12 July 2023

ఈజిప్ట్ చారిత్రాత్మక అల్-జహీర్ బేబర్స్ మసీదు పునరుద్ధరణ తర్వాత తిరిగి తెరవబడినది. Egypt Reopens Historic Mosque after Restoration

 



అల్-జహీర్ బేబర్స్ యొక్క చారిత్రాత్మక మసీదుని 1268లో మమ్లుక్ సుల్తాన్ అల్-జహీర్ బేబర్స్ అల్-బుందుక్దారీ నిర్మించారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత అల్-జహీర్ బేబర్స్ యొక్క చారిత్రాత్మక మసీదు జూన్ 5, 2023న ఈజిప్ట్‌లోని కైరోలో తిరిగి తెరవబడింది.

13 శతాబ్దానికి చెందిన అల్-జహీర్ బేబర్స్ మసీదు, సబ్బుల కర్మాగారంగా, కబేళాగా మరియు కోటగా ఉపయోగించబడిన తర్వాత శిథిలావస్థకు చేరుకుంది, సుదీర్ఘ పునరుద్ధరణ తర్వాత ఇటీవల కైరోలో తిరిగి తెరవబడింది.

 1268లో మమ్లుక్ పాలనలో నిర్మించిన అల్-జహీర్ బేబర్స్ మసీదు, సెంట్రల్ కైరోకు ఉత్తరాన మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది ఈజిప్ట్ యొక్క మూడవ అతిపెద్ద మసీదుగా ఉంది.

మెకానికల్ మరియు కెమికల్ పునరుద్ధరణ తరువాత అల్-జహీర్ బేబర్స్ మసీదును దాని అసలు స్థితికి తీసుకురావడo జరిగిందని నిపుణులు తెలిపారు.

"మసీదు లోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి, కొన్ని భాగాలు కూల్చివేయబడ్డాయి.కానీ పునర్నిర్మాణ ప్రక్రియ సరైన పురావస్తు శైలి ప్రకారం జరిగింది. 

$7.68 మిలియన్ల వ్యయంతో జరిగిన పునరుద్ధరణ పనులు  కజాఖ్స్తాన్‌ Kazakhstan ఇచ్చిన నిధులతో 2007లో ప్రారంభమైంది. 225 సంవత్సరాలుగా, మసీదు మూసివేయబడింది మరియు వదిలివేయబడింది లేదా మతపరమైన ప్రయోజనాల కోసం నిర్వహించబడలేదు.ఇది దాని దుస్థితికి దోహదపడింది.

ఈజిప్టులో నెపోలియన్ సైనిక యాత్రల సమయంలో దీనిని సైనిక కోటగా ఉపయోగించారు, తర్వాత 19వ శతాబ్దంలో ఒట్టోమన్ పాలనలో సబ్బుల ఫ్యాక్టరీగా ఉపయోగించారు. తరువాత, 1882లో బ్రిటిష్ వారు ఈజిప్టుపై దాడి చేసినప్పుడు, దీనిని కబేళాగా ఉపయోగించారు.

 ఈజిప్టులో మూడు శతాబ్దాలపాటు  అనగా 1517 వరకు మమ్లుక్ పాలనను సుస్థిరం చేసిన ఘనత కల అల్-జాహీర్  బెబర్స్ ఈజిప్ట్ చరిత్రలో ప్రముఖ వ్యక్తి.

 

No comments:

Post a Comment