తెలుగు -ఒకఅవలోకనం.
తెలుగుభాషాచరిత్ర
సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధురపరిమళమూ కలగలిసిన కమ్మనైనభాష తెలుగు. భారతదేశంలోని అతి ప్రాచీనభాషల్లో తెలుగుకూడా ఒకటి. భాషాశాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషావర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. తెలుగు 'మూలమధ్య ద్రావిడభాష' నుండిపుట్టినది.
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా
లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ
లిపినుండి ఉద్భవించింది.తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా
అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. .పర్షియను, ఉర్దూ పదాలు, బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఆంగ్ల పదాలు తెలుగు
కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి.
తెలుగుభాషమూలాలు
తెలుగుభాష మూలాన్వేషణకు
సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు., క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య
సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు భాష మూలపురుషులు ‘యానాదులు’. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది. తెలుగు భాష చరిత్రను మనము క్రీస్తు
శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి
ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము
చేయబడినదిగా గమనించ వచ్చు.
తెలుగు -అధికారభాషాసంఘం:
ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా
సంఘం (Andhra Pradesh
Official Language Commission) అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. 1974 లో ఈ సంఘం ఏర్పాటైంది.ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది., 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.
తెలుగుభాషాభివృద్ధికి, సాధికారతకు, అధికారభాషగాతెలుగుఅమలుకుకృషి- సూచనలు--చర్యలు
·
మన రాష్ట్రంలో తెలుగు
మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల
మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు
ఎక్కడా అమ్మకానికి దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది. ·
అనూ ,సూరి,లాంటి యూనీ కోడేతర
ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి
మార్చే మార్పిడి సాధనాలు కావాలి., ·
ప్రతి యేటా తెలుగు
వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ·
తెలుగు మీడియంలో
కంప్యూటర్ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో
ప్రోత్సాహకాలు ప్రకటిOచాలి. ·
తెలుగులో కంప్యూటర్
వాడకం పెరగాలి. ·
గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసు ఉద్యోగాలలో
డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు
ఇవ్వాలి. ·
తెలుగులో తయారైన పి.డి.యఫ్. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్ లోకి మార్చగలిగే స్థాయి రావాలి. ·
తెలుగు బాషోద్యమ
సమాఖ్య చాలాకాలంగా కోరుతున్నట్లు తెలుగు భాషా రక్షణ అభివృద్ధికై మంత్రిత్వ శాఖను
ఏర్పాటు చేయాలి. ·
వక్ఫ్‌బోర్డు వివాహ
ద్రువపత్రాలను తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. ·
తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన
నిఘంటువుల అవసరం ఉంది . ప్రాచీన భాషా పీఠం నిధులతో మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపదగీతాలు, పాత చిత్రాలలోని
పాటలు మొదలైన సాహిత్య గ్రంథాలు ముద్రించాలి. ·
ఆధునిక అవసరాలకు
ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్నసౌలభ్యాలన్నీ తెలుగుకూకల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ
పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ ` పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా
పరికరాలు, పదాను క్రమణికలు… ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే
నిఘంటువులకు కొత్త పదాలను జోడిరచే అవకాశం అందరికీ ఇవ్వాలి. ·
నాయకులు, అధికారులు ముందు తమ
మనసుల్లో తెలుగుభాష పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి, తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో
చదివించాలి. ·
రాష్ట్ర ప్రభుత్వం తన
చట్టాలన్నీ తెలుగులోకి అనువదించి, ముద్రించి అన్ని కార్యాలయాలకు సరఫరా చెయ్యాలి. ·
పబ్లిక్ సర్వీస్
కమీషన్ శాఖాపరమైన పరీక్షలన్నీ తెలుగులోనే జరపాలి. ·
అన్ని పోటీ
పరీక్షల్లో తెలుగు భాషా పరిజ్ఞానం మీద ఒక ప్రశ్నాపత్రం ఉండాలి. ·
తెలుగులో
పట్టభద్రులైన వారికి 5 శాతం మార్కులు గ్రూప్ 1 పరీక్షల్లో
కూడా ఉచితంగా ఇవ్వాలి. ·
సచివాలయంలోని
ఇంగ్లీషు టైపు మిషన్లన్నీ తీసివేసి, వాటి స్థానంలో తెలుగు టైపు మిషన్లు ఉంచాలి. ·
కోర్టుతీర్పులు, ప్రతి జి.వో.
తెలుగులో రావాలి. ·
లిపి సంస్కరణ జరిపి
తెలుగు టైపును సులభతరం చెయ్యాలి. ·
రాష్ట్ర ప్రభుత్వం
నడుపుతున్న ఇంగ్లీషు మీడియం పాఠశాలలన్నిటినీ తెలుగు మీడియంలోకి మార్చాలి. తెలుగు
మీడియం పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సహాయం అందాలి. విశ్వవిద్యాలయాల్ల్లోని
చదువులన్నీ క్రమంగా తెలుగులోకి మార్చాలి. ·
రాష్ట్ర ప్రభుత్వం ఒక
సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువును తయారు చేయించాలి. తెలుగు జాతీయాలను, సామెతలను,మాండలికాలను, వివిధ ప్రాంతాలలోని
యాసపదాలను క్రోడికరించి ప్రామాణిక గ్రంధాలుగా వెలువరించాలి. ·
స్నాతకోత్తర పరిశోధన
విద్యలను కూడా తెలుగులో నడపటానికి వీలుగా శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను
తెలుగులోకి మార్చుకోవాలి. ·
తెలుగును దేశంలో
రెండవ అధికార భాషగా ప్రకటించేందుకు కేంద్రం మీద వత్తిడి తేవాలి. ·
తెలుగు మాధ్యమం
ద్వారానే కళాశాల స్థాయి వరకు చదివిన అభ్యర్ధులకు అన్ని ఉద్యోగాల్లో కొంతశాతం
రిజర్వేషన్ కల్పించాలి. ముఖ్యంగా గ్రూప్ 1 సర్వీసుల్లో
ఇలాంటి రిజర్వేషన్ ఉండాలి. ·
అలాగే స్నాతకోత్తర
విద్యను కూడా తెలుగులోనే పూర్తిచేసిన ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో
ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ·
ఇప్పటికే తెలుగులో
బాగా పాతుకుపోయిన ఇతర బాషల పదాలను యధాతథంగా వాడుకోనివ్వాలి. అనువదించటానికి
వీలులేని మాటలు, తెలుగులో వేరే పదాలులేక బహుళ ప్రచారం పొందిన పరభాషా
పదాలను, వాడుకభాషలోని సంకర పదాలను స్వేచ్ఛగా ఫైల్స్‌లో రాసుకోనివ్వాలి. ఇతర సూచనలు 1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ
ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 2) ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి
వరకు తెలుగు మీడియం ఉండాలి. 3) వ్యాపార సంస్థలు, దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి
లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా
సంఘానికి కూడా ఉండాలి. 4)తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు రెండవ స్థానంలో
ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి. 5)రాజ్యాంగంతో సహా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. 6)ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ
అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. 7)స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా
చర్యలు తీసుకోవాలి. 8)మండల స్థాయి నుండి
సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం
అధికార భాషా సంఘానికి ఇవ్వాలి ముగిoపు: తెలుగు
అధికార భాషగా అమలు జరపాలని రాష్ట్రప్రభుత్వం ఎంతగానో ఆశిస్తున్నప్పటికి
ఎన్నో అవరోధాలు
ఎదురవుతున్నాయి. ప్రస్తుతం 8 కోట్ల మందికి తెలుగు
మాతృభాష. ఇది ప్రపంచ భాషలన్నిటిలో 15వ స్థానాన్ని, భారతదేశంలో 3వ
స్థానాన్ని ఆక్రమిస్తున్నది. అయినా పరిపాలనలో ఈ భాష ఆశించినంతగా అమలు జరగటంలేదు.
తెలుగుభాష పట్ల మక్కువను పెంచుకోవటం ప్రాంతీయతత్వమనో, వేర్పాటుధోరణి అనో అనేవాళ్ళు సంకుచితంగా ఆలోచిస్తున్నారని
అనక తప్పదు. తెలుగు మాతృభాషగా కలిగిన ప్రజలు ఏ మతస్థులయినప్పటికీ వారు తెలుగువారు.
తల్లిని గౌరవించినట్లుగా తెలుగును గౌరవిద్దాం. అందరమూ కలసి మన భాష ఔన్నత్యం కోసం, ప్రగతి కోసం, పరివ్యాప్తి కోసం
కృషిచేద్దాం ! వ్యాసమూలాలు ·
Telugu – Wikipedia ·
Telugu Adikara Basha
Sangham. ·
Telugu-Andhra
Bulletin.com ·
Adikarabashaga
Telugu-N.Rahamatulla.Blogspot. ·
తెలుగు భాష విశిష్టత – N. Rahamtulla ·
Andhra Bhoomi, Surya
Telugu News Papers ·
Telugu Taja Varthalu ·
Pravasarajyam ·
P.Subba chari Dravid
Universisty. ·
A.P. Times.com ·
Telugu viswabasha
kavali-Andhra Jyothi News Paper. ·
Telugu Language
History – V.Avinash. ·
తెలుగుప్రాచీనత: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm ·
ఆంధ్రులచరిత్ర -
డా. బి.యల్.హనుమంతరావు ·
తెలుగుసంస్కృతి -
మల్లంపల్లిసోమశేఖరశర్మవ్యాసము ·
Inscribed lid
of stone reliquary.
Government Museum Chennai. |
|
No comments:
Post a Comment