6 July 2023

ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఎంపీలు లేరు No Muslim MPs even in States with high Muslim presence

 


లోక్‌సభలో ముస్లిం ఎంపీల సంఖ్య, బీజేపీ ఎంపీల సంఖ్య పెరుగుదలతో  విలోమ సంబంధం కలిగి ఉంది

భారతదేశంలోని ముస్లిం జనాభా 1951లో దాదాపు 10% నుండి 2011లో 14%కి పెరిగింది మరియు 2020లో 15%కి పెరిగింది.ప్యూ రిసెర్చ్ సెంటర్  ప్రొజెక్షన్ ప్రకారం, ముస్లిం పార్లమెంటు సభ్యుల (MPల) వాటా  ఎప్పుడూ 10% మార్కును దాటలేదు మరియు గత 15 సంవత్సరాలలో బాగా తగ్గింది.

 భారతదేశంలోని ముస్లిం ఎంపీల సంఖ్య 1990లలో నుంచి తగ్గుదలలో ఉంది.  గత  మూడు లోక్‌సభలలో (UPA 2, NDA 1, NDA 2) ముస్లిం ఎంపీల వాటా 5% లేదా అంతకంటే తక్కువకు క్షీణించింది. 1980లలో 8.3%కి చేరుకున్న తర్వాత  1990లనుంచి  ముస్లిం ఎంపీల సంఖ్య వాటా తగ్గడం జరిగింది.  తిరోగమనం తర్వాత, 14వ లోక్‌సభలో (UPA 1: 2004¬ 09) ముస్లిం MPల వాటా మళ్లీ క్రమంగా పెరిగింది మరియు 7%కి చేరుకుంది,

లోక్‌సభ ఎన్నికలలో ముస్లిం అభ్యర్థుల సంఖ్య BJP సబ్యుల సంఖ్య తో  విలోమ సంబంధాన్ని కలిగి ఉంది అనగా - BJP సబ్యుల సంఖ్య పెరిగినప్పుడు ముస్లిం సబ్యుల సంఖ్య తగ్గింది

1984లో లోక్‌సభలో BJP ప్రవేశించినప్పటి నుండి, దాని ఎన్నికైన ఎంపీలలో ముస్లిం MPల ఉనికి చాలా తక్కువగా ఉంది. 1984 నుంచి 2009 వరకు 0% మరియు 0.3% మధ్య ఊగిసలాడుతోంది. తాజా రెండు లోక్‌సభల్లో BJP నుండి ముస్లిం ఎంపీలు లేరు.

ఆసక్తికరంగా, కాంగ్రెస్‌లో కూడా ముస్లిం ఎంపీల వాటా కూడా 6, 7వ మరియు 8వ లోక్‌సభలలో (1977¬89) 7.5% గరిష్ట స్థాయి నుండి ప్రస్తుత లోక్‌సభలో 1.1%కి గణనీయంగా తగ్గింది.

కాంగ్రెస్ లో తగ్గిన ముస్లిం MPల సబ్యుల సంఖ్యను  ఇటీవలి సంవత్సరాలలో ఇతర BJPయేతర పార్టీలు పూరించాయి. ప్రస్తుత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మరియు జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీల ఎంపీలందరూ ముస్లింలే.సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గురు ముస్లింలు.

 ముస్లిం జనాభా 14% ఉన్న  ఉత్తరాఖండ్, త్రిపుర (9% ముస్లిం జనాభా), మణిపూర్ మరియు గోవా (ఒక్కొక్కటి 8%) ఒక్క ముస్లిం MPకూడా లేరు. కేవలం ఒక ఎంపీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోలేదు

15% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలలో, కేరళ, అస్సాం, జమ్మూ మరియు కాశ్మీర్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ స్థిరమైన సంఖ్యలో ముస్లిం ఎంపీలను కలిగి ఉన్నాయి. దీనికి రెండు మినహాయింపులు ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్.

జార్ఖండ్‌లో నాలుగు పర్యాయాలు ఒక ముస్లిం ఎంపీ మాత్రమే ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో, 1980ల ప్రారంభంలో ముస్లిం ఎంపీల వాటా 18%కి చేరింది, ఇది 2014లో కేవలం 1%కి పడిపోయింది.

కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఆంధ్ర ప్రదేశ్,వంటి జనాభాలో 10-15% ముస్లిం వాటా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం ఎంపీల వాటా కాలక్రమేణా పడిపోయింది. నిజానికి, మహారాష్ట్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం ముస్లిం ఎంపీ లేరు.

No comments:

Post a Comment