వినోబా భావే
గాంధేయ వాది మరియు అతని భూదానోద్యమం ప్రఖ్యాతి గాంచినది. వినోభా భావే అనేక బాషలు నేర్చిన వ్యక్తి మరియు అతనికి అరబ్బీ వచ్చును. చాలా కొద్ది మంది కి
మాత్రమే వినోభా భావే దివ్య కురాన్ ను క్షుణం గా అద్యయనం చేసారని తెలుసు. ఖురాన్ సార్ ( “Qur’ān Saar”)అనే పుస్తకం హిందీ లో వినోభా భావే వ్రాసారు
దివ్య ఖురాన్ మరియు
ఇస్లాం గురించి వినోభా భావే కి సంపూర్ణ అవగాహన ఉంది.
గాంధీజీ
సలహాపై వినోభా వార్ధా ఆశ్రమం యొక్క నిర్వహణ బాద్యతను చేపట్టారు. ఆశ్రమం లో
పిల్లలకు వినోభా బోధించేవారు. ఒక దినం ఆశ్రమం లోని ఒక ముస్లిం పిల్లవాడు తనకు
దివ్య ఖురాన్ భోదించమని వినోభా ను కోరినాడు. తప్పని సరిగా బోధిస్తాను కానీ కొంత
కాలం తరువాత అని వినోభా సమాధానం ఇచ్చారు.
వినోభా
దివ్య ఖురాన్ యొక్క ఆంగ్ల ప్రతిని చదివినారు. పిల్లవాడికి భోదించడానికి ఆయన
స్థానిక అరబిక్ పండితుని వద్ద దివ్య కొరాన్ అరబిక్ లో అధ్యయనం చేయడం
ప్రారంభించారు. దానికి తోడూ దివ్య కొరాన్ సరిఅయిన ఉచ్చారణ కొరకు అల్ ఇండియా రేడియో
వారి దివ్య కొరాన్ పారాయణం వినసాగినారు.
అది చాల వరకు సరి అయిన అరబిక్ ఉచ్చరణ పొందటానికి వినోభా కు తోడ్పడింది. దివ్య
ఖురాన్ పారాయణం చేసేటప్పుడు వినోభా చెంపలు
వెంట కన్నీరు ప్రవహించేది. అది విన్న శ్రోతలు సంతోషం తో ఆనంద ఆశ్రువులు
కార్చేవారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్,
వినోభా ఖురాన్ దివ్య ఖురాన్ పారాయణం విని చాలా ఆనందించేవారు. వినోభా
భావే క్రమంగా అరబిక్ లో పండితులు అయినారు.
సరిహద్దు
గాంధీ తో సoభాషిoచేటప్పుడు వినోభా భావే
దివ్య ఖురాన్ లోని మక్కా ఆయతులను పట్ల తన ప్రేమ ను ప్రకటించేవారు. వినోభా అరబిక్
నేర్చుకొని అనేక దివ్య ఖురాన్ అరబిక్ అనువాదాలను అబ్యసించారు. తన పర్యటనలలో తన
వెంట ఎలాప్పుడు దివ్య ఖురాన్ గ్రంధమును
ఉంచేవారు. దివ్య కొరాన్ పై ప్రసంగాలు చేసేవారు. వినోభా సురె ఫాతిహా మరియు
సురె ఇక్లాస్ ను మరాటి లోనికి అనువదించారు. వినోభా హిందీ లోను, ఉర్దూ లోను దివ్య
ఖురాన్ ను వరుసగా కురాన్ సార్ మరియు రూహుల్-కురాన్ పేర అనువదించారు
వినోభా ఇస్లాం
మరియు హిందూ మతం యొక్క అసలు ఆత్మను(spirit) సరిగా అద్యయనం చేసారు. తన పుస్తకంలోని
ఆరవ అధ్యాయం లో శ్రీ వినోబా భావే హిందూ మతం
మరియు ఇస్లాం యొక్క నిజమైన ఆత్మను (spirit) పట్టుకునేందుకు ప్రయత్నిoచారు.
దివ్య ఖురాన్
స్వయంగా ప్రవక్త(స) ను “అబ్డుహు వా రసూలుహు”
అనగా అల్లాహ్ సేవకుడు మరియు సందేశహరుడు అని అన్నది. మొహమ్మద్ ప్రవక్త(స) తానూ స్వయంగా “కొత్త సత్యం ను చేప్పుట లేదని పూర్వపు
ప్రవక్తలు చెప్పిన సత్యం ను” మాత్రమే చెబుతున్నానని అన్నారని వినోభా వివరించారు. ఈ అంశంలో వినోభా ప్రకారం హిందూమతం ఇస్లాం కు దగ్గరగా వస్తుంది.ఋగ్వేదం
కూడా సత్యం అన్నిచోట్ల ఉన్నదని దానిని
అనేక పేర్లతో పిలుస్తారని చెప్పింది. ”ఏకం సత్ విప్రా బహుదా వదన్తి”
కానీ వినోభా
ప్రకారం ముహమ్మద్ ప్రవక్త(స) “నేను కేవలం అల్లాహ్ యొక్క సందేశహరుడిని మాత్రమే అని ,అల్లాహ్
యొక్క దాసుడు అని మాత్రమే అని మరియు నేను అల్లాహ్ ను కాను” అని పేర్కొన్నారు. నేను అల్లాహ్ సందేశం మాత్రమే వినిపించటానికి వచ్చాను అన్నారు.
వినోభా ప్రకారం దివ్య ఖురాన్ ఇదే
విషయాన్నీ స్పష్టం చేస్తుంది.””ప్రతి జాతి
కొరకూ ఒక మార్గదర్సకుడు ఉన్నాడు”-13:7. వినోభా ఇంకా ఇలా అన్నారు “ఇంకా వారిలో (ఇతర ప్రవక్తలు) ఏ ఒక్కరి పట్ల
మేము భేధభావం చూపము.”-2:136. అందువలన ఇస్లాం మతం అన్ని ఇతర మతాల సత్యం
అంగీకరిస్తుంది.
వినోభా
ప్రకారం దివ్య ఖురాన్ లో అనేక రకాల
ఇబాదత్(ibaadat)(అల్లాహ్ ను పూజించే మార్గాలు) మార్గాలు ఉన్నాయి.దివ్య ఖురాన్ లో “ ప్రతి ఒక్కరికి ఒక దిక్కు ఉన్నది. దాని
వైపుకు అతడు తిరుగుతాడు.కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి
ప్రయత్నించండి.”-2:148. అందువల్ల ఎవరైనా పూజా మార్గాలు గురించి పోరాడటానికి బదులు
మంచి పనులు చేయడానికి పోటి పడాలి.
వినోభా తన
పుస్తకం లోని 5వ అధ్యాయం లో “అల్లాహ్” భావన పట్ల వివరించ ప్రయత్నించారు. ప్రవక్త
ముహమ్మద్ (స) ప్రధానంగా ఏకేశ్వరోపాసన భోదించారు. వినోభా ఈ విషయం లో 112 సురా -కుల్
హువల్లహు అహద్ (అల్ ఇక్లాస్) ను ప్రస్తావించారు. ముహమ్మద్ ప్రవక్త(స) ఏ రూపంలోను విగ్రహం లేదా చిత్రంను అల్లాహ్ యొక్క చిహ్నంగా అంగీకరించలేదు మరియు ప్రవక్త(స) తానూ
అల్లాహ్ యొక్క అవతారం కాదు అన్నారు. ఈ భావనను భారతీయ దర్శనం యొక్క అద్వైత
(ఏకేశ్వరోపాసన) తో వినోభా పోల్చారు.
వినోభా
ప్రకారం భారతదేశం లో బ్రహ్మ అనగా సృష్టి కర్త(నిర్గుణుడు మరియు నిరాకారుడు)గా
వర్ణించ బడినాడు. అదేవిధంగా వినోభా ప్రకారం అల్లాహ్ నిరాకారుడు మరియు సగుణవంతుడు.
దివ్య ఖురాన్ అల్లాహ్ యొక్క వివిధ సిఫాత్ (వివిద విశేషములు/గుణాలు)లను వివరించును.
No comments:
Post a Comment