13 August 2021

టోక్యో ఒలింపిక్స్‌లో బాగా రాణించిన 10 మంది ముస్లిం అథ్లెట్లు 10 Muslim Athletes Who Made Headlines At Tokyo Olympics

 


 

టోక్యో: ఒక సంవత్సరం ఆలస్యం తరువాత ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ 2021 లో 33 క్రీడాంశాలలో 11,000 కంటే ఎక్కువ మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వారిలో రెండు డజన్ల కంటే ఎక్కువ OIC దేశాల నుండి అనేక మంది ముస్లిం అథ్లెట్లు పాల్గొన్నారు  మరియు కొందరు ముస్లిం అథ్లెట్లు ముస్లిమేతర దేశాల నుండిపాల్గొన్నారు..

టోక్యో ఒలింపిక్స్ 2020 లో రాణించి వార్తల్లో నిలిచిన 10 మంది ముస్లిం అథ్లెట్స్:

 


1. సిఫాన్ హసన్ Sifan Hassan

నెదర్లాండ్స్ యొక్క సిఫాన్ హసన్ ఒకె  ఒలింపిక్స్‌లో మూడు ట్రాక్ ఈవెంట్‌లలో- 1,500, 5,000 మరియు 10,000 మీటర్లు పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచింది..

సిఫాన్ హసన్ ఇథియోపియాలోని ఒరొమియాలోని అడమాలో జన్మించారు శరణార్థిగా ఇథియోపియాను విడిచిపెట్టి, 15 సంవత్సరాల వయస్సులో 2008 లో నెదర్లాండ్స్ చేరుకుంది.

 

2. ఫెరియల్ అబ్దేలాజిజ్ Feryal Abdelaziz

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల కరాటే కుమిటే +61 కిలోగ్రాముల పోటీలో ఫైనల్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన ఇరినా జారెట్స్‌కాను 2-0తో ఓడించి ఫెరియల్ అబ్దేలాజీజ్ స్వర్ణాన్ని గెలుచుకుంది, టైటిల్ గెలిచిన మొదటి ఈజిప్టు మహిళగా నిలిచింది.

టోక్యో లో అబ్దేలాజీజ్ విజయం 17 సంవత్సరాల తరువాత  ఈజిప్ట్ యొక్క మొదటి బంగారు పతకాన్ని సాధించింది.

1999 లో జన్మించిన ఫెరియల్ అబ్దేలాజీజ్ కైరోలో కరాటే లో శిక్షణ  తీసుకున్నప్పుడు ఆమె వయస్సు ఏడేళ్లు. అబ్దేలాజీజ్ విద్యలో ఫార్మసిస్ట్ కావడానికి కూడా శిక్షణ పొందింది



3. ఫారెస్  ఎల్-బఖ్ Fares El-Bakh:

ఖతార్‌కు చెందిన ఫారెస్ ఎల్-బాఖ్ టోక్యో గేమ్స్ 2021 లో పురుషుల 96 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మొత్తం 402 ​​కిలోల బరువును ఎత్తి స్వర్ణం సాధించి  కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు.

 ఈజిప్షియన్ సంతతికి చెందిన ఖతార్ వెయిట్ లిఫ్టర్ఎల్-బఖ్ స్నాచ్‌లో 177 కిలోలు ఎత్తి క్లీన్ అండ్ జెర్క్‌లో 225 కిలోల బరువు ఎత్తి  ఒలింపిక్ రికార్డును నెలకొల్పారు.

4. మొహమ్మద్ కరీం స్బిహి Mohamed Karim Sbihi:

మొహమ్మద్ కరీం స్బిహి, బ్రిటీష్ రోవర్ మరియు రోవర్ హన్నా మిల్స్‌తో కలిసి గ్రేట్ బ్రిటన్ జెండాను మోసిన మొదటి ముస్లిం.

మో స్బిహి 2020 టోక్యో గేమ్స్ లో పురుషుల రోవింగ్ లో కాక్స్లెస్ ఎయిట్ విభాగం లో  కాంస్య పతకాన్ని సాధించాడు.

 

5. జలోలోవ్ బఖోదిర్ Jalolov Bakhodir:

ఉజ్బెకిస్తాన్ యొక్క జలోలోవ్ బఖోదిర్ ఒలింపిక్ సూపర్-హెవీవెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు, మరియు టోక్యో గేమ్స్ 2021 లో తన దేశం సాధించిన మూడు బంగారు పతకాలలో ఒకదాన్ని గెలుచుకున్నాడు.



6. మీట్ గాజోజ్Mete Gazoz:

2020 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో టర్కీకి చెందిన మీటే గాజోజ్ ఒలింపిక్ పురుషుల వ్యక్తిగత ఆర్చరీ లో స్వర్ణం  గెలుచుకున్నాడు.. టోక్యో క్రీడల్లో టర్కీకి మొదటి బంగారు పతకాన్ని సాధించిన ఘనత గజోజ్ పొందాడు.టోక్యో ఒలంపిక్స్ లో . టర్కీ 2 గోల్డ్‌తో సహా మొత్తం 20 పతకాలు సాధించినది. 1999 లో ఇస్తాంబుల్‌లో జన్మించిన మీటే గాజోజ్ చాలా చిన్న వయస్సు నుండే విలువిద్యను అభ్యసించారు.

 

7. బార్షిమ్ ముతాజ్ ఎస్సా Barshim Mutaz Essa:

టోక్యో గేమ్స్ 2021 లో ముతాజ్ ఎస్సా బార్షిమ్, పురుషుల హై జంప్‌లో ఖతార్ కోసం స్వర్ణం గెలుచుకున్నాడు. అతను ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మరియు 2.43మీటర్ల  వ్యక్తిగత అత్యుత్తమ ఆల్ టైమ్ అత్యుత్తమ జంపర్.

 

8. హఫ్నౌయి అహ్మద్ Hafnaoui Ahmed

18 ఏళ్ల స్విమ్మర్ అహ్మద్ అయూబ్ హఫ్నౌయి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆఫ్రికాలో మొదటి మరియు ట్యునీషియా యొక్క ఏకైక బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

18 ఏళ్ల ట్యునీషియన్ హఫ్నౌయి టోక్యోలో 3: 43.36 టైమ్‌తో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు.

. 


 

9. ఎల్ బక్కలి సౌఫియాన్ El Bakkali Soufiane

మొరాకోకు చెందిన సౌఫియాన్ ఎల్-బక్కలి 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో మొరాకో కోసం ఏకైక బంగారు పతకాన్ని ఎనిమిది నిమిషాలు, 8.90 సెకన్లలో సాధించాడు.

గతంలో, ఎల్-బక్కలి 2019 లో ఖతార్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

 

10. అక్బర్ జురేవ్ Akbar Djuraev:

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అక్బర్ జురేవ్ 109 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో  స్వర్ణం గెలుచుకున్నాడు. జురేవ్ 430 కిలోల ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు, ఇందులో క్లీన్ అండ్ జెర్క్ 237 కిలోలు మరియు స్నాచ్ లిఫ్ట్ 193 కిలోలు.

2019 లో, అతను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ మరియు మొత్తంలో జూనియర్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాడు

.

 

No comments:

Post a Comment