14 August 2021

ఉమర్ ఖాజీ (1763 – 1857), Umer Qazi (1763 – 1857)

 



 

మలబార్ ప్రాంతానికి చెందిన 18 వ శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు ఉమర్ ఖాజీ (ర) (1763-1857), భారత స్వాతంత్ర్య పోరాటంలో నాన్ టాక్సేషన్ ఉద్యమానికి ఆద్యుడుగా విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు, కేరళలోని పొన్నాని తీర పట్టణంలో ఉమర్ ఖాజీ జన్మించారు. ఉమర్ ఖాజీ,  ఖాసీ షేక్ హసన్ తాబీ మరియు అమీనా దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే ఉమర్ ఖాజీ తన తండ్రి నుండి ప్రాథమిక విద్యను  పొందాడు

ఉమర్ ఖాజీ ఒక ప్రముఖ కవి. సంఘ సంస్కర్త, ముస్లిం పండితుడు మరియు  స్వాతంత్ర్య సమరయోధుడు. ఉమర్ ఖాజీ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాడు. బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వానికి పన్ను చెల్లించడానికి నిరాకరించాడు.

ఉమర్ ఖాజీ కవిత్వం రాశాడు. జైలులో ఉన్న సమయంలో తన ఆలోచనను కవితల ద్వారా తెలియజేశాడు. ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్(స) పట్ల తన అభిరుచిని ఉమర్ ఖాజీ పద్యాలు మరియు గద్యాలలో వ్యక్తం చేశాడు అరబిక్‌లో అనేక స్తోత్రాలను eulogies రచించిన ఘనత కూడా ఉమర్ ఖాజీ కి కలదు.

ఉమర్ ఖాజీ త్వరలో చనిపోతాడని గ్రహించి, తన స్వంత సమాధిని సిద్ధం చేసుకున్నాడు మరియు మరణం కోసం ఎదురుచూశాడు

2021 లో "మలబార్ తిరుగుబాటు (1921) శతాబ్ది ఉత్సవాలు లరుగుతున్నాయి. అదేవిధంగా ఉమర్ ఖాజీ మరణించిన సంవత్సరం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమంగా పరిగణింపబడే 1857 తిరుగుబాటు సంవత్సరలో జరిగింది..

లెగసె:

UAE  ఆధారంగా పనిచేతున్న భారతీయ  రైటర్ ముజీబ్ జైహూన్ Mujeeb Jaihoon ఉమర్ ఖాజీ – ఒక కవి మరియు దేశ  భక్తుడు Umar Qazi : The Poet. The Patriot. అనే మలయాళం దేశభక్తి మ్యూజిక్   వీడియో ను రూపొందించాడు. మ్యూజిక్ వీడియో ను   ప్రముఖ కేరళ సూఫీ గాయకుడు సమీర్ బిన్సి Sameer Binsi మరియు ఇమాం మజ్బూర్ మరియు మితులేష్ Majboor and Mithulesh కలసి సంయుక్తంగా పాడారు. దుబాయ్ బేస్డ్ శాఫ్ బెయ్  పోర్ Shaf Beypore మ్యూజిక్ వీడియో కు మోషన్ గ్రాఫిక్ స్కెచెస్ అందించారు. మ్యూజిక్ వీడియో Youtube, Facebook and Instagram లో లబిస్తుంది.

 

No comments:

Post a Comment