10 August 2021

వియత్నాంలో ఇస్లాIslam in Vietnam,

 

 




 

వియత్నాంలో ఇస్లాం ప్రధానంగా   మైనారిటీ జాతి సమూహం అయిన చామ్ ప్రజల ధర్మం. వీరు ప్రధానంగా మలేయుల/Malays జాతి కి చెందిన వారు.అయితే, వియత్నాంలో ముస్లింలు దాదాపు మూడింట ఒక వంతు మంది మలేయుల/Malays జాతి కాకుండా ఇతర జాతి సమూహాలకు చెందినవారు ఉన్నారు. నైరుతిలోని చౌ డాక్ ప్రాంతం చుట్టూ ఇస్లాంను ఆచరించే మరియు చమ్ లేదా చం ముస్లింలు అని కూడా పిలువబడే మిశ్రమ జాతి మూలాలు (చాం, ఖ్మేర్, మలయ్, మినాంగ్, వియత్, చైనీస్ మరియు అరబ్) కలిగి తమను తాము చాం అని వర్ణించుకునే సమూహం కూడా ఉంది.

 

చరిత్ర ప్రకారం ఇస్లాం యొక్క మూడవ ఖలీఫా ఉస్మాన్ ఘని  మొదటి అధికారిక ముస్లిం రాయబారిని వియత్నాం మరియు టాంగ్ రాజవంశం పరిపాలించే చైనా కు పంపారు, ఆ రోజులలో చైనాలో 650మంది  సముద్రపు అరబ్ వ్యాపారులు కలరు. వీరు  చైనాకు వెళ్లే మార్గంలో చంపా కింగ్‌డమ్‌లోని వివిధ పోర్టుల వద్ద కలరు.

 

చైనా లో ఇస్లాం చరిత్ర కు సంభందించి  సాంగ్ రాజవంశం-కాలం నాటి డాక్యుమెంట్లు కలవు. ఈ రికార్డుల ప్రకారం 10వ శతాబ్దం చివరలో మరియు 11వ శతాబ్దం ప్రారంభంలో చాం ప్రజలకు ఇస్లాంతో పరిచయం అయినది.  క్రమంగా ముస్లిం విశ్వాసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.1471లో చంపా రాజ్య పతనంతో  మలక్కా సుల్తానేట్ విస్తరించబడినది.

 

17వ శతాబ్దం  మద్య భాగం నాటికి  చామ్ ముస్లింల సంఖ్య పెరిగింది.  19వ శతాబ్దం మధ్యలో, చాలా మంది చాం ముస్లింలు వలస వచ్చారు మరియు వీరు కంబోడియా మరియు మెకాంగ్ నది డెల్టా ప్రాంతంలో స్థిరపడినారు,  దీంతో వియత్నాం లో ఇస్లాం ఉనికి మరింత బలోపేతం అయినది. 20వ శతాబ్దం ప్రారంభంలో మలయన్ ఇస్లాం మతం పెరగడం ప్రారంభమైంది. అది  చామలపై ప్రభావం; చూపినది.

 

ఇస్లామిక్ ధార్మిక సాహిత్యం మరియు మలయా నుండి వచ్చిన ఇస్లామిక్ ధార్మిక పండితులు మలయ్ భాష మసీదులలో ఖుత్బా (ప్రసంగాలు) ఇవ్వసాగారు  మరియు కొంత మంది చాం ప్రజలు ఇస్లామిక్  అధ్యయనాల కోసం  మలయాన్ మదరసాలకు వెళ్ళేవారు.

 

1976 లో వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ స్థాపన తర్వాత, వియత్నాం లో ఉన్న 55,000 ముస్లిం చాంలలో కొందరు మలేషియాకు వలస వచ్చారు. వారిలో చాలా మంది తాయిజ్‌Ta'izz.ప్రాంతం లో స్థిరపడ్డారు.  యెమెన్ 1,750 మంది వలసదారులను  అంగీకరించినది. వియత్నాం లో మిగిలి ఉన్నవారు పెద్దగా ప్రభత్వ వేధింపులకు  గురికాలేదు.అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం వారి మసీదులను  ప్రభుత్వం మూసివేసింది.

 

1981లో, వియత్నాం ముస్లింలు విదేశీ సందర్శకులలతో  మాట్లాడటానికి అనుమతించబడ్డారు. వియత్నాం లోని స్థానిక ముస్లింలు వారితో పాటు ప్రార్థన జరిపేవారు., 1985నాటి హో చి మిన్ సిటీ యొక్క ముస్లిం కమ్యూనిటీని ప్రత్యేకంగా జాతిపరంగా వైవిధ్యం కలది అని వర్ణించారు-చమ్ ముస్లిం లతో ఇండోనేషియన్లు, మలేయులు, పాకిస్థానీలు, యెమెనీలు, ఒమనీలు మరియు ఉత్తర ఆఫ్రికన్లు ఉన్నారు.ఆ సమయంలో వారి మొత్తం సంఖ్య దాదాపు 10,000.

వియత్నాం ముస్లింలు ప్రపంచ ఇస్లాం ప్రధాన స్రవంతి నుండి సాపేక్షంగా ఒంటరిగా ఉండిపోయారు. వారు  ఒంటరితనం, మతపరమైన పాఠశాలల కొరతతో భాధపడినారు.  వియత్నాంలో ఇస్లాం ధార్మిక అభ్యాసం సన్నగిల్లినది.

వియత్నాం సామాన్య ముస్లిములతో పాటు  ధార్మిక పండితులకు  కూడా అరబిక్ మీద పట్టు పెద్దగా  లేదు మరియు కొంతమంది ముస్లింలు అలీని ప్రార్థిస్తారు  మరియు అతడిని "అల్లాహ్  కుమారుడు".గా నమ్ముతారు.

 

చం లేదా చాం ముస్లిములకు ఇస్లామిక్ భోధనలు వివరించే  రచనలు మలేషియా మరియు ఇండోనేషియా నుండి వస్తాయి. వియత్నాం ఇస్లామిక్ మత పండితులు  మలేషియా మరియు ఇండోనేషియా లో మతవిద్య పొందుతారు.. పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలను కాపీ చేయడం మరియు పంపిణీ చేయడం వియత్నాంలో అనధికారికంగా నిషేధించబడింది

 

మసీదులను నిర్వహించడానికి మరియు పునర్నిర్మించడానికి, చమ్ ముస్లింలు బయటి నుండి వచ్చే మద్దతుపై ఎక్కువగా ఆధారపడతారు.వియత్నాం యొక్క అతిపెద్ద మసీదు జనవరి 2006 లో డాంగ్ నై ప్రావిన్స్‌లోని జువాన్ లోక్‌ లో ప్రారంభించబడింది; సౌదీ అరేబియా నుండి వచ్చిన విరాళాల ద్వారా దాని నిర్మాణానికి పాక్షికంగా నిధులు సమకూరాయి.

 

జనాభా గణాంకాలు

చామ్/ చం పురుషులు "బాటిక్ లుంగీ" ధరించి, నడుములో ముడి మరియు తెల్లటి స్కల్ టోపీలతో పొడవాటి చొక్కాలు ధరిస్తారు. చామ్ మహిళలు హిజాబ్ ధరిస్తారు. చం/ చాం ప్రజలలో ఎక్కువమంది పురుషులు మత్స్యకారులు, లేదా మీకాంగ్ నదికి సమీపంలోని చేపల పెంపకంలో పనిచేస్తున్నారు మరియు మహిళలు ఎక్కువగా చామ్ నమూనా బట్టలను ఉత్పత్తి చేస్తున్నారు లేదా స్థానిక మార్కెట్‌లో విక్రేతలుగా పనిచేస్తున్నారు

 


 ఏప్రిల్ 1999 జనాభా లెక్కల ప్రకారం వియత్నాం లో 63,146 మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో 77% పైగా దేశ ఆగ్నేయ ప్రాంతంలో నివసిస్తున్నారు. నిన్హ్ తువాన్ ప్రావిన్స్‌లో 34%, బిన్హ్ తువాన్ ప్రావిన్స్‌  Binh Thuan Provinceలో 24% మరియు 9% హో చి మిన్ సిటీ లో ;మరో 22% మంది మెకాంగ్ నది డెల్టా ప్రాంతంలో ప్రధానంగా యాన్ జియాంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. వియత్నాం ముస్లింలలో  కేవలం 1% మాత్రమే వియత్నాం లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు

 

 



వియత్నాంలోని చౌ డాక్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో చాం ముస్లిం వివాహం.

వియత్నాం లో ప్రధానం గా ముస్లిములు అధికం గా ఉన్న ప్రాంతాలలో ముస్లిం స్త్రీ-పురుష జనాభా మద్య వ్యత్యాసం కేవలం 2% లోపు ఉంటుంది,.యాన్ జియాంగ్ ప్రాంతం లో ముస్లిం మహిళల జనాభా, ముస్లిం పురుషుల జనాభా కంటే 7.5% ఎక్కువ ఉంది. ప్రస్తుతం ఈ నిష్పతిలో కొంచెం మార్పులు గమనించబడినవి.

 

1975కి ముందు,వియత్నాం లోని దాదాపు సగం మంది ముస్లింలు మీకాంగ్ నది డెల్టాలో నివసిస్తున్నారు,మరియు 1985 నాటికి, హో చి మిన్ సిటీ లోని ముస్లిం కమ్యూనిటీ దాదాపు 10,000 మంది వ్యక్తులను కలిగి ఉంటుంది.  .

 

ముస్లిం జనాభాలోని 54,775 మందిలో సభ్యులలో 5సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో  13,516 అనగా 25%కంటే ఎక్కువ మంది ప్రస్తుతం పాఠశాలకు హాజరవుతున్నారు, గతంలో 26,134, లేదా 48%, మంది పాఠశాలకు హాజరయ్యారు. మిగిలిన 15,121, లేదా 27%,మంది ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదు. కాగా వియత్నాం సాధారణ జనాభాలో 10% ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదు

 

.వియత్నాం లోని అన్ని మత సమూహాలలో పాఠశాలకు  హాజరు కాని వారిలో  రెండవ అత్యధిక రేటు ముస్లింలకు ఉంది. వియత్నాం లో ప్రొటెస్టంట్లలలో  34% అత్యధికరేటు తో పాఠశాలకు హాజరు కాని వారు కలరు. వియత్నాం ముస్లింలలో  పురుషులు  22% మరియు స్త్రీలు 32% మంది స్కూల్కు హాజరు కావుట లేదు.

 

వియత్నాం ముస్లింలు   ఉన్నత విద్యాసంస్థకు/ యూనివర్సిటీ హాజరులో అత్యల్పంగా అనగా 1% కంటే తక్కువ మంది ఉన్నారు. వియత్నాం జనాభా లో సాధారణ జనాభాలో 3%. ఉన్నత విద్యాసంస్థకు/ యూనివర్సిటీ హాజరు అయ్యారు.

 

హో చి మిన్ సిటీ ముస్లిం ప్రతినిధి కమిటీ ఏడుగురు సభ్యులతో 1991 లో స్థాపించబడింది. 2004 లో యాన్ జియాంగ్ ప్రావిన్స్‌లో ఇదే విధమైన సంస్థ ఏర్పడింది.

.

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment