1888 న జన్మించిన
డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లెవ్ (15 జనవరి 1888 - 9 అక్టోబర్ 1963) ప్రముఖ భారతీయ
స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త మరియు పాకిస్తాన్ ఉద్యమ విమర్శకుడు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడైన అతను మొదట పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
(పంజాబ్ పిసిసి) అధిపతిగా తరువాత 1924లో ఎఐసిసి ప్రధాన
కార్యదర్శి అయ్యాడు.
మార్చి 1919 లో రౌలాట్ చట్టం
అమలు చేసిన తరువాత పంజాబ్‌లో జరిగిన నిరసనలలో పాల్గొన్నాడు. ఏప్రిల్ 10 న, అతను మరియు మరొక
నాయకుడు సత్యపాల్ ను అరెస్ట్ చేసి రహస్యంగా పోలీసులు ధర్మశాలకు పంపారు. వారి
అరెస్టుకు వ్యతిరేకంగా మరియు గాంధీజీ నిర్భందానికి వ్యతిరేకంగా బహిరంగ నిరసన
ర్యాలీ, ఏప్రిల్ 13, 1919న అమృత్సర్‌లోని జలియన్ వాలా బాగ్‌లో జరిగింది. అది
చివరకు జలియన్ వాలా బాగ్ మారణ హోమానికి దారితీసింది.
ఇతను పంజాబ్‌లోని
అమృత్సర్‌లో గల కాశ్మీరీ ముస్లిం దoపతులు అజీజుద్దీన్ కిచ్లు మరియు డాన్ బీబి కు జన్మించాడు.
అతని తండ్రి పాష్మినా మరియు కుంకుమ వ్యాపార వ్యాపారాన్ని చేసేవాడు మరియు
బారాముల్లాకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అతని పూర్వీకుడు ప్రకాష్
రామ్ కిచ్లు ఇస్లాం లోకి మారారు మరియు అతని తాత అహ్మద్ జో 1871 లో కాశ్మీర్
కరువు తరువాత 19 వ శతాబ్దం మధ్యలో కాశ్మీర్ నుండి వలస వచ్చారు.
కిచ్లు అమృత్సర్‌లోని ఇస్లామియా హైస్కూల్ లో
విద్యను అబ్యసించాడు తరువాత B.A. కేంబ్రిడ్జ్
విశ్వవిద్యాలయం నుండి మరియు పిహెచ్.డి జర్మన్ విశ్వవిద్యాలయం నుండి పొందాడు.
భారత దేశానికి
తిరిగి వచ్చిన తరువాత అతను అమృత్సర్ లో తన
లా ప్రాక్టిస్ ఆరంభించాడు మరియు త్వరలో అతనికి గాంధీతో పరిచయం ఏర్పడినది. ఆయన 1919 లో అమృత్సర్ నగర
మునిసిపల్ కమిషనర్‌గా ఎన్నికయ్యారు. అతను సత్యాగ్రహ (నాన్-కోఅపరేషన్) ఉద్యమంలో
పాల్గొన్నాడు మరియు త్వరలోనే లా ప్రాక్టిస్ విడిచి పెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో అలాగే అఖిల భారత
ఖిలాఫత్ కమిటీలో చేరినాడు.
రౌలాట్ చట్టానికి
వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసన వ్యక్తం చేసినందుకు కిచ్లు గాంధీ, డాక్టర్ సత్యపాల్‌తో
కలిపి అరెస్టు కాబడినారు. ఈ ముగ్గురిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, జల్లియన్‌వాలా
బాగ్ వద్ద పౌర బహిరంగ సభ ఏర్పాటు అయినది. శాంతియుతంగా సమావేశమైన ప్రజా
సమూహం పై జనరల్ డయ్యర్ మరియు అతని దళాలు కాల్పులు జరిపారు. వందలాది
మంది మరణించారు, ఇంకా వందల మంది గాయపడ్డారు. 1857 లో భారత
తిరుగుబాటు తరువాత జలియన్ వాల బాగ్ మారణహోమం అత్యంత దారుణమైనది మరియు దీనికి
నిరసనగా పంజాబ్ అంతటా అల్లర్లు చెలరేగినవి.
1924 లో ఎ.ఐ.సి.సి
జనరల్ సెక్రటరీ పదవికి ఎదగడానికి ముందు కిచ్లు పంజాబ్ కాంగ్రెస్స్ కు నాయకత్వం
వహించినాడు. 1929-30లో లాహోర్లో
జరిగిన కాంగ్రెస్ సెషన్ రిసెప్షన్ కమిటీకి కిచ్లు చైర్మన్. 26 జనవరి 1930, ఇండియన్ నేషనల్
కాంగ్రెస్ భారత స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది మరియు పూర్తి స్వాతంత్ర్యాన్ని
సాధించే లక్ష్యంతో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది.
కిచ్లు నౌజావన్
భారత్ సభ (ఇండియన్ యూత్ కాంగ్రెస్) వ్యవస్థాపక నాయకుడు మరియు జామియా మిలియా ఇస్లామియా యొక్క ఫౌండేషన్ కమిటీ
సభ్యుడు.
అతను ఉర్దూ
దినపత్రిక “టాంజిమ్”ను ప్రారంభించాడు మరియు 1921 జనవరిలో
అమృత్సర్‌లో స్వరాజ్ ఆశ్రమం స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు. 1930-1934 మద్య
స్వాత్రoత్య పోరాట సమయం లో కిచ్లు అరెస్టు కాబడినాడు మరియు మొత్తం పద్నాలుగు
సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.
పాకిస్తాన్ కోసం ముస్లిం
లీగ్ డిమాండ్ను కిచ్లు వ్యతిరేకించారు మరియు 1940 లలో పంజాబ్ కాంగ్రెస్
కమిటీ అధ్యక్షుడయ్యారు. 1947 లో భారత విభజనను ఆయన
తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా బహిరంగ సభలలో మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో విభజనకు
వ్యతిరేకించారు. అతను దీనిని "మతతత్వానికి జాతీయవాదం లొంగిపోవటం" అని
పిలిచాడు.
దేశ విభజన మరియు
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని
సంవత్సరాల తరువాత, అయన కాంగ్రెస్ నుండి నిష్క్రమించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు దగ్గరయ్యారు.
అతను అఖిల భారత శాంతి మండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు మరియు 1954 లో మద్రాసులో జరిగిన అఖిల భారత శాంతి మండలి యొక్క 4 వ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాడు, ప్రపంచ శాంతి మండలి ఉపాధ్యక్షుడిగా పనిచేసారు.
1947 నాటి భారత విభజన సమయంలో జరిగిన అల్లర్లలో అతని ఇల్లు కాలిపోయిన తరువాత కిచ్లు తన మాకం
దిల్లికి మార్చారు మరియు యుఎస్ఎస్ఆర్ తో రాజకీయ మరియు దౌత్య సంబంధాల కోసం తన
జీవితాంతం కృషి చేసారు. అతను 1952 లో స్టాలిన్(ఇప్పుడు
లెనిన్) శాంతి బహుమతిని అందుకున్నాడు. 1951 లో, ఒక ప్రభుత్వ చట్టం ద్వారా ఆయనను మరియు మౌలానా
అబుల్ కలాం ఆజాద్‌ను జవహర్‌లాల్ నెహ్రూ
మరియు జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క జీవిత ధర్మకర్తలు గా
నియమించినది.
ఆయన 9 అక్టోబర్ 1963 న మరణించాడు వారికి ఒక కుమారుడు, తౌఫిక్ కిచ్లు
డిల్లి శివార్లలోని లాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు మరియు ఐదుగురు కుమార్తెలు
ఉన్నారు. అతని నలుగురు కుమార్తెలు పాకిస్తాన్కు చెందిన పురుషులను వివాహం చేసుకోగా, ఒక కుమార్తె, జాహిదా కిచ్లు మలయాళ సంగీత దర్శకుడు ఎం. బి. శ్రీనివాసన్ అనే
హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
పంజాబ్‌లోని లుధియానాలోని
ఒక కాలనీకి కిచ్లు నగర్ అని పిలుస్తారు. ఇండియన్ పోస్ట్ 1989 లో ఒక ప్రత్యేక
స్మారక స్టాంప్‌ను విడుదల చేసింది. జామియా మిలియా ఇస్లామియా 2009 లో MMAJ అకాడమీ ఆఫ్ థర్డ్
వరల్డ్ స్టడీస్‌లో సైఫుద్దీన్ కిచ్లు చైర్‌ను ఏర్పాటు చేసింది.
No comments:
Post a Comment