స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ప్రముఖ
నాయకుడు దివంగత బద్రుద్దుజా, ప్రజా సమస్యలపై దృఢమైన వైఖరి మరియు వక్తృత్వానికి oratoryకి పేరుగాంచారు.
బద్రుద్దుజా
స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు.దేశ విభజనకు ముందు బద్రుద్దుజా కలకత్తా
మేయర్‌గా ఉన్నారు.
1947 తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బద్రుద్దుజా పాత్ర
ముఖ్యమైనది.
ముస్లిం సమస్యలపై మాట్లాడేందుకు బద్రుద్దుజా ఏనాడూ వెనుకాడలేదు,
బద్రుద్దుజా ముస్లింలకు జరుగుతున్న అన్యాయం,
దౌర్జన్యాలపై ఉద్యమించారు. బ్లిట్జ్ మరియు ఇతర
వార్తాపత్రికలు బద్రుద్దుజా ను 'రియాక్షనరీ'గా పేర్కొన్నాయి. బద్రుద్దుజా సామాన్య పౌరుల సమస్యలపై నిర్భయంగా
మాట్లాడేవాడు..
అప్పటి WBరాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సిద్ధార్థ శంకర్ రే, బద్రుద్దుజా ను
వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నప్పుడు, సిద్ధార్థ శంకర్ రే క్షమాపణ చెప్పాల్సిన రీతిలో అతని వ్యక్తిగత
దాడికి బద్రుద్దుజా స్పందించాడు. 'నా మతం మరియు సంస్కృతి పట్ల నా విధేయత నన్ను హేళన చేయడానికి
ఉపయోగిస్తే, నేను దాని గురించి
గర్వపడుతున్నాను' అని బద్రుద్దుజా అన్నారు.
1967లో బద్రుద్దుజా IDP
అభ్యర్థిగా ఎంపీ పదవికి ఎన్నికయ్యారు. అసెంబ్లీ & పార్లమెంట్‌లో,
బద్రుద్దుజా ఎప్పుడూ రాజీపడని సూత్రాలపై దృఢంగా ఉండే
వ్యక్తి.కృషక్ ప్రజా పార్టీ (KPP)తో మరియు ఆ తర్వాత
IDP లో బద్రుద్దుజా తన రాజకీయ
సూత్రాలపై నిర్భయంగా వ్యవరించాడు. తరచూ
ప్రభుత్వాలతో విభేదిస్తూ పదే పదే జైలుకు వెళ్లాడు.
సయ్యద్ బద్రుద్దుజా 1900లో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జన్మించారు. సయ్యద్ బద్రుద్దుజా
న్యాయశాస్త్రం అభ్యసించాడు మరియు 1943-44లో కోల్‌కతా మేయర్‌గా పనిచేశాడు. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమాల్లో
పాల్గొన్నారు. తరువాత,
సయ్యద్ బద్రుద్దుజా స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ బెంగాల్
శాసన మండలి సభ్యుడు అయ్యాడు.పశ్చిమ బెంగాల్ శాసనసభ కు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా
లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు..
దేశ విభజన అనతరం బద్రుద్దుజా భారత దేశం
లోనే ఉండిపోయారు. బెంగాల్ మరియు ఉత్తర భారతదేశంలోని ముస్లింలకు రాజకీయ స్వరం గా మారారు.
INC
లేదా కమ్యూనిస్టులలో చేరకుండానే రాజకీయాలు సాధ్యమవుతాయని, స్వతంత్ర వైఖరిని అవలంబించాలని బద్రుద్దుజా భావించారు. బద్రుద్దుజా నిర్భయంగా
మాట్లాదేవాడు మరియు ముస్లింలకు సంబంధించిన
సమస్యలను అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లోనూ చర్చిoచాడు.
వాక్చాతుర్యం oratory విషయానికొస్తే,
టాగోర్ 1938లో బద్రుద్దుజా మాట్లాడటం చూసి దానిని 'దేవుని బహుమతి' అని ప్రశంసలు కురిపించారు. బద్రుద్దుజాను ఠాగూర్, రచయిత అని
మరియు వక్తృత్వం నైపుణ్యo writer and oratory కలవాడు అని అన్నాడు. బద్రుద్దుజా ఆంగ్ల ప్రసంగం, సివి
రామన్ ను మంత్రముగ్ధునిగా చేసింది. బద్రుద్దుజా
తన ఉర్దూ ప్రసంగాలతో ఉత్తరాది ప్రజలను మంత్రముగ్ధులను చేసాడు.
No comments:
Post a Comment