ఇటీవల పార్లమెంటు ఆమోదించిన 127వ సవరణ బిల్లు సామాజికంగా మరియు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులను (SEBC లు) గుర్తించి, పేర్కొనే
అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. ఇది ముస్లిం సమాజానికి వరం గా పేర్కొనబడినది.
విభిన్న వర్గాల పరిధిలో ఉన్నప్పటికీ, ఎన్నడూ విభజించబడని సమాజo గా ఉన్న ముస్లిం సమాజం ఇప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చుకునే
అవకాశం ఇచ్చింది..
ముస్లింలలో కుల వ్యవస్థ ప్రాబల్యం గురించి సామాజిక శాస్త్రవేత్తలు
విస్తృతమైన పరిశోధన చేశారు. ముస్లింలలో కులం యొక్క మూడు విస్తృత వర్గీకరణలు
ఉన్నాయని వారు నిర్ధారణకు వచ్చారు. వారు అష్రాఫ్‌లు (అగ్రవర్ణం) అజ్లాఫ్‌లు (హిందూ
ఓబిసికి సమానం) మరియు అర్జల్స్ (హిందూ దళితులకు సమానం). ఈ మూడు వర్గీకరణలలో, జనాభా లెక్క తెలియని అనేక ఉపవర్గాలు
ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో, 'అష్రఫ్' లో సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్ మరియు రంగద్ లేదా ముస్లిం రాజ్‌పుత్, తగా లేదా త్యాగి ముస్లింలు, గర్హె లేదా గౌర్ ముస్లింలు Rangad
or Muslim Rajput, Taga or Tyagi Muslims, Garhe or Gaur Muslims వంటి హిందూ అగ్రవర్ణo నుంచి మార్పిడి పొందిన వారు ఉన్నారు.
కుంజ్రే (రయీన్), జులహే
(అన్సారీ), ధునియా
(మన్సూరి), కసాయి
(ఖురేషి), ఫకీర్
(అల్వి), హజ్జామ్
(సల్మని), మెహతర్
(హలాల్‌ఖోర్), గ్వాలా
(ఘోసి), ధోబీ
(హవరి), లోహర్-బధాయ్
(సైఫీ ), మణిహర్
(సిద్ధిఖీ), దర్జీ (ఇద్రిసి), వంగుజ్జర్ Kunjre (Raeen), Julahe
(Ansari), Dhunia (Mansuri), Kasai (Qureishi), Fakir (Alvi), Hajjam (Salmani),
Mehtar (Halalkhor), Gwala (Ghosi), Dhobi (Hawari), Lohar-Badhai (Saifi),
Manihar (Siddiqui), Darzi (Idrisi), Vangujjar,, మొదలైనవారు అజ్లఫ్స్ మరియు అర్జల్స్ Ajlafs
and Arzals లో ఉన్నారు. .
"ముస్లిం
కులాల భారతీయ వర్గీకరణ"
ముస్లిం కులాల యొక్క దక్షిణ భారత వర్గీకరణ ఉత్తరాదికి భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకు, తమిళనాడులో, ముస్లిం కమ్యూనిటీ కులాలు మారక్కాయర్లు, లబ్బాయిలు, రౌథర్లు మరియు సోనకా మాపిల్లాలు Marakkayars,
Labbais, Rowthers and Sonaka Mapillas వంటివి. మరక్కాయర్లు తమిళనాడులో ఉన్నత
సామాజిక మరియు ఆర్థిక హోదాను కలిగి ఉన్నారు, కానీ వారు ఉత్తర భారతదేశానికి చెందిన
అష్రఫ్ కాదు.
అరబ్-తమిళ పూర్వీకుల తమిళ మాట్లాడే ముస్లింలు మరియు తమిళం/హిందీ/ఉర్దూ
మాట్లాడే మరియు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ముస్లింలు వంటి వర్గాలు ఉన్నాయి మరియు
అలాంటి అనేక ఇతర వర్గాలు ఉన్నాయి. తమిళ ముస్లింలు హిందూ OBC మరియు దళిత వర్గాల నుంచి మారారు.
ప్రతి రాష్ట్రంలో ముస్లింలలో విభిన్న ఉప-కుల వర్గాలు ఉన్నాయి, కానీ వారి సంఖ్య లేదు. భారతదేశంలో
ముస్లిం ఉప-కుల వర్గాలు కూడా గుర్తించబడలేదు. 127వ సవరణ బిల్లు ముస్లింలలో కులాల
ఉపవర్గాలను మరియు వారి జనాభా పరిమాణాన్ని బహిరంగపరచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి
చేయడానికి సరైన అవకాశాన్ని ఇస్తుంది.
1901 జనాభా
లెక్కలలో మొట్టమొదటిసారిగా ముస్లింలలో కుల వర్గీకరణ అధికారికంగా గుర్తించబడింది.
జనాభా గణన ముస్లింలలో 133 సామాజిక
సమూహాలను జాబితా చేసింది మరియు వాటిని మూడు విస్తృత సామాజిక వర్గాల కింద నమోదు
చేసింది.
1911 జనాభా
లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలలో 102 కుల సమూహాలను జాబితా చేసింది. వాటిలో
కనీసం 97 గ్రూపులు
అజ్లాఫ్‌లు/ అర్జల్స్ కేటగిరీలో ఉన్నాయి
"Scheduled
Caste"
"షెడ్యూల్డ్
కులం"
బ్రిటిష్ ప్రభుత్వం 1936 లో ప్రభుత్వ ఉత్తర్వు (GO) జారీ చేసింది, అందులో 'షెడ్యూల్డ్ క్యాస్ట్' అనే పదాన్ని ఉపయోగించింది, ఇది "అణగారిన తరగతులు depressed
classes " ఉన్న గ్రూపులను సూచిస్తుంది మరియు ఇందులో హిందువులు మరియు
ముస్లింలు కూడా ఉన్నారు.
స్వాతంత్య్రానంతరం, భారతీయ
శాసన సభలు ‘షెడ్యూల్డ్ క్యాస్ట్’ అనే బ్రిటిష్ నిర్వచనాన్ని మార్చారు, కులాలు హిందువులకు మాత్రమే ప్రత్యేకమైనవిగా
ప్రకటించి, షెడ్యూల్డ్ క్యాస్ట్’ హోదా పొందటం నుండి ఇతర మతానికి చెందిన
వ్యక్తులను మినహాయించినారు. ‘.
ముస్లింలను వెనుకబడి ఉంచడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం
ఇది. అర్జల్స్ హిందూ దళితులతో సమానమైన హోదాను పంచుకున్నారని, అయితే మతం ప్రాతిపదికన ‘షెడ్యూల్డ్ కుల’ హోదాను నిరాకరించబడినారని ఇది చెప్పకనే చెబుతుంది. ఇది ఆర్టికల్ 14 రాజ్యాంగ నిబంధనతో నేరుగా
విభేదిస్తుంది, ఆర్టికల్ 14 పౌరులందరిలో సమానత్వం గురించి
మాట్లాడుతుంది మరియు మతం ఆధారంగా వివక్ష చూపదు.
"ముస్లిం OBC లు"
తరువాత కొన్ని ముస్లిం కుల వర్గాలు 'ఇతర వెనుకబడిన తరగతులు (OBC) గా గుర్తించబడ్డాయి మరియు 27% రిజర్వేషన్ కోటా కిందకు వచ్చాయి.
ఏదేమైనా, ఇది
ప్రభుత్వం యొక్క షెడ్యూల్డ్ కుల నిర్వచనం లో వారిని తీసుకు రాదు. OBC హోదా కొంతమంది ముస్లింలకు విద్య మరియు
ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఉండవచ్చు కానీ షెడ్యూల్డ్ కులాల హిందువుల కోసం
ఉద్దేశించిన రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లిములకు
ఇవ్వదు. ఫలితంగా షెడ్యూల్ కులాల హిందువులు ఎన్నికల ప్రయోజనాలను అనుభవిస్తారు, మతపరమైన కారణాల వలన ముస్లింలు
వదిలివేయబడ్డారు.
సచార్ కమిటీ నివేదిక మరియు రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదికలు అనేక అర్జల్
కులాల ముస్లింల స్థితిని వెలుగులోకి తెచ్చాయి మరియు వారికి 'షెడ్యూల్డ్ కులాల' హోదా ఇవ్వాలని సిఫారసు చేశాయి కానీ
ప్రభుత్వం ఇప్పటివరకు డానికి కట్టుబడి
లేదు
.సుప్రీంకోర్టు విషయానికొస్తే, షెడ్యూల్ కులాల జాబితా నుండి
ముస్లింలను మినహాయించడంపై దాని అవగాహన దిద్దుబాటుకు గురైంది. ముందుగా, మత మార్పిడి తర్వాత ఒక వ్యక్తి యొక్క
కులం ఉనికిలో లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 1970లలో, మతం మారిన తర్వాత కులం ఉనికిలో ఉండదు, కానీ "గ్రహణం eclipsed " అయిందని తీర్పు ఇచ్చినప్పుడు ఈ
అభిప్రాయం మారింది.
‘సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (1985) ‘Soosai vs. Union of India case (1985), మార్పిడి తర్వాత కూడా కులం ఉనికిలో
ఉందని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే, భౌతిక సాక్ష్యాలు లేనందున కోర్టు యథాతథ స్థితి status quo ని కొనసాగించింది, ముస్లిం కుల సమూహాలకు గణన అవసరం అని
సూచించింది.
1950 ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఉందొ లేదో నిర్ణయించడం
సుప్రీంకోర్టు ముందు ఉన్న ప్రధాన సమస్య. 1950 ఆర్డర్ ఇతర మతాలకు మారిన వారికి నిశ్చయాత్మక ప్రయోజనాన్ని
నిరాకరిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. సుప్రీం కోర్టు తాజా నిర్ణయం ఏమిటంటే, క్రైస్తవులు మరియు ముస్లింలను షెడ్యూల్
కులాల జాబితా నుండి మినహాయిoచిన అవసరంను
పరిశీలించవలసి requires
consideration ఉంది.
"అగ్ర కుల ముస్లింలు"
ఏదేమైనా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముస్లింలలో కుల వర్గీకరణను
శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం లేదా ముస్లిం సమాజం ఎటువంటి ప్రయత్నం
చేయలేదనేది వాస్తవం. ప్రతి ఒక్కరికి వారి కుల వర్గం తెలిసినప్పటికీ, వారి వాస్తవ జనాభా పరిమాణం లేదా వారి
అభివృద్ధి స్థాయి గురించి తెలియకపోయినా అద్యయన ప్రయత్నం చేయలేదు.
అలాంటి అధ్యయనం లేనప్పుడు, దళిత మరియు ఓబిసి ముస్లింలు తమ అన్ని
రుగ్మతలకు అగ్రవర్ణ ముస్లింలను నిందిస్తారు. కుల గణన చేయమని మరియు వివిధ కులాల
వాస్తవ పరిమాణాన్ని మరియు వారి సామాజిక మరియు ఆర్థిక స్థాయిలను నిర్ధారించమని ఎవరూ
ప్రభుత్వాన్ని వేడుకోరు.
ముస్లిం సమాజం ప్రభుత్వం ముందు రెండు ప్రాథమిక
డిమాండ్లను ఉంచాల్సిన సమయం వచ్చింది.. మొదటిది కుల గణన చేయడం మరియు వారిలో వివిధ
వర్గాలను గుర్తించడం మరియు వారి జనాభా పరిమాణం మరియు వారి సామాజిక-ఆర్థిక
పరిస్థితిని కూడా నిర్ధారించడం.
రెండవ డిమాండ్ అర్జల్ ముస్లింలకు షెడ్యూల్
కులాల హోదా పొందాలి, వారు అలాంటి వర్గంలోకి వస్తారు, కానీ మతపరమైన కారణాల వల్ల వారికి దానిని
తిరస్కరించారు.
ప్రభుత్వం కూడా ముస్లిములను ఒకే monolithic సంఘంగా భావించకుండా ముస్లిం జనాభాను, వారి ఉప-కులాల breakup of their sub-caste వారిగా లెక్కిoచే ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం చేసే ఈ రకమైన ప్రయత్నం ముస్లిం సమాజాన్ని బాగా అర్థం
చేసుకోవడంలో సహాయపడుతుంది మరియు సమాజాన్ని ఉద్ధరించడానికి పథకాలను రూపొందించడంలో సహాయ
పడుతుంది..
-Ummid, Muslim Mirror సౌజన్యం తో
No comments:
Post a Comment