11 August 2021

అబుల్ హసన్ ఇబ్న్ అలీ అల్-ఖలాసాది (1412-1486). Abū’l Hasan ibn ‘Alī al-Qalasādi ( 1412-148

  .

 

  

ఈ రోజుల్లో చిహ్నాలను లేని బీజగణితాన్ని మనం నిజంగా ఊహించలేము, ఈ చిహ్నాలలో కొన్నింటిని గణిత ప్రపంచంలోకి తీసుకురావడం ఒక ప్రధానమైన  పురోగతి. ఈ విషయంలో ముందడుగు వేసిన వ్యక్తి అండలూసియన్ ముస్లిం గణిత శాస్త్రజ్ఞుడు అబుల్ హసన్ ఇబ్న్ అలీ అల్-ఖలాసాది.

 

ఖాలాసాది (Qalasādi) 1412 లో దక్షిణ స్పెయిన్‌లోని ప్రముఖ ముస్లిం భూభాగం  అయిన గ్రెనడా సమీపంలోని బాజా అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఖాలాసాది అతను తన స్వస్థలంలో 24 సంవత్సరాల వరకు ఇస్లామిక్ విభాగాలను అభ్యసించాడు, ఆపై 15 సంవత్సరాల పాటు ఉత్తర ఆఫ్రికా అంతటా ప్రయాణించి, దారిలో కలిసిన అనేక మంది విద్యావంతులతో వివిధ విషయాలను అధ్యయనం చేసి చర్చించాడు. వీరిలో ఒకరు అత్యంత ప్రసిద్ధ ప్రఖ్యాత హదీసు  విద్వాంసుడు ఇబ్న్ హజార్ అల్-అస్కలానీ Ibn Hajar al-Asqalānī. ఖలాసాది ఈజిప్టు పర్యటన లో ఇబ్న్ హజార్ అల్-అస్కలానీ కలుసుకున్నాడు.పర్యాటనల అనంతరం ఖాలాసాది స్పెయిన్‌కు తిరిగి వచ్చాడు, గ్రెనడాలో స్థిరపడ్డాడు, అక్కడ ఖాలాసాది మరల తన చదువు కొనసాగించాడు; ఇప్పుడు, అతను ప్రత్యేకంగా గణితం, చట్టం మరియు తత్వశాస్త్రంపై దృష్టి పెట్టాడు.

 

గణితంలో చేసిన కృషికి ఖలాసాది బాగా ప్రసిద్ధి చెందారు, ఖలాసాది గణితం పై కనీసం 11 ప్రధాన రచనలు చేసాడు.. వీటిలో అత్యంత ముఖ్యమైనది తఫ్సర్ ఫిల్-ఇల్మ్ అల్-హిసాబ్ ’(అర్థమెటిక్ సైన్స్‌ పై వ్యాఖ్యానంTafsīr fi’l-‘Ilm al-Hisāb’ (Commentary on the Science of Arithmetic).). దీనిలో, ఖాలాసాది కొత్త బీజగణిత చిహ్నాలను symbols ప్రవేశపెట్టాడు, ఇవి గణితశాస్త్రవేత్తలైన డియోఫాంటస్ (గ్రీకు,) మరియు బ్రహ్మగుప్త (ఇండియా) యొక్క సాధారణ సంజ్ఞలను (simple notations) మించిపోయాయి. ఖలాసాది

కొత్త చిహ్నాలను (new symbols) మరియు బీజగణితంలో సంజ్ఞామానం (notation in algebra) రెండింటినీ కలిపిన మొదటి వ్యక్తి.

 

 

ఖలాసాది ఈనాటి సమానమైన చిహ్నాo = బదులుగా  సమాన చిహ్నంగా ను ఉపయోగించాడు.అతను x2 వంటి చతురస్ర విలువలకు అరబిక్ సమానమైన m(అరబిక్ లో  మాల్ Ar. māl))  ని మరియు x3 వంటి క్యూబ్డ్ వాల్యూస్ కోసం అరబిక్ సమానమైన K (Ar. Ka’b అరబిక్ లో కాబ్ )ను   ఉపయోగించాడు.

 

ఖలాసాది కూడిక కోసం "వాwa", తీసివేత కోసం "ఇలాilla", గుణకారం కోసం "ఫీfī" మరియు విభజన కోసం "అలాalā" అనే అరబిక్ పదాలను ఉపయోగించడాన్ని ప్రామాణీకరించాడు. అతను ఒక రేఖతో భిన్నం numerator యొక్క అంకె మరియు హారం denominator వేరు చేసిన మొదటి వ్యక్తి అని చెప్పబడింది మరియు సంబంధాల భిన్నాలు fractions of relationship (అరబిక్ లో  ముంతాసిబ్(Ar. muntasib) మరియు ఉపవిభజన భిన్నాలు (లేదా 'భిన్నాల భిన్నాలు', (subdivided fractions (or ‘fractions of fractions అరబిక్ లో  ముబాద్ Ar. muba‘ad). ఈ రచనలన్నీ ఈరోజు గణితాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి కీలకంగా పరిగణించ బడినవి.  

ఖాలాసాది వరుస ఉజ్జాయింపు పద్ధతి (successive approximation) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇది ఇప్పుడు కాలిక్యులస్‌లో అవసరమైన సాధనంగా పరిగణించబడుతుంది మరియు మనం పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. కాలాసాది ఈ పద్ధతి యొక్క ఉపయోగాన్ని నొక్కిచెప్పడమే కాకుండా, అసంపూర్ణ చతురస్రం యొక్క మూలాలను roots of an imperfect square పొందడానికి దీనిని ఉపయోగించడం ద్వారా దానిని ప్రదర్శించాడు. అతను స్థిర వాటాల(Ar. Farā'id) గురించి విస్తృతంగా రాశాడు

ఖాలాసాది గణితంపై తన సృజనాత్మక మరియు కళాత్మక సామర్థ్యo కు గుర్తుగా  కవిత్వంలో బీజగణిత నియమాలను వివరిస్తూ పుస్తకం వ్రాసాడు! ఖలసాది వ్యాకరణం మరియు భాష గురించి తొమ్మిది పుస్తకాలు మరియు మాలికా న్యాయశాస్త్రం (ఫిక్హ్) మరియు ప్రవక్త ముహమ్మద్ యొక్క సంప్రదాయాలు ( హదీసులు ) గురించి 11 పుస్తకాలు కూడా రాశాడు. ఖలాసాది విద్యార్ధులలో ఒకరైన అబా 'అబ్ద్ అల్లాహ్ అల్-సనాసే, (Abū ‘Abd Allāh al-Sanūsī) గణితం మరియు ఖగోళశాస్త్రంపై 26 పుస్తకాలను రచించారు, వాటిలో కొన్ని ఉత్తర ఆఫ్రికా అంతటా అధికారిక గ్రంథాలుగా గుర్తించబడ్డాయి.

 

1492లో, ఖలాసాది మరణించిన ఆరు సంవత్సరాల తరువాత, స్పెయిన్‌లో మిగిలిపోయిన చివరి ముస్లిం నగరమైన గ్రెనడా,  క్రిస్టియన్ రాజు ఫెర్డినాండ్ మరియు ఇసాబెల్లా ఆధీనం లోకి వచ్చింది.. మరుసటి సంవత్సరం, ఆర్చ్ బిషప్ సినెరోస్ Archbishop Cineros ముస్లింలు మరియు యూదులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చాలని మరియు వారి విలువైన మాన్యుస్క్రిప్ట్‌లను తగలబెట్టాలని ఆదేశించాడు, ఇందులో ఖాలాసాది రచనలు ఉన్నాయి.

 

అదృష్టవశాత్తూ, ఖాలసాది చేసిన కృషి, రచనలు బయటపడ్డాయి మరియు శతాబ్దాలుగా ఉపయోగంలో ఉన్నాయి; మొరాకో పండితుడు ముహమ్మద్ దాయద్ 1920 లలో తన తండ్రి "అల్-ఖలాసాది పుస్తకం" నుండి గణితాన్ని బోధిస్తాడని రాశాడు. గణితం లో అల్-ఖలాసాది అద్భుతమైన కృషి ఐరోపా పునరుజ్జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

 

ఖలాసాది దివ్య ఖురాన్‌ను అన్నింటి కంటే ఎక్కువగా విసృతంగా అధ్యయనం చేశాడు. ఖలాసాది. దివ్య ఖురాన్‌ను విస్తృతంగా అధ్యయనం చేయడం గణిత శాస్త్రజ్ఞుడిగా అతని సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మెరుగుపరిచినది.

 

 

No comments:

Post a Comment