27 August 2021

నూర్ జహాన్ నుండి కుద్సియా బేగం వరకు మొఘల్ రాణుల అద్భుతమైన వారసత్వం From Nur Jahan to Qudsia Begum the Moghal Queen’s feisty legacy.

 




మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్ జహాన్, మొఘల్‌ రాణులలో ప్రతిభావంతులైన, శక్తివంతమైన మహిళకు అత్యుత్తమ ఉదాహరణ. నూర్ జహాన్ అధికారికంగా నియమించబడిన సహ-సార్వభౌమాధికారి మాత్రమే కాదు, ఆమె విలువైన రాళ్లతో పొదిగిన ఆగ్రాలోని ఇతిమద్-ఉద్-దౌలా సమాధి సౌoదర్యానికి ప్రతీకగా నిలిచి పోయింది. సమకాలీన డచ్ వ్యాపారి, ఫ్రాన్సిస్కో పెల్సెర్ట్, నూర్ జహాన్ నిర్మించిన తోటలు మరియు రాజభవనాల గురించి - "ఇంతకు ముందు ఎవరూ చూడలేదు" అని వ్రాశాడు.

నూర్ జహాన్ సామ్రాజ్ఞి కొత్త వస్త్రాలను కూడా ప్రవేశపెట్టింది-ఉదాహరణకు సిల్వర్-థ్రెడ్ బ్రోకేడ్‌లు మరియు లేస్-మరియు పేద కుటుంబాల కోసం రూపొందించిన చౌకైన నూర్మహాలి వివాహ దుస్తులు. ఇవి అన్ని నూర్ జహాన్ యొక్క శాశ్వత వారసత్వాలు. చివరి రోజులలో నూర్ జహాన్ కుమారుడు షాజహాన్ ఆమెను సంవత్సరానికి రూ .2 లక్షల పెన్షన్‌తో సామ్రాజ్య రాజధానికి దూరంగా లాహోర్‌లోని ఒక తోట ప్యాలెస్‌కు పరిమితం చేశాడు

షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ కు ప్రేరణ అయిన నూర్ జహాన్ మేనకోడలు ముంతాజ్ మహల్ కూడా   చరిత్రలో తమ  ఉత్తమ కళాభిరుచికి ప్రసిద్దులు. 1662 మరియు 1668 మధ్య సుదీర్ఘంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంతాజ్ మహల్ కుమార్తెలు జహానారా, తల్లి తరువాత ప్రధాన రాణిగా మరియు రంగజేబ్ ఎదుగుదలలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన రోషనారా కూడా  కళాభిరుచిని ప్రదర్శించినారు..

షాజహాన్ చివరి  సంవత్సరాలలో మొఘల్ సింహాసనం కోసం జరిగిన పోరాటంలో దారా షుఖోకు మద్దతుగా నిలిచిన జహనారా, ఢిల్లీలోని చాందినీ చౌక్ సృష్టికర్త. జహనారా ఇప్పుడు పాత టౌన్ హాల్ ఎదురుగా ఉన్న చతురస్రంలో మార్కెట్‌ను తెరిచింది మరియు చారిత్రాత్మక వీధిలో జహనారా నిర్మించిన కారవాన్సేరాయ్‌ caravanserai ను ఫ్రెంచ్ సమకాలీన ప్రయాణికుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఢిల్లీ అత్యుత్తమ భవనంగా భావించారు.

మరియం-ఉస్ జమాని మరియు నూర్ జహాన్ లాగానే, జహానారాకు బలమైన వ్యాపార ఆసక్తులు ఉన్నాయి-ఆమె వ్యాపార నౌకల సముదాయాన్ని నిర్వహించింది మరియు ఆంగ్లేయులు మరియు డచ్‌లతో వ్యాపారం చేసింది. ఆమె సాహిత్య పోషకురాలు మరియు సోదరుడు దారా షుఖోహ్ లాగే సూఫీ తత్వం ను  అనుసరించినది. ఆమె ఇస్లామిక్ ఆధ్యాత్మికతపై అనేక రచనలను చేసింది  మరియు ఖాజా మొయినుద్దీన్ చిస్తి జీవిత చరిత్రను రాసింది. గొప్ప చిష్టి సన్యాసులలో ఒకరైన నిజాముద్దీన్ లియా 'దర్గా' సమీపంలో ఆమెను ఖననం చేశారు

రోషనారా, ఆధ్యాత్మికంగా ఆమె సోదరి వలె కాకుండా, లౌకిక జీవితాన్ని గడిపేవారు, బంగారాన్ని కూడబెట్టుకున్నారు, రంగజేబు ఆమెను ఢిల్లీలోని రోషనారా బాగ్‌కి పరిమితం చేశాడు.అక్కడే  భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 1927 లో జన్మించింది.

ఔరంగజేబ్ కుమార్తె, జెబ్-ఉన్-నిస్సా ఒక విషాదకరమైన వ్యక్తి. ప్రతిభావంతులైన గాయని మరియు కవయిత్రి. “మఖ్ఫీ('దాచినది hidden one’)” అనే మారుపేరుతో, ', సృజనాత్మక రచనలు చేసి ఇస్లామిక్ చట్టాన్ని అగౌరవపరిచినందుకు, ఎర్రకోట పరిసరాల్లోని సలీమ్‌గఢ్ కోటలో జెబ్-ఉన్-నిస్సాను ఆమె తండ్రి  20 సంవత్సరాలు జైలులో ఉంచారు. కానీ వాస్తవానికి  జరిగినది ఆమె సోదరుడు, ప్రిన్స్ ముహమ్మద్ అక్బర్, తన తండ్రికి వ్యతిరేకంగా వారసత్వం కోసం చేసిన పోరాటంలో అతని పక్షం వహించినందుకు జైలు లో ఉంచారు.

జెబ్-ఉన్-నిస్సా మరణం తర్వాత ఆమె కవితల సేకరణ ప్రచురించబడింది మరియు దాని మాన్యుస్క్రిప్ట్‌లు ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియం, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ప్యారిస్ మరియు జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ప్రచలిత కదల ప్రకారం ఇప్పటికి జెబ్-ఉన్ నిస్సా తన కవిత్వం పఠిస్తూ సలీమ్‌గఢ్ కోట ప్రాకారంపై పౌర్ణమి రాత్రులలో నల్లని ముసుగు దెయ్యం లాగా కనిపిస్తుంది.

రంగజేబు తరువాత బలహీనుల రాజులు వచ్చారు. వారిలో ఒకరు ముహమ్మద్ షా. ఇతను వైన్, మహిళలు మరియు కవిత్వం పట్ల ఆసక్తి కలిగి “రంగిలా”గా ప్రసిద్ధి చెందారు, ముహమ్మద్ షా రంగిలా పాలనలో పర్షియాకు చెందిన నాదిర్ షా ఢిల్లీని స్వాధీనం చేసుకుని దోచుకున్నారు, 30,000 మందికి పైగా చంపబడ్డారు మరియు నెమలి సింహాసనాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.

ముహమ్మద్ షా రంగీలా యొక్క మూడవ భార్య, కుడ్సియా బేగం, రాజు ప్రేమించి వివాహం చేసుకున్న మాజీ నాట్యకత్తే, 1748 నుండి 1756 వరకు తన కుమారుడు అహ్మద్ షా బహదూర్ పాలనలో కుడ్సియా బేగం ప్రముఖ పాత్ర వహించినది.  .

కుడ్సియా బేగం యొక్క కళా వారసత్వం ఆమె పేర ఉన్న కుడ్సియా బాగ్‌లో ఉంది. కుడ్సియా బాగ్‌ ఒకప్పుడు కుడ్సియా బేగం నిర్మించిన ఒక రాజభవనాన్ని కూడా కలిగి ఉంది, కానీ 1857 తిరుగుబాటులో అది ధ్వంసం చేయబడింది. మరియు ఢిల్లీ గేట్‌కు నైరుతి మూలలో వెలుపల ఉన్న సునేహ్రి మసీదు, కుద్సియా బేగం యొక్క అద్భుత శాశ్వత వాస్తుశిల్పం కు ప్రతిక  అని చెప్పవచ్చు

బాబర్ అమ్మమ్మ, ఐసన్ దౌలత్ బేగం కూడా ప్రసిద్ది చెందిన మొఘల్ మహిళలలో ఒక

No comments:

Post a Comment