7 August 2021

ఆధునిక ప్రపంచంలో మొదటి మహిళా కమాండర్‌ అసే మలహయతి(16వ శతాబ్దం) First Female Commander in the Modern World: Aceh Malahayati Of 16 Century

 

 


 


 


 

మానవ చరిత్ర అంతా అనేక గొప్ప మహిళల గాధలతో నిండి ఉంది. ప్రాచీనకాలం నుండి ఆధునిక కాలం వరకు  ప్రతి విభాగంలో  సైన్స్. లలిత కళలు నుండి యుద్దక్రీడల  వరకు మహిళా హీరోలు ఉన్నారు. వాస్తవానికి అన్నింటిలోనూ 'స్త్రీ' ఎప్పుడూ మొదటిగా ఉంటుంది. వారిలో ఆసే మలహయతి ఒకరు.

మలహయతి అని కూడా పిలువబడే కెయుమలహయతి Keumalahayati(16వ శతాబ్దం),, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా అడ్మిరల్. ఆమె కథ మరియు విజయాలు ప్రశంసనీయాలు. ధైర్యవంతులు, గౌరవప్రదమైనవారు, విజయవంతమైనవారికి   ఆమె రోల్ మోడల్ మరియు స్ఫూర్తి.

మలహయతి 15మరియు 16వ శతాబ్దాలలో అచే సుల్తానేట్ కాలంలో నివసించారు. ఆమె అచేహ్ దారుస్సలాం సుల్తానేట్ (Aceh Darussalam Sultanate) స్థాపకుడి వారసురాలు. నిజానికి, అచేహ్ దారుస్సలాం సుల్తానేట్ స్థాపకులలో ఒకరు,  ఆమె ముత్తాత సుల్తాన్ ఇబ్రహీం అలీ ముఘాయత్ స్యాహ్ (Sultan Ibrahim Ali Mughayat Syah). మలహయతి తండ్రి మరియు తాత ఇద్దరూ నౌకాదళ అడ్మిరల్స్. మలహయతి తన తండ్రి వృతి పట్ల ఆసక్తి కలిగి ఉంది మరియు పెసాంట్రెన్ (Pesantren) ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ నుండి పట్టభద్రురాలు అయ్యాక  మహద్ బైతుల్ మక్దీస్ మిలిటరీ అకాడమీ (Ma’had Baitul Maqdis Military Academy) లో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. అకాడమీ నేవీ మరియు ది గ్రౌండ్ ఫోర్స్ విభాగంలో సైనిక విద్యను అందిస్తుంది. అకాడమీ నుండి పట్టభద్రురాలు అయిన పిదప  మలహయతి ఒక  నావల్  ఆఫీసర్ ని వివాహం చేసుకుంది. దురదృష్టవశాత్తు పోర్చుగీస్ దళాలకు వ్యతిరేకంగా జరిగిన హరు బే (Haru Bay)  యుద్ధంలో మలహయతి భర్త మరణించాడు. మలహయతి డచ్ మరియు పోర్చుగీసు వారిపై  తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేసింది.

డచ్ మరియు పోర్చుగీసులకు వ్యతిరేకంగా పోరాటానికి మలహయతి  అచే సుల్తాన్‌ అనుమతి మరియు ఆమోదం తో  అచే నావికా దళ వితంతువులతో ఒక ఆర్మడను ఏర్పాటు చేసి ఆర్మడకు 'ఇనోంగ్ బాలే ఆర్మడ"Inong Balee Armada' అని పేరు పెట్టినది. అచే సుల్తాన్ 'ఇనోంగ్ బాలే ఆర్మడ' కు మలహయతిని మొదటి అడ్మిరల్‌గా నియమించారు. మలహయతి డచ్ మరియు పోర్చుగీసులకు వ్యతిరేకంగా అనేక నావికా యుద్ధాలను చేసినది.

1599 లో డచ్ కమాండర్లు కార్నెలిస్ డి హౌట్‌మన్ (Cornelis de Houtman) మరియు అతని సోదరుడు ఫ్రెడెరిక్ డి హౌట్‌మన్ (Frederick de Houtman)  వాణిజ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సుల్తాన్‌ను సందర్శించారు. వారికి  శాంతియుతంగా స్వాగతం లబించినది., కానీ కార్నెలిస్ ఒక పోర్చుగీసును అనువాదకుడిగా తీసుకువచ్చారు, ఇది సుల్తాన్‌కు అవమానకరమైనది. అనేక హింసాత్మక నావికా యుద్ధాలు జరిగాయి, ఆ యుద్దాలలో మలహయతి నాయకత్వం లోని  అచే సుల్తాన్ నావికా దళo పాల్గొన్నది.  మలహయతి డచ్‌లను ఓడించడంలో విజయం సాధించింది, కార్నెలిస్‌ను చంపింది మరియు అతని సోదరుడిని రెండు సంవత్సరాలు జైలులో ఉంచింది.

1600 లో డచ్ నావికాదళానికి నాయకత్వం వహించిన పౌలస్ వాన్ కెర్డెన్ (Paulus van Caerden), ఒక అచే వర్తక నౌకను, దానిలోని  మిరియాలను  దోచుకుని ముoచివేసాడు.. ఒక సంవత్సరం తరువాత అడ్మిరల్ జాకబ్ వాన్ నెక్ (Admiral Jacob van Neck) మరియు అతని సహచరులు అచే సుల్తాన్ వద్ద మిరియాలు కొనడానికి తమను తాము వ్యాపారులు గా పరిచయం చేసుకున్నారు. కానీ మలహయతి వారు డచ్ వారు  అని తెలుసుకున్న తర్వాత, మునుపటి పనులకు గాను  పరిహారంగా వారిని అరెస్టు చేసింది..

ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత మారిట్స్ వాన్ ఒరాంజే (Maurits van Oranje) ఇద్దరు రాయబారులను అడ్మిరల్ లారెన్స్ బికర్ మరియు గెరార్డ్ డి రాయ్ (Admiral Laurens Bicker and Gerard de Roy),  అనే వారితో   దౌత్యపరంగా క్షమాపణ లేఖతో  మరియు అచే సుల్తాన్ కు కొన్ని బహుమతులను  పంపాడు.. దాంతో మలహయతి మరియు రాయబారుల బృందం ఒక  ఒప్పందం చేసుకున్నారు. అచే సుల్తాన్ మలహయతిని ట్రూప్ కమాండర్ మరియు ప్యాలెస్ గార్డ్‌ గా నియమించారు.

మలక్కా జలసంధిలో ఇంగ్లాండ్ ప్రవేశించినప్పుడు మలహయతి కూడా పాలుపంచుకుంది. అచే సుల్తాన్ కోసం ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్I, ఒక లేఖతో జేమ్స్ లాంకాస్టర్‌ అనే రాయబారి ని పంపారు. రాయబారి మలహయతితో చర్చలు జరిపిన తరువాత ఆంగ్లేయులకు అచే సుల్తాన్ కు మద్య ఒక ఒప్పందం జరిగింది. పలితంగా ఆంగ్లేయులకు   జావాలో  ప్రవేశం లబించినది.

 

తేలుక్ క్రుంగ్ రాయ (Teuluk Krueng Raya) వద్ద పోర్చుగీస్ నౌకాదళంపై దాడి చేస్తున్నప్పుడు మలహయతి యుద్ధంలో మరణించింది. ఆమెను బండా అచేహ్ Banda Aceh నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఫిషింగ్ గ్రామమైన లెరెంగ్ బుకిట్ కోట దలం (lereng Bukit Kota Dalam) వద్ద ఖననం చేశారు

లెగసె(Legacy):

నేడు అనేక విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, రోడ్లు మరియు సుమత్రాన్ నగరాలు మలహయతి పేరు మీద పెట్టబడ్డాయి. అలాగే KRI మలహయతి అనే నావికాదళ ఓడ కు ఆమె పేరు పెట్టబడింది.. మలహయతి సమాధికి సమీపంలో ఉన్న నౌకాదళ ఓడరేవును మలహయతి పోర్టుగా కూడా పిలుస్తారు. నవంబర్ 2017 లో, ప్రెసిడెంట్ జోకో విడోడో ఆమెకు ఇండోనేషియా గౌరవ జాతీయ హీరో అవార్డు (honorary National Hero of Indonesia) ని ప్రదానం చేశారు. మలహయతి గౌరవార్ధం "లక్ష్మణ కెయుమలహయతి" అనే ఇండోనేషియా టెలివిజన్ సిరీస్ కూడా రూపొందించబడింది.

మలహయతి అనేది గుర్తుంచుకోవలసిన పేరు అనడంలో సందేహం లేదు. మలహయతి సంకల్పం ఉంటె  ఏదైనా సాధించాలనే సంకల్పం ఉన్న యోధురాలు.

 

 

 

No comments:

Post a Comment