అక్టోబర్ 30, 1884 అనగా 10వ ముహర్రం 1302 హిజ్రీలో, ట్రినిడాడ్(వెస్ట్ ఇండీస్)లో ఇమామ్ హుస్సేన్ బలిదానం(అషురా) జరుపుకుంటున్న వేలాది మంది భారతీయులపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు మరియు అనేక డజన్ల మంది అమరులయ్యారు.
1857 తరువాత బ్రిటిష్ వారు భారతదేశం నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా మరియు కార్మికులుగా ఫిజీ, బ్రిటీష్ గయానా, డచ్ గయానా, ట్రినిడాడ్, టొబాగా, నాటల్ (దక్షిణాఫ్రికా) మొదలైన దేశాలకు పెద్ద సంఖ్యలో భారతీయులను పంపడం ప్రారంభించారు. వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఈ కార్మికులను ఒప్పంద సేవకులు bound coolies అని పిలుస్తారు
భారతదేశం నుండి ముస్లింలు ట్రినిడాడ్ చేరుకున్నప్పుడు, వారు శాన్ ఫెర్నాండో వెలుపల ఇమాంబరా మరియు కర్బలాలను నిర్మించారు. ప్రతి సంవత్సరం వారు ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని గుర్తుచేసుకునేవారు. 1880 లలో ఇక్కడ ఉద్రిక్తత పెరగడం ప్రారంభమైంది. ప్రజలు బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం ప్రారంభించారు. క్రమంగా, భారత కార్మికుల జనాభా పెరుగుదల కారణంగా, బ్రిటిష్ వారిలో తిరుగుబాటు జరుగుతుందనే భయం ఏర్పడింది. 1881లో జరిగిన ఘర్షణ తర్వాత శాన్ ఫెర్నాండో నగరంలో తజియాదారి పూర్తిగా నిషేధించబడింది. మొహర్రం సంధర్భంగా ప్రజలు ఊరేగింపులు, ప్రదర్సనలు జరపకుండా నిషేధించారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం ప్రారంభించారు.
అక్టోబర్ 30, 1884 తేదీన మొహర్రం వచ్చింది, ప్రజలు స్వాతంత్ర్య నినాదాలు చేసుకొంటూ బారికేడింగ్ వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు
కాల్పులు జరిపారు. ఇందులో సుమారు
రెండు డజన్ల మంది అమరులయ్యారు. ఇమామ్ హుస్సేన్ అమరవీరునికి సంతాపం వ్యక్తం
చేస్తున్న వేలాది మంది ప్రజలపై బ్రిటిష్
వారు కాల్పులు జరిపారు మరియు అనేక డజన్ల మంది భారతీయులు అమరులయ్యారు. నాటి ఈ
ఊచకోతను అక్కడ హోసియా ఊచకోత అని పిలుస్తారు, హోసియా అంటే ఇమామ్ హుస్సేన్. ఇమామ్ హుస్సేన్
లాగే ఇక్కడ కూడా భారతీయ కార్మికులు తమ జీవిత హక్కుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి
అమరులయ్యారు.
ग़रीब ओ सादा ओ
रंगीन है दास्ताने हरम
निहायत इसकी हुसैन (र) इब्तदा है इस्माइल (अ)
No comments:
Post a Comment