19 August 2021

అస్మా బింతె అబూ బకర్: మహిళలకు ఆదర్శం Asma bint Abu Bakr: Role model for women









బిలాల్(ర) నుండి సుమయ్య(ర) వరకు, ఇస్లాం చరిత్ర అంతా ప్రవక్త (స) సహచరులు చేసిన త్యాగాలతో నిండి ఉంది. తొలి ముస్లింలలో అస్మా బింతే  అబూ బకర్‌(ర)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇస్లాం కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణియాలు.

 

అస్మా(ర) అబూ బకర్(ర) కుమార్తె మరియు విశ్వాసుల మాత  అయేషా(ర) యొక్క సోదరి.  ఆమె ఖలీఫా  అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి. ఆమె యొక్క నాలుగు తరాలు ప్రవక్త (స)సహచరులు. అస్మా(ర) ఇస్లాం మతంలోకి ప్రవేశించిన 18వ వ్యక్తి. అస్మా(స) తన చిన్న వయస్సు నుండే ఇస్లాంకు మద్దతు ఇచ్చింది. ప్రవక్త (స) యొక్క వలసలో ఆమె కీలక పాత్ర పోషించింది. థావర్‌ Thawr గుహ లో దాక్కున్న అబు బకర్(ర) మరియు ప్రవక్త (స) కోసం ఆహారాన్ని తీసుకువెళ్ళే బాద్యత  అస్మా(ర) కు అప్పగించబడింది. గుహ ఒక పర్వత మార్గంలో మూడు మైళ్ల దూరంలో ఉంది. ఆమె ఏడు నెలల గర్భవతి అయినప్పటికీ, ప్రతిరోజూ మూడు రోజులకు  సరిపడా  ఆహారాన్ని తీసుకువెళ్లేది.

 

చివరి రోజు అస్మా(ర) వారి ప్రయాణ సదుపాయాలు మరియు చర్మపు నీటి  తిత్తిని సిద్ధం చేసినప్పుడు వాటిని కట్టడానికి ఆమె వద్ద తాడు లేదు. ఆమె తన నితాక్ (నడుము బెల్ట్) ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఒకదానితో కట్టేసింది. దీనిని చూసి ప్రవక్త (స) చిరునవ్వుతో, “నిజంగా, అల్లాహ్ ఈ పట్టీకి బదులుగా మీకు  స్వర్గంలో రెండు బెల్టులను ఇచ్చాడుఅని అన్నారు.. అందువలన ఆమెకు "జు నాటకైన్ Zu Nataqain " (లేడీ ఆఫ్ టూ బెల్ట్) అని పేరు వచ్చింది.. ఆమె ఈ గౌరవప్రదమైన బిరుదును జీవితాంతం ధరించినది.

 

అబు బకర్(ర) మరియు ప్రవక్త (స) తవర్ గుహను విడిచిపెట్టిన తర్వాత, అబూ జహల్ వారి కోసం వెతుకుతూ వచ్చి కనపడ్డ అస్మా(ర)ను  చెంపల నుండి రక్తం కారేలా గట్టిగా కొట్టాడు. ధైర్యం మరియు సహనంతో బాధను భరించిన ఆమె రహస్యాన్ని వెల్లడించలేదు.

 

ప్రవక్త (స) మదీనా సమీపంలోని క్యూబా Quba కు చేరుకున్నప్పుడు, వారు తమ కుమార్తెలను కలిగి ఉన్న బృందాన్ని ఆహ్వానించారు  మరియు అస్మా(ర) వారితో పాటు వచ్చారు. వారు క్యూబా సమీపానికి చేరుకున్నప్పుడు ఆస్మా(ర)అబ్దుల్లా బిన్ జుబైర్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ప్రవక్త (స) చాలా సంతోషించారు. ప్రవక్త(స) తన ఒడిలో బిడ్డను తీసుకొని, శిశువు నోటిలో నమిలిన ఖర్జూరం పెట్టారు. మదీనాలో ముహాజిరిన్‌కు పుట్టిన మొదటి బిడ్డ అబ్దుల్లా.


జుబైర్ ఇబ్న్ అల్-అవమ్ Zubair ibn Al-Awwam, ఆమె భర్త, మక్కాలోని ప్రతిదీ వదిలి ఖాళీ చేతులతో మదీనాకు వలస వచ్చారు. అస్మా(ర) ప్రారంభంలో చాలా కష్టపడ్డారు. ఒక ధనవంతుడి కుమార్తె జంతువులను చూసుకోవడం, పిండి వేయడం, రుబ్బడం మరియు నీటిని తీసుకురావడం వంటి పనులను చేసింది. మదీనా కు  రెండు మైళ్ల దూరంలో ఉన్న వారి పొలం నుంచి     ఆమె తలపై తట్టలో ఖర్జూరాలను మోసుకొంటూ తీసుకువచ్చేది.

 

అస్మా(ర) సహనం యొక్క నిజమైన పరీక్ష కర్బాలా వద్ద హుస్సేన్ ఇబ్న్ అలీ (ర) యొక్క బలిదానం తర్వాత కనిపించింది. అప్పుడు ఆస్మా(ర)వయస్సు దాదాపు 90 సంవత్సరాలు. కర్బాలా విషాదం తరువాత, ప్రజలు ఆమె కుమారుడు అబ్దుల్లా బిన్ జుబైర్ చదువుకొన్న,  శక్తివంతుడు  మరియు ధైర్యవంతుడని తెలుసుకొని అతని చుట్టూ చేరారు. అతను మక్కా మరియు మదీనా ప్రజల మద్దతును పొందడంలో విజయం సాధించాడు. చివరికి, అబ్దుల్లా తన అధికారాన్ని ఇరాక్, హిజాజ్, దక్షిణ అరేబియా, సిరియాలో ఎక్కువ భాగం మరియు ఈజిప్ట్‌ లో కొన్ని ప్రాoతాలలో స్థిరం చేశాడు.

 

డమాస్కస్ పాలకుడు అబ్దుల్ మాలిక్ బిన్ మార్వాన్‌పై పోరాటానికి ముందు అస్మా(ర) తన కుమారుడికి ఇలా సలహా ఇచ్చారు-“వ్యర్థమైన మరియు అన్యాయమైన కారణంతో చంపబడితే మాత్రమే నీ కోసం బాధపడతాను”. ఆస్మా ఇలా అన్నారు-"అగౌరవంతో కూడిన శాంతీయుత  జీవితం కంటే గౌరవంతో కూడిన మరణం ఉత్తమం."



మర్వాన్ కమాండర్ హజాజ్ బిన్ యూసుఫ్‌తో పోరాడటానికి అబ్దుల్లా ముందుకు సాగారు  మరియు అమరుడయ్యే వరకు పోరాడుతూనే ఉన్నారు. క్రూరమైన హజాజ్,  అబ్దుల్లా తలని నరికి, శరీరాన్ని చెట్టుపై వేలాడదీశాడు. హజాజ్ ఇలా ప్రకటించాడు, "అస్మా(ర) తప్ప ఎవరూ అబ్దుల్లా శరీరాన్ని తీయరాదు. అందుకు ఆస్మా (ర) నా దగ్గరకు వచ్చి నా అనుమతి అడగాలి. అస్మా(ర) వెళ్ళడానికి నిరాకరించింది. చివరికి హజాజ్ అస్మా(ర) వద్దకు వచ్చి, "ఈ విషయం గురించి మీరు ఏమి చెబుతారు?" అన్నాడు. ఆస్మా (ర) ధైర్యంగా, "నిజమే, మీరు అతన్ని నాశనం చేసారు మరియు అతని జీవితాన్ని నాశనం చేసారు, దానితో పాటు మీరు మీ పరలోకాన్ని నాశనం చేసుకొన్నారు."అని అన్నది.

 

ఆస్మా (ర) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సారి ఇలా చెప్పినట్లు, అది  ఆమె విన్నట్లు పలికినది:బను తకీఫ్ తెగ నుండి ఒక వ్యక్తి కనిపిస్తాడు, అతను అబద్ధికుడు మరియు క్రూరమైన మరియు తెలివితక్కువ అనాగరికుడు. ఈ రోజు నేను  అతడిని స్వయంగా చూసాను.. " అంతటా హజాజ్ బిన్ యూసుఫ్ అక్కడి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. తరువాత అబ్దుల్లా  మృతదేహాన్ని హుజాజ్ స్మశానంలో పడేశాడు. ఆస్మా(ర) శవ స్నానం, అంత్యక్రియల ప్రార్థన కోసం ఏర్పాట్లు చేసింది మరియు ఆమె తన చేతులతో తన కుమారుడు అబ్దుల్లా బిన్ జుబైర్‌ను మక్కాలో ఖననం చేసింది.

 

73AH లో తన కుమారుడిని ఖననం చేసిన కొద్ది రోజులకే అస్మా(ర) మరణించినారు. అప్పుడు  ఆమె వయస్సు 100 సంవత్సరాలు, కానీ ఆమె తన  జ్ఞాపకశక్తిని కోల్పోలేదు మరియు పూర్తి దంతాలను కలిగి ఉంది. ఆమె 636AC లో యార్ముక్ యుద్ధంలో పాల్గొంది మరియు ధైర్యంగా పోరాడి రోమన్ దళాలను సిరియా నుండి తరిమికొట్టింది.

 

ఆస్మా (ర) 58 హదీసుల వ్యాఖ్యాత, మరియు హదీసులకు సంబంధించిన ప్రముఖులు ఆమెకు సంభందించిన వారు.  జన్నతుల్ ముయాలా Jannatul Muala యొక్క ఒక మూలలో ఉన్న ఒక చిన్న సమాధి ఈ గొప్ప మహిళ (ఆస్మా(ర)ది. అస్మా బింతే  అబూ బకర్ నిజంగా ముస్లిం మహిళలకు గొప్ప రోల్ మోడల్.

 

జబల్ థావర్‌ Jabal Thawr కు వెళ్లేటప్పుడు రోడ్డుపై జు నటకైన్ స్ట్రీట్ అనే గుర్తు కనిపిస్తుంది. మరియు అది ఆస్మా (ర) తవ్ర్ గుహ Jabal Thawr లో ఉన్న ప్రవక్త (స) వద్దకు వెళ్ళడానికి నడిచిన మార్గం. ఈ ప్రదేశంలో కొద్దిసేపు వేచి ఈ గొప్ప ఆత్మల కోసం ప్రార్థిoచుదాము. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారికి స్వర్గంలో అత్యున్నత స్థానాలను ప్రసాదించాలి.

 

 


 

 

 

 

 

  

No comments:

Post a Comment