బిర్జీస్ ఖాదర్ ఆగష్టు 1845 ఆగస్టు 20న కైసర్ బాగ్, లక్నోలో ఔధ్ రాజ్య నవాబ్ వాజిద్ అలీ షా మరియు బేగం
హజ్రత్ మహల్ దంపతులకు జన్మించాడు. 1856 లో, బిర్జిస్ ఖాదర్ తండ్రి నవాబ్
వాజిద్ అలీ షా బ్రిటిష్ వారి చేత పదవీచ్యుతుడయ్యాడు మరియు కలకత్తా (ప్రస్తుత కోల్‌కతా)
పరిసర ప్రాంతమైన మెటియాబ్రూజ్‌కు బహిష్కరించబడ్డాడు మరియు అతని వారసుల రాచరికం
రద్దు చేయబడింది.
సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తరువాత ఖాదర్
బిర్జీస్ తల్లి బేగం హజ్రత్ మహల్ 1857 లో బిర్జీస్ ఖాదర్ ను అవద్ రాజ్యానికి నవాబ్ గా నియమించింది మరియు బేగం
హజ్రత్ మహల్ అతని రీజెంట్‌గా మారింది.
1857లో, ఈస్ట్ ఇండియా కంపెనీకి
వ్యతిరేకంగా సిపాయి తిరుగుబాటు చెలరేగింది. అవధ్‌లో తిరుగుబాటుదారులకు బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించారు. చిన్హాట్ యుద్ధంBattle of Chinhatలో తిరుగుబాటు దళాల
నిర్ణయాత్మక విజయం వలన బ్రిటీష్ వారు రెసిడెన్సీలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. జూన్ 5 న, పదకొండేళ్ల బిర్జీస్
ఖాదర్‌ను అతని తల్లి బేగం హజ్రత్ అవధ్ నవాబుగా ప్రకటించారు. దీనిని ఆనాటి తిరుగుబాటు
సైన్యం యొక్క ప్రధాన ప్రతినిధి జైలాల్ సింగ్ మరియు ఔద్ ఆస్థాన పెద్దలు విస్తృత
మద్దతు పలికారు.
చరిత్రకారుడు రుద్రంగ్షు ముఖర్జీ ప్రకారం తిరుగుబాటు సైన్యం, ఖాదర్
తరఫున బేగమ్ హజ్రత్‌ని ఔద్ రాజ్యాన్ని పాలించడానికి
అనుమతించినప్పటికీ, వారు
పెద్ద స్థాయిలో స్వయంప్రతిపత్తిని అనుభవించారు. బిర్జీస్ ఖాదర్ మొగల్ చక్రవర్తి
బహదూర్ షా II కి
ఉత్తరం వ్రాసి, తన
నియామకాన్ని ధృవీకరించమని కోరాడు. ఇది
మంజూరు చేయబడింది మరియు బిర్జీస్ ఖాదర్ కు వజీర్ బిరుదు లభించింది.
చరిత్రకారుడు కారుడు ముఖర్జీ ప్రకారం తిరుగుబాటుదారులు
గొప్ప ఉత్సాహంతో ఉన్నారు మరియు
రెసిడెన్సీకి అత్యంత ప్రభావవంతమైన దిగ్బంధనాన్ని అమలు చేశారు.తిరుగుబాటుకు ప్రజల
నుండి బలమైన మద్దతు లభించింది మరియు చర్చలు లేదా సహాయం కోసం బ్రిటిష్ వారు చేసిన
దాదాపు అన్ని విజ్ఞప్తులు పూర్తిగా విస్మరించబడ్డాయి, భారతదేశంలోని ఇతర
ప్రాంతాలో సిపాయిల తిరుగుబాటును
సమర్థవంతంగా అణచివేసినప్పటికీ, లక్నో (మరియు అవధ్) భారతదేశంలో బ్రిటీష్
వ్యతిరేక దళాలకు చివరి ప్రధాన కోటగా మిగిలిపోయింది మరియు నానా సాహిబ్, హోల్కర్ మరియు ఇతరులతో
సహా అనేక ఇతర తిరుగుబాటుదారులను ఆకర్షించింది.
సెప్టెంబర్ 1857 లో, జేమ్స్ అవుట్రమ్ మరియు
హెన్రీ హావ్‌లాక్James Outram and Henry Havelock ఆధ్వర్యంలో ఒక బ్రిటీష్
రెజిమెంట్ తిరుగుబాటు దళాల రక్షణను చేదించి రెసిడెన్సీలోకి ప్రవేశించింది. బిర్జీస్
ఖాదర్ మరియు బేగం హజ్రత్ బ్రిటిష్ వారి ఆకృత్యాలను వెల్లడిస్తూ కొన్ని ఫర్మానాలు
జారి చేసారు.
నవంబర్ 1857 లో, ది రెసిడెన్సీ జనాభా
సహాయంతో కోలిన్ కాంప్‌బెల్Colin Campbell, కింద ఉన్న మరొక
బ్రిటీష్ రెజిమెంట్, లక్నో
శివార్లలో బహుళ రక్షణలను చేదించి ముట్టడికి గురిఅయిన వారిని సురక్షితంగా తరలించడానికి స్థానిక
తిరుగుబాటు దళాలను ఓడించింది. ఆ తరువాత, క్యాంప్‌బెల్
తిరుగుబాటుదారుల దాడికి గురయ్యే ముప్పు ఉన్న ఇతర నగరాలను (ముఖ్యంగా అలంబాగ్)
రక్షించాలని ఎంచుకున్నాడు, కానీ
లక్నోలో బలమైన రక్షణ ను ఏర్పాటు చేయలేదు. తిరుగుబాటుదారులు లక్నోలో
పెద్ద సంఖ్యలో గుమికూడడం కొనసాగించారు, ఇది భౌగోళికంగా మరియు
వ్యూహాత్మకంగా తిరుగుబాటుదారుల భవిష్యత్తు వ్యూహాలకు ప్రయోజనకరంగా ఉంది. అల్రాంబాగ్‌లో, అవుట్రమ్ పై దాదాపు 30,000 తిరుగుబాటు దారులు ఆరు
సార్లు దాడి చేశారు,
డిసెంబర్ నాటికి, భారతదేశంలోని ఇతర
ప్రాంతాలలో తిరుగుబాటుదారుల కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు మరియు తిరుగుబాట్లు
పూర్తిగా అణిచివేయబడ్డాయి; తిరుగుబాటు
అధిపతులు ఒకరినొకరు వేరుచేయబడ్డారు మరియు అదే
నెలలో, తిరుగుబాటుదారులు
అంతర్గత వైరాన్ని ఎదుర్కొన్నారు. ఫైజాబాద్ మౌల్వీ అయిన అహ్మదుల్లా షా, దైవ సంకల్పం ఆధారంగా బిర్జీస్
ఖాదర్ నాయకత్వాన్ని సవాలు చేశాడు. తిరుగుబాటు దళాలు అంతర్గతంగా ఘర్షణ
పడ్డాయి మరియు ఫిరాయింపులు చాలా
సాధారణమైనవి.
ఫిబ్రవరి 1858 చివరలో కాంప్‌బెల్ నాయకత్వం లోని బ్రిటిష్ దళం
లక్నోవైపు ముందుకు సాగింది. మార్చి 16
నాటికి, తీవ్రమైన వీధి పోరాటాల తరువాత, బ్రిటీష్
దళాలు లక్నోను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. హజ్రత్ మహల్ బేగం మరియు ఆమె మద్దతుదారులు మరియు బిర్జీస్ ఖాదర్ నగరం విడిచి వెళ్ళవలసి వచ్చింది.
తిరుగుబాటుదారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారు.
బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారి క్షమాబిక్ష ను మరియు పెన్షన్ ఆఫర్‌ను తిరస్కరించింది మరియు బౌండి గ్రామీణ ప్రాంతాలకు
మరలినది. లక్నో పతనం తరువాత బేగమ్ హజ్రత్ మహల్ స్థానిక కోట నుండి తన పూర్వ పాలనను కొనసాగించారు: సేకరణలను స్వీకరించడం, రాజ దర్బార్ లను ఏర్పాటుచేయడం మరియు బిర్జీస్ ఖాదర్ పేరుతో ఆదేశాలు జారీ చేయడం చేసింది. తిరుగుబాటు దళాలను సమీకరించడానికి ప్రయత్నించారు
మరియు బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా మరో రౌండ్ సాయుధ పోరాటాన్ని ప్లాన్ చేశారు.
బ్రిటిష్ సంస్థలపై వ్యవస్థీకృత పద్ధతిలో తిరుగుబాటు
చేయమని స్థానిక ప్రజలను/తిరుగుబాటు సైనికులను కోరుతూ ప్రకటనలు జారీ చేయబడ్డాయి మరియు యుద్ధంలో
గాయపడిన లేదా మరణించిన వారికి బిర్జీస్ ఖాదర్ ద్రవ్య రీయింబర్స్‌మెంట్ ఇస్తామని
హామీ ఇచ్చారు.
మే 1858 లో బిర్జీస్ ఖాదర్ నేపాల్ ప్రధాన మంత్రి జంగ్ బహదూర్
రాణాకు ఒక లేఖ రాశారు, బ్రిటిష్ వారితో పోరాడటానికి తన సైన్యాన్ని
అవధ్‌కు పంపమని కోరారు. రానా సహాయం చేయడానికి నిరాకరించాడు, బదులుగా
లక్నో కమిషనర్ హెన్రీ మోంట్‌గోమేరీ లారెన్స్‌కు లొంగిపోయి క్షమాపణ అడగమని కోరాడు.
చాలా మంది స్థానిక తిరుగుబాటుదారులు ఓడిపోయారు మరియు బ్రిటిష్ వారి శిక్షకు
గురయ్యారు. బిర్జీస్ ఖాదర్ మరియు బేగం హజ్రత్ నేపాల్‌లోని
ఖాట్మండులో ఆశ్రయం పొందడానికి పశ్చిమ రప్తి నదిని దాటారు.
ఖాట్మండుకు వచ్చిన తరువాత, ఖాదర్ మళ్లీ రాణాకు ఆశ్రయం కోసం ఉత్తరం
రాశాడు. థపథాలీ దర్బార్Thapathali Durbar సమీపంలోని బార్ఫ్ బాగ్‌లోని ప్యాలెస్‌లో ఉండటానికి అనుమతించారు. బిర్జిస్
ఖాదర్ మరియు అతని తల్లి జీనత్ మహల్ తమ సహాయకులు మరియు
సైనికుల బృందం తో వచ్చారు.
నగదు చెల్లించిన వారికి ఆశ్రయం ఇవ్వబడినది. రాణా ఆశ్రయం పొందిన నవాబ్ పరివారం/తిరుగుబాటుదారుల
నుండి దాదాపు 40,000 రూపాయల విలువైన ఆభరణాలు కేవలం 15,000 రూపాయలకు కొనుగోలు చేసారు. ఈ ప్రక్రియలో రాణా విలువైన ఆభరణాలను చాలా
చౌకగా సంపాదించారు.
ఖాట్మండులో ఉంటున్నప్పుడు, బిర్జీస్ ఖాదర్ షాయర్ (కవి) అయ్యాడు
మరియు నగరంలో మెహఫిల్‌లను నిర్వహించాడు, వీటిలో మొదటిది 1864 లో నమోదు చేయబడినది.. ఖాదర్ తారాహి ముషైరా tarahi mushaira (recitals) లో కవితలు రాశాడు. ఖాదర్ కవితలను ఖాట్మాండులో నివసిస్తున్న కాశ్మీరీ
ముస్లిం ఖ్వాజా నయీముద్దీన్ బడకాశీ రికార్డ్ చేశారు.
నేపాల్‌లో ఉన్నప్పుడు, ఖాదర్ బహదూర్ షా జాఫర్ మనుమరాలు
మెహతాబ్ అరా బేగమ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు, ఖుర్షీద్ ఖాదర్ మరియు మెహర్ ఖాదర్
మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తండ్రి మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత, బిర్జీస్
ఖాదర్ కోల్‌కతాకు తిరిగి వచ్చాడు. 47 వయస్సులో బిర్జీస్ ఖాదర్ 14 ఆగస్టు 1893 న అరబాగ్ ప్యాలెస్‌లో మరణించాడు. బిర్జీస్
ఖాదర్ మరియు అతని కుమారుడు సమీప బండువులచే విషప్రయోగం ద్వారా ఒక విందులో హత్య
చేయబడ్డారు. అరా బేగం, గర్భవతిగా ఉన్నందున, విందుకు
హాజరు కాలేదు.
బిర్జీస్ ఖాదర్ ఖననం సిబ్తైనాబాద్ ఇమాంబరా, కోల్‌కతా Sibtainabad Imambara, Kolkata లో జరిగింది.
No comments:
Post a Comment