1658 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించాడు. ఔరంగజేబు ఆధునిక భారతదేశం, పాకిస్తాన్,
ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లతో
కూడిన మొత్తం భారత ఉపఖండాన్ని 49
సంవత్సరాలు పాలించాడు.
ఔరంగజేబ్
అలమ్‌గిర్ అని పిలవబడే ముహి-ఆద్-దిన్ ముహమ్మద్ మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణాన నాలుగు
మిలియన్ చదరపు కిలోమీటర్లకు విస్తరించారు మరియు 1690 లో $ 450 మిలియన్ల వార్షిక ఆదాయంతో అతని
సామ్రాజ్యం లో 150-158 మిలియన్లకు పైగా జనాభా ఉన్నట్లు అంచనా
వేయబడింది. ఔరంగజేబు పాలనలో, భారతదేశం
చైనాలోని క్వింగ్ రాజవంశాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
మరియు ఉత్పాదక శక్తిగా అవతరించింది.
ఔరంగజేబ్ కు ఆలంగిర్ (అంతర్జాతీయవాది) అనే రాజ బిరుదు కలదు.
ఔరంగజేబు నిరాడంబర చక్రవర్తి. రాజ ఖజానా తన కోసం కాక తన సామ్రాజ్య పౌరుల కోసం అని
ఔరంగజేబ్ ఆలంగిర్ భావించాడని ప్రముఖ
చరిత్రకారుడు దాస్‌గుప్తా రాశాడు.
ఆడ్రీ ట్రుష్కే Audrey Truschke ప్రకారం, ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని తారాస్థాయి
కి విస్తరించాడు. మానవ చరిత్రలో మొదటిసారిగా ఒకే
సామ్రాజ్య శక్తి కింద భారత ఉపఖండంలోని అధికభాగo ఉంది..
ఔరంగజేబ్ న్యాయశాస్త్ర కోవిదుడు.
చట్టాల వ్యాఖ్యానం మరియు ఇస్లామిక్ లా ను క్రోడికరించాడు. భారత దేశం లో లో ముస్లిం లా యొక్క ముఖ్య ములాదారాలలో “ఫత్వా అలంగిరి” ఒకటి. ఇది
ముస్లిం సున్ని ధర్మశాస్త్రమునకు సంభందిoచిన అన్ని సిద్దాతములను క్రోడీకరించి
కూర్చబడినది.
ఔరంగజేబ్ షరియా (ఇస్లామిక్ చట్టం) ప్రకారం జూదం, వ్యభిచారం, మద్యం మరియు మాదక ద్రవ్యాల వినియోగం
వంటి కార్యకలాపాలను నిషేధించాడు.
ఔరంగజేబ్ అనేక హిందూ దేవాలయాలను నిర్మించాడు, వాటి నిర్వహణ కోసం దనం ఏర్పాటు చేసాడు.
అతని సామ్రాజ్య అధికారంలో అతని పూర్వీకుల కంటే ఎక్కువ మంది హిందువులను నియమించాడు.
హిందువులు మరియు షియా ముస్లింలకు వ్యతిరేకంగా మతోన్మాదాన్ని ఔరంగజేబు వ్యతిరేకించాడని ఆడ్రీ ట్రుష్కే రాశారు.
ఔరంగజేబు
1707,మార్చి3 న అహ్మద్‌నగర్ సమీపంలోని భింగర్‌లోని 88 సంవత్సరాల వయస్సులో తన సైనిక శిబిరంలో
మరణించాడు, ఔరంగజేబ్ సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని ఖుల్దాబాద్‌లో ఢిల్లీకి చెందిన నిజాముద్దీన్ ఔలియా శిష్యుడైన సూఫీ షేక్ బుర్హాన్-ఉద్-దిన్ ఘారిబ్ సమాధి ప్రాంగణంలో
ఉంది.
ఔరంగజేబ్ అలమ్‌గిర్ మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం వారసత్వ యుద్ధంలో
పడిపోయింది. ఔరంగజేబు మరణంతో, భారతదేశంలో మొఘల్ పాలన సమర్థవంతమైన
శక్తిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అదిస్టిoచిన రాజుల
బలహీనమైన పాలనలో, సామ్రాజ్యం విచ్ఛిన్నం వేగంగా
కొనసాగింది అని చరిత్రకారుడు S.M. ఎడ్వర్డ్స్ చెప్పారు.
No comments:
Post a Comment