10 July 2023

భారత స్వాతంత్ర్య పోరాటంలో సౌదీ అరేబియా పాత్ర మరవరానిది Unforgettable Role of Saudi Arabia in the Indian Freedom Struggle

 



భారత స్వాతంత్య్ర పోరాటంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించిందనేది అందరికీ తెలిసిన విషయమే. 150 సంవత్సరాల భారత స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ విప్లవకారులకు మద్దతునిచ్చిన బ్రిటిష్ ఇండియా వెలుపల దేశం సౌదీ అరేబియా మాత్రమే.

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన అనుచరులను హజ్ కోసం సౌదీ అరేబియా పంపాలని ప్లాన్ చేసారు మరియు దానికి గాను ఆజాద్ హింద్ ఫౌజ్‌లో బ్రిటిష్ వ్యతిరేక వ్యక్తులను రిక్రూట్ చేసుకొన్నారు.. ఆ సమయంలో భారతీయ విప్లవకారులు హెజాజ్ (ప్రస్తుతం సౌదీ అరేబియా) నుండి పనిచేస్తున్నారు.

2వ ప్రపంచ యుద్ధం  సమయంలో బ్రిటీష్ వారిపై తన పోరాటాన్ని ప్రకటించే ముందు, బోస్ 1939లో మౌలానా ఉబైదుల్లా సింధీని కలిశాడు. మౌలానా ఉబైదుల్లా సింధీ 1915లో కాబూల్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ మరియు బర్కతుల్లాతో కలిసి ప్రవాసంలో ఉన్న భారత విప్లవకారుడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మౌలానా ఉబైదుల్లాసింధీ తదుపరి భారత స్వాతంత్ర్య సమరానికి కూటమిని సృష్టించేందుకు రష్యా, జర్మనీ, ఇటలీ మొదలైన దేశాల్లో పర్యటించారు. 1930లలో, మౌలానా ఉబైదుల్లా సింధీ,  సౌది అరేబియా లో ఆశ్రయం పొంది మక్కాలో స్థిరపడినాడు. అయితే, పవిత్ర నగరాన్ని(మక్కా) సందర్శించే ముస్లిం యాత్రికులలో మౌలానా ఉబైదుల్లా సింధీ భారత జాతీయవాదాన్ని బోధిస్తున్నాడని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆరోపించింది.

మక్కాలో భారత స్వాతంత్ర్యం కోసం  విప్లవకారులచే భారీ ప్రణాళిక సిద్ధంచేయబడినది.. హజ్ కారణంగా మక్కా నగరంకు  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అత్యుత్తమ కమ్యూనికేషన్ ఛానెల్స్  కలవు. మౌలానా ఉబైదుల్లా సింధీ 1938లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌల్వీ జహీరుల్ హక్‌కు వ్రాసిన లేఖ ప్రకారం, బ్రిటీష్ వారిపై ఆఖరి యుద్ధం కోసం బోస్‌ను విదేశాలకు పంపాలనుకుంటున్నట్లు మౌలానా ఉబైదుల్లా సింధీ అతనితో చెప్పాడు. భారత స్వాతంత్ర్య పోరాట భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు బోస్ మరియు మౌలానా ఉబైదుల్లా సింధీ ఢిల్లీలో కలుసుకున్నారని ఆజాద్ రాశారు. మళ్లీ కొన్ని నెలల తర్వాత కలకత్తా (కోల్‌కతా)లో కలుసుకున్నారు. జపాన్ అధికారులకు ఇవ్వాల్సిన ముఖ్యమైన లేఖలు, పత్రాలను మౌలానా ఉబైదుల్లా సింధీ, బోసుకు  అందజేశారు.

సౌదీని తన కార్యాచరణ కేంద్రం గా ఉపయోగించుకున్న మొదటి భారతీయ విప్లవకారుడు మౌలానా ఉబైదుల్లా సింధీ కాదు. మౌలానా ఉబైదుల్లా 1915లో కాబూల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం “సిల్క్ లెటర్ మూవ్‌మెంట్” అని పిలువబడే ఒక పెద్ద ప్రణాళికలో భాగం. “సిల్క్ లెటర్ మూవ్‌మెంట్” సాయుధ విప్లవం ద్వారా భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఉలేమా, గదరైట్లు, బెంగాలీ విప్లవకారులు మరియు ఇతరులతో ఏర్పడినది. “సిల్క్ లెటర్ మూవ్‌మెంట్” ఉద్యమ నాయకుడు మౌలానా మహమూద్ హసన్. 1916లో మౌలానా మహమూద్ హసన్,  మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ, అంజర్ గుల్, వాహిద్ అహ్మద్, హకీమ్ నస్రత్ హుస్సేన్ మరియు ఇతరులతో పాటు హెజాజ్(సౌదీ అరేబియా) లో అరెస్టయ్యాడు.

మౌలానా మహమూద్ హసన్ మరియు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీలు మక్కా మరియు మదీనాలో బోధించేవారు మరియు భారతీయ యాత్రికులను కూడా ప్రభావితం చేసేవారు. ఆ కారణం చే మౌలానా మహమూద్ హసన్ మరియు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ లు బ్రిటిష్ వారిచే నిర్భందింపబడినారు. మౌలానా మహమూద్ హసన్ మరియు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ లు హెజాజ్ లో ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచినట్లయితే, వారు భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ లోని అనేకమంది బారత విప్లవకారులైన ముహమ్మదీయులకు ఉత్తేజితంగా మారవచ్చు అనే భయం తో బ్రిటీష్ వారు, మౌలానా మహమూద్ హసన్ మరియు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీలను   మాల్టాకు యుద్ధ ఖైదీలుగా పంపారు. . ".

దారుల్ ఉలూమ్, దేవబంద్ అధినేత మౌలానా మహమూద్ హసన్ “సిల్క్ లెటర్ మూవ్‌మెంట్” లో సభ్యుడు. హాజీ ఇమ్దాదుల్లాను డియోబంద్ ఆధ్యాత్మిక అధిపతిగా భావిస్తాడు; 1857 తర్వాత ఇమ్దాదుల్లా శిష్యులు విప్లవకారులను సిద్ధం చేసేందుకు డియోబంద్‌లో మదర్సాను స్థాపించారు.

ఇమ్దాదుల్లా 1845లో హజ్ కోసం వెళ్ళాడు, అక్కడ మరో భారతీయుడు షా ముహమ్మద్ ఇషాక్, బ్రిటీష్ వారితో పోరాడమని ఇమ్దాదుల్లా ను ఆదేశించాడు. ఇమ్దాదుల్లా 1846లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్ మరియు షామ్లీ జిల్లాలలో, ఇమ్దాదుల్లా హఫీజ్ మహమ్మద్ జమీన్ మౌలానా ఖాసిం నానౌత్వి, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, మౌలానా మజహర్, మౌలానా మునీర్ నానౌత్వి వంటి తన విద్యార్థుల సహాయంతో బ్రిటిష్ వ్యతిరేక విప్లవ సైన్యాన్ని సమీకరించడం ప్రారంభించాడు.

ఇమ్దాదుల్లా నేతృత్వంలోని భారత విప్లవకారుల సైన్యం 1857లో బ్రిటిష్ దళాలతో పోరాడి షామ్లీని విడిపించింది. బ్రిటీష్ వారు దానిని తిరిగి స్వాధీనం చేసుకునే ముందు కొన్ని రోజులు విప్లవకారులు ఏర్పాటు చేసిన పౌర ప్రభుత్వం షామ్లీపట్టణాన్ని పరిపాలించింది. వేలాది మంది ప్రజలు మరణించారు మరియు ఇమ్దాదుల్లా మక్కాలో ఆశ్రయం పొందాడు. ఇమ్దాదుల్లా 1859లో మక్కా చేరుకున్నాడు మరియు యాత్రికులలో వలసవాద వ్యతిరేక ఆలోచనలను బోధించడానికి మక్కాను ఒక ప్రదేశంగా ఉపయోగించాడు.

మక్కాలో నివసించిన ఇషాక్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడమని ఇమ్దాదుల్లాను ఎందుకు కోరాడు? 1821లో, సయ్యద్ అహ్మద్ షాహిద్ మక్కా మరియు మదీనాకు యాత్ర చేపట్టారు. సయ్యద్ అహ్మద్ షాహిద్ ఇస్లామిక్ పండితుడు మరియు మరాఠా దళాలలో సైనికుడు. మరాఠాలు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, సయ్యద్ వారి సైన్యాన్ని విడిచిపెట్టి, ఒక సమూహంతో మక్కాకు బయలుదేరాడు. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత, సయ్యద్ అహ్మద్ షాహిద్ బ్రిటిష్ వారితో పోరాడుతూ అమరవీరుడు అయ్యాడు.

1920లు, 30లు మరియు 40లలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మక్కా, మదీనా మరియు జెద్దాలోని భారతీయ విప్లవకారులపై నిఘా ఉంచమని సౌదీ అధికారులకు అనేక హెచ్చరికలు చేసింది. హజ్ పేరుతో భారతీయ విప్లవకారులు ఒకరినొకరు స్వేచ్ఛగా కలుసుకోవడానికి సౌదీ అరేబియా ఒక స్థలం గా మారింది.. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వారిపై నిఘా ఉంచింది. స్థానిక అరబ్బులు భారతీయ విప్లవకారుల ఉద్దేశ్యం మరియు మిషన్‌కు తమ పూర్తి మద్దతు ఇచ్చారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.  

 

No comments:

Post a Comment