8 August 2021

లుబ్నా అఫ్ కార్డోబా Lubna of Córdoba (మరణం 984)

 

 




 

 

లుబ్నా అఫ్ కార్డోబా  ఒక స్వీయ-నిర్మిత మహిళ కు అద్భుతమైన ఉదాహరణ.

కార్డోబా కు చెందిన  లుబ్నా 10 వ శతాబ్దం CE లో నివసించారు మరియు 984 లో మరణించారు. లుబ్నా ఆఫ్ కార్డోబా (అరబిక్: لبنى القرطبية)  )  10వ శతాబ్దం రెండవ భాగంకు చెందిన అండలూసియన్ మేధావి మరియు గణితశాస్త్రవేత్త. లుబ్నా ఒక  వ్యాకరణ వేత్త మరియు కవయిత్రి గా  ప్రసిద్ధి చెందినది. లుబ్నా కోర్డోబా ఖలీఫా అల్-హకం II, కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసారు.  

 

కార్డోబా కు చెందిన లుబ్నా బహుముఖ ప్రజ్ఞాశాలి. 10వ శతాబ్దపు ఉమ్మయాద్ రాజవంశ సమయంలో కార్డోబా కు చెందిన లుబ్నా అండలూసియాలోని రాజాస్థానంలో పనిచేసింది. లుబ్నా ఒక కవయిత్రి, లైబ్రేరియన్. గణిత శాస్త్రజ్ఞురాలు  మరియు ప్యాలస్/అంత:పురం సెక్రటరీ. ఆండలూసియన్ మహిళా మేధావి,సుల్తాన్ ఆస్థానంలో పనిచేసే అనేకమంది మహిళా ఉన్నతుద్యోగులలో  లుబ్నా ఒకరు.

 

లుబ్నా  జన్మత:ఒక స్పానిష్ బానిస  కాని తన ప్రతిభతో మరియు కృషితో అండలూసియన్ రాజ ఆస్థానంలో ఉన్నోతోద్యోగిని అయింది. లుబ్నా  కార్డోబా  సుల్తానులకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండే స్థాయి కు చేరుకొంది.  

 

కార్డోబా లైబ్రరీలో, లుబ్నా అనేక మాన్యుస్క్రిప్ట్‌లకు లేఖరిగా మరియు అనువదించే బాధ్యత వహించారు. లుబ్నా ఒక లేఖరిగా, కార్డోబా రాయల్ గ్రంథాలయానికి రచనలను జోడించింది, లుబ్నా స్వయంగా అనేక ముఖ్యమైన చారిత్రాత్మక గ్రీకు గ్రంథాలను కూడా అనువదించింది. హస్దై ఇబ్న్ షప్రూత్‌Hasdai ibn Shaprut,తో పాటు, లుబ్నా  500,000 కంటే ఎక్కువ పుస్తకాలకు నిలయమైన కార్డోబా లోని మదీనా అజహారా ప్రసిద్ధ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయడం లో ప్రముఖ పాత్ర వహించారు. లుబ్నా కార్డోబలో సుమారు  4,00,000 పుస్తకాలు గల 70 ప్రజా గ్రంథాలయాలు పర్యవేక్షించినది కూడా .

 

లుబ్నా మధ్యప్రాచ్యం అంతటా విస్తృతంగా ప్రయాణిస్తు కైరో, డమాస్కస్ మరియు బాగ్దాద్‌ నగరాల నుండి రాయల్ లైబ్రరీకి పుస్తకాలను సేకరించినది.  లుబ్నా మొదటి మహిళా ప్రయాణికులలో  ఒకరు.

 

పురాతన అరబ్ క్రానికల్స్ ప్రకారం, ఖలీఫ్ అల్-హకం II కాలంలో, కార్డోబా నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లో 170 మందికి పైగా అక్షరాస్యులైన మహిళలు కనిపిస్తారు; ఈ మహిళలు విలువైన మాన్యుస్క్రిప్ట్‌ల కాపీలను తయారు చేసేవారు.

 

లుబ్నా లైబ్రరీ ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధమైనది. ఒక మహిళను లైబ్రరి కి ఇన్‌ఛార్జ్‌ గా ఉంచడం లుబ్నా పట్ల ఆండలూసియన్ సుల్తానులకు ఉన్న   గొప్ప విశ్వాసానికి రుజువు, విద్యావంతులైన ముస్లిం మహిళలందరూ ఇస్లామిక్ చరిత్రలో గౌరవిoచబడినారు అనటానికి ఇది గొప్ప ఉదాహరణ.

 

లుబ్నా  ఒక అద్భుతమైన గణిత ఉపాధ్యాయురాలు కూడా. లుబ్నా  కార్డోబా పిల్లలకు  గణిత సమీకరణాలను  నేర్పేది

 

లుబ్నా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆమె చాలా వెనుకబడిన మూలాల నుండి చాలా ఎత్తుకు ఎదిగింది. ఈ రోజు ఉన్నత మరియు విస్తృత లక్ష్యాలను కలిగిన ముస్లిం యువతకు ఆమె ఒక స్ఫూర్తి,

 

 

 

 

 

 

.

.

.

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment