భారతదేశంలో
మహిళలు వెనుకబడి ఉండటానికి విడాకులు నిజంగా ప్రధాన కారణమైతే, భారతీయుల వైవాహిక స్థితిపై సెన్సస్ 2011 డేటా ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో
ముస్లిం సమాజానికి చెందిన వారి కంటే ఎక్కువ మంది హిందూ మహిళలు విడాకులు
తీసుకున్నారు - ప్రత్యేకంగా చెప్పాలంటే మూడు సార్లు కంటే ఎక్కువ.
"విడాకులు తీసుకున్న భారతీయ మహిళలలో, 68 శాతం మంది హిందువులు కాగా కేవలం 23.3 శాతం మంది ముస్లింలు", భారతీయుల వైవాహిక స్థితిపై 2011 జనాభా లెక్కల డేటాను ఉటంకిస్తూ
ఇండియాస్పెండ్.ఆర్గ్ ఒక నివేదికలో పేర్కొంది.
"విడాకులు తీసుకున్న పురుషులలో, హిందువులు 76 శాతం, మరియు ముస్లింలు 12.7 శాతం ఉన్నారు. క్రైస్తవ మహిళలు మరియు
పురుషులు వారి లింగ సంబంధిత విడాకుల సమూహాలలో 4.1 శాతం ఉన్నారు",అని సెన్సస్ 2011 డేటా
చూపించింది.
మొత్తం 8.5 లక్షల మంది విడాకులు పొందిన
వ్యక్తులతో, దేశ
జనాభాలో అధిక భాగం నివసించే గ్రామీణ భారతం విఫలమైన వివాహాలను failed
marriages నమోదు చేసింది, పట్టణ
భారతదేశంలో 5.03 లక్షల
మంది విడాకులు తీసుకున్నారు.
2.09 లక్షల మందితో మహారాష్ట్ర అత్యధిక
విడాకులు పొందిన పౌరులను నమోదు చేసింది. మహారాష్ట్ర లో దాదాపు 73.5 శాతం - లేదా 1.5 లక్షలు - విడాకులు తీసుకున్న
వ్యక్తులు మహిళలు.
1,330 మంది విడాకులు తీసుకున్న గోవా, విఫలమైన వివాహాలలో అతి తక్కువ
రికార్డును కలిగి ఉంది. అయితే దేశంలో అత్యధిక సంఖ్యలో విడాకులు పొందిన పురుషులు1.03 లక్షల మంది గుజరాత్‌లో
నివసిస్తున్నారు
భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువ మంది
మహిళలు అధికారిక విడాకులు లేకుండా వివాహం
నుండి విడిపోయారు అని సెన్సస్ డేటా
చూపించింది.
ముస్లిములలో వేరు చేయబడిన జనాభాలో 75 శాతం మహిళలు ఉన్నారు.తరువాత క్రైస్తవ సమాజంలో వేరు చేయబడిన జనాభాలో 69 శాతం క్రైస్తవ మహిళలు కలరు. బౌద్ధుల లో
వేరు చేయబడిన మహిళలు తమ సమాజంలోని జనాభా సమూహంలో 68 శాతం ఉన్నారు.
2011 తో ముగిసిన దశాబ్దంలో, వితంతువులు, విడాకులు మరియు అవివాహిత మహిళలు మరియు
భర్తలు విడిచిపెట్టిన ఒంటరి భారతీయ మహిళల సంఖ్య 39 శాతం పెరిగింది - ఇండియాస్పండ్ నవంబర్
2015 లో
నివేదించింది. అయితే, బ్యాచిలర్స్
సంఖ్య ( సెన్సస్ డేటా ప్రకారం 58 శాతం) ఇప్పటికీ పెళ్లికాని మహిళలను మించిపోయింది, ఇది పెళ్లి చేసుకోవడానికి మహిళలపై అధిక
ఒత్తిడిని సూచిస్తుంది.
భారతదేశ జనాభాలో హిందువులు 80 శాతం ఉన్నారు, ముస్లింలు 14.23 శాతం ఉన్నారు. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు జైనులు వరుసగా 2.3%, 1.72% 0.7% 0.37% ఉన్నారు.
"పెరుగుతున్న విడాకులు" నిజంగా మహిళా సాధికారత మరియు
లింగ సమానత్వానికి అడ్డంకి.విడాకులు అనేది ఒక సామాజిక సమస్య.అక్షరాస్యతను
మెరుగుపరచడం మరియు ఆర్థిక మరియు సామాజిక సాధికారత అనేవి ఈ సమస్యను
పరిష్కరించడానికి అనుసరించగల మార్గాలు.
No comments:
Post a Comment