15 August 2021

హైదరాబాద్ గులాం అహ్మద్ నిజమైన "ప్రిన్స్ ఆఫ్ క్రికెట్" Hyderabad’s Ghulam Ahmed was a true “Prince of Cricket”

 



 


భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మొదటి హైదరాబాద్ క్రికెటర్ గులామ్ అహ్మద్.  గులామ్ అహ్మద్ ఒక జెంటిల్‌మన్ ప్లేయర్‌గా,  క్రికెట్ కెప్టెన్, టీమ్ మేనేజర్, టీమ్ సెలెక్టర్‌గా మరియు తన ప్రవర్తనలో పాతకాలపు హైదరాబాదీ మర్యాదలకు ప్రతీక అయినాడు..

గులాం మహమూద్ మరియు హఫీజా బేగం దంపతులకు 4 జూలై, 1922 న గులామ్ అహ్మద్ జన్మించాడు మరియు అతనిని  చిన్నతనం నాటి  స్నేహితులు మరియు సహచరులు ఐజాజ్ అనే మారుపేరుతో పిలుస్తారు. కాని సాధారణంగా అందరు అతనిని గులాం మొహమ్మద్ పిలిచేవారు

మదర్సా-ఇ-అలియాలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి, గులాం తన ప్రతిభను ప్రదర్శించేవాడు. ఆ రోజుల్లో అతనికి  స్ఫూర్తి అతని మేనమామ పూర్వపు  హైదరాబాద్ రాజ్య  మాజీ ప్రధాన కార్యదర్శి హమీద్ రజ్వీ. పూర్తి సమయం ప్రాతిపదికన క్రికెట్‌ను కొనసాగించమని హమీద్ రజ్వీ యువ గులామ్‌ని ప్రోత్సహించినాడు.

గులాం అహ్మద్ తన కాలం నాటి బెస్ట్ ఆఫ్ స్పిన్నర్.  ఎరపల్లి ప్రసన్న, ఎస్. వెంకటరాఘవన్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హర్భజన్ సింగ్ మరియు రవిచంద్రన్ అశ్విన్ వంటి అనేక ప్రసిద్ధ ఆఫ్ స్పిన్నర్ల కు మార్గదర్సకుడు గులాం అహ్మద్. ఆంగ్లేయులు, ఆసీస్ మరియు డాషింగ్ వెస్ట్ ఇండియన్స్‌ను ఆఫ్ స్పిన్ ద్వారా జయించవచ్చని మొదటిసారిగా గులాం అహ్మద్ నిరూపించాడు.

ప్రసన్న మరియు వెంకటరాఘవన్ సహచరుడు అయిన మరో హైదరాబాద్ స్టార్ ఎంఎల్ జైసింహ, గులాంను భారతదేశంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా రేట్ చేసారు. జైసింహ ప్రసన్నకు గొప్ప ఆరాధకుడు/ఫ్యాన్  అయినప్పటికీ, గులామ్‌ని అందరికన్నా గొప్పగా ప్రకటించడంలో ఎలాంటి సంకోచం పడలేదు.

వినూ మన్కడ్ మరియు సుభాష్ గుప్తేతో కలిసి, గులాం అహ్మద్ భారత జట్టు కోసం బలియమైన స్పిన్ కాంబినేషన్‌ గా మారాడు. గులాం అహ్మద్ ఒత్తిడి లేకుండా దీర్ఘకాలం బౌలింగ్ చేయగలడు. 1950-1951 సీజన్‌లో హోల్కర్ ఎలెవన్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గులాం అహ్మద్ హైదరాబాద్ జట్టు కోసం 555 బంతులు వేశాడు, అది రికార్డుగా మారింది. అతని బౌలింగ్ విశ్లేషణ 92.3-21-245-4 గా ఉంది.  

గులాం అహ్మద్ మొత్తం మీద, ఇరవై సార్లు ఇన్నింగ్స్‌కి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు మరియు ఆరు సార్లు ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీసుకున్నాడు

గులాం అహ్మద్ క్రిక్ఇన్ఫో Cricinfo ప్రకారం, 1956 లో ఆస్ట్రేలియాతో కలకత్తాలో జరిగిన మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 49 పరుగులకు ఏడు వికెట్లతో సహా మొత్తం టెస్ట్ మ్యాచ్ లో 130 పరుగులకు పది వికెట్లు తీసుకొన్నాడు..

 

గులాం అహ్మద్ టెస్ట్ కెరీర్ సరిగ్గా 10 సంవత్సరాలు కొనసాగింది. అతను డిసెంబర్ 31, 1948 న వెస్టిండీస్‌పై భారతదేశం తరఫున అరంగేట్రం చేసాడు మరియు అతను తన చివరి టెస్టును వెస్టిండీస్‌కి వ్యతిరేకంగా 31 డిసెంబర్, 1958 న ఆడాడు. ఈ అసాధారణ యాదృచ్చికం బహుశా ఏ ఇతర భారత టెస్ట్ ప్లేయర్ విషయంలోనూ సంభవించలేదు.

గులాం అహ్మద్ రంజీ ట్రోఫీ తో సహా  మొత్తం  407 ఫస్ట్ క్లాస్ వికెట్లను తీసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 22 టెస్టుల్లో 68 వికెట్స్ తీసుకొన్నాడు. పాకిస్తాన్‌పై 1952-1953 సిరీస్‌లో పదకొండవ స్థానంలో 50 పరుగులు చేశాడు మరియు చివరి వికెట్‌కు హేము అధికారితో కలిసి 90 పరుగులు జోడించాడు, అది రికార్డు భాగస్వామ్యంగా ఉంది.

గులామ్ అహ్మద్ మూడుసార్లు భారతదేశానికి కెప్టెన్‌గా ఉన్నారు. భారత కెప్టెన్‌గా అతని తొలి టెస్టు న్యూజిలాండ్‌తో హైదరాబాద్ ఫతేమైదాన్ మైదానంలో జరిగింది. గులామ్ అహ్మద్ 1952 లో ఇంగ్లండ్‌పై, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 21.92 సగటుతో 80 వికెట్లు మరియు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో 24.73 సగటుతో 15 వికెట్లు తీసిన ప్రముఖ బౌలర్

1959లో భారత జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ, గులాం అహ్మద్  అప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయినందున వెళ్ళడానికి నిరాకరించాడు. కానీ అతను హైదరాబాదులోని డెక్కన్ బ్లూస్ కొరకు క్లబ్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు మరియు హైదరాబాద్ యువతకు స్నేహితుడు మరియు మార్గదర్శిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు.

గులాం అహ్మద్  1959 లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA కార్యదర్శిగా ఎన్నికయ్యాడు మరియు 1975 వరకు సేవ చేస్తూనే ఉన్నాడు. HCA కి ఉపాధ్యక్షుడిగా మరియు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

1962 లో గులామ్ అహ్మద్ భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు మేనేజర్‌గా ఉన్నారు. ఆ పర్యటనలో వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ వలన భారత కెప్టెన్ నారి కాంట్రాక్టర్ తలపై గాయమయింది. పుర్రె చిట్లింది. కానీ గులాం అహ్మద్ సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల భారత కెప్టెన్ ప్రాణాలను కాపాడిన శస్త్రచికిత్స జరిగింది. గులాం అహ్మద్ సకాలంలో తీసుకున్న చర్య ప్రాణాన్ని కాపాడిందనే వాస్తవాన్ని కాంట్రాక్టర్ అంగీకరించాడు.

ప్రముఖ బాలివుడ్ స్టార్‌ దిలీప్ కుమార్,  గులాం అహ్మద్ అభిమాని. “గొప్ప క్రికెటర్ మరియు క్రికెట్ యువరాజు” అని గులాం అహ్మద్ ను దిలీప్ కుమార్ కొనియాడే వారు.

1983 లో గులాం అహ్మద్. ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించారు.  

ప్రతిష్టాత్మక MCC లో గులాం అహ్మద్ కు  జీవిత సభ్యత్వం ఇవ్వబడింది. గులాం అహ్మద్ 1975 నుండి 1980 వరకు BCCI కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ మరియు సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడంలో గులాం అహ్మద్ కీలక పాత్ర పోషించాడు.

గులాం అహ్మద్ హైదరాబాద్‌లో జన్మించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ మామ మరియు సానియా మీర్జా తాత.

గులాం అహ్మద్ చెప్పుకోదగిన విజయాలు మరియు ప్రతిభ ఉన్న వ్యక్తి. 1998 లో ఆయన మరణం హైదరాబాద్ క్రికెట్ లో ఎన్నటికీ నింపని శూన్యతను మిగిల్చింది.

No comments:

Post a Comment