భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చిన మొదటి ఇద్దరు తమ తొండాలలోఅదృష్టాన్ని కలిగి ఉన్నారు!
లాభదాయకమైన ఇండో-అమెరికన్ వాణిజ్యం సుమారు 1790లో ప్రారంభమైంది మరియు రెండు తీరాలలో అదృష్టాన్ని సంపాదించినది.
మసాచుసెట్స్కు చెందిన కెప్టెన్ జాకబ్ క్రౌనిన్షీల్డ్ తన కుటుంబానికి చెందిన
"ది అమెరికా" అనే ఓడలో భారతదేశానికి కొన్ని పర్యటనలు చేశాడు. ఒక ప్రయాణంలో కెప్టెన్ జాకబ్ క్రౌనిన్షీల్డ్ మొదటిసారిగా ఏనుగును చూశాడు. ఆ రోజుల్లో ఏ అమెరికన్ జంతుప్రదర్శనశాలలో ఏనుగు లేదు మరియు ఏనుగు యొక్క మొదటి దృశ్యం కెప్టెన్ జాకబ్ క్రౌనిన్షీల్డ్ ని విస్మయానికి గురిచేసింది.
వ్యాపారి అయిన జాకబ్ కు ఒక ఆలోచన వచ్చింది. టిక్కెట్టు పెట్టిన బహిరంగ ప్రదర్శనలో ఏనుగును ఉంచడం ద్వారా లాభం పొందాలనే ఆలోచనతో జాకబ్ రెండు సంవత్సరాల వయస్సు గల ఒక చిన్న ఏనుగును $450.00తో కొని అమెరికాకు తీసుకు వెళ్ళదలిచాడు. ఏనుగు అమెరికా కు కలకత్తా నుండి ఒక వాణిజ్య
నౌకలో డిసెంబర్ 3, 1795న ప్రయాణించింది.అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న సెయింట్ హెలెనా ద్వీపం
"ఏనుగు మేయటానికి కు ఆకులు అలమలు " ఇవ్వబడినవి.
సేలంకు ఏప్రిల్ 13,
1796న ఓడ వచ్చిందన్న వార్త ముఖ్యాంశాలుగా మారింది. ఒక న్యూయార్క్ ప్రచురణ ఇలా వ్రాసింది: “ది షిప్ అమెరికా”లో సేలం,
మసాచుసెట్స్కు చెందిన కెప్టెన్ జాకబ్ క్రౌనిన్షీల్డ్, బెంగాల్ నుండి ఏనుగును అమెరికాకు తీసుకువచ్చారు”
ఏనుగు మొట్టమొదటిసారి సారి అమెరికాలో గా కనిపించింది మరియు గొప్ప ఉత్సుకతను కలిగి ఉంది. రెండు సంవత్సరాల వయస్సు గల ఆడ ఏనుగు కు దాని యజమాని పేరు మీద 'ది క్రౌనిన్షీల్డ్ ఎలిఫెంట్' అని నామకరణం చేయబడింది.
జాకబ్, ఏనుగును డాకింగ్లో వెంటనే $10000కి విక్రయించినప్పటికీ అతని పేరు అలాగే నిలిచిపోయింది.
"ఎలిఫెంట్ ఆన్ డిస్ప్లే"
ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి మరియు ఆ తర్వాత ఏనుగు తూర్పు USలో పర్యటించింది.ఏనుగు ను చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు టికెట్
కొన్నారు.. 23 ఏప్రిల్ 1776న న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచిన ఏనుగు ను ఆతరువాత బోస్టన్, మసాచుసెట్స్ మరియు ఫిలడెల్ఫియాలో ప్రదర్శించారు. . అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ కూడా 16 నవంబర్ 1796న ఏనుగును చూడటానికి టికెట్ కొన్నాడు.
ఇంతలో 1804లో మరో ఏనుగు బోస్టన్కు చేరుకుంది.దాని యజమాని న్యూయార్క్లోని సోమర్స్కు చెందిన రైతు హచలియా బెయిలీ. బెయిలీ ఏనుగు కు “ఓల్డ్ బెట్”
అని పేరు పెట్టాడు.
ఓల్డ్ బెట్ చాలా దృష్టిని ఆకర్షించింది మరియు దానిని బెయిలీ ప్రదర్శనలో ఉంచాడు. టికెట్ ధర 25 సెంట్లు. ఏనుగు ప్రదర్సన ద్వారా మంచి ఆదాయం రావడంతో బెయిలీ దానిని సమీప పట్టణాలు మరియు పొరుగు కౌంటీలలో ప్రదర్శించాడు. ప్రజలకు "ఫ్రీ లుక్" హక్కు ఉండదు!
బెయిలీ వ్యాపారం విస్తరించినది క్రమంగా బెయిలీ తన జంతువుల ప్రదర్సన,
పశువుల పెంపకం వ్యాపారాన్ని విస్తరించాడు. త్వరలో ఖడ్గమృగాలు, కోతుల చిలుకలు, ఒంటెలు మొదలగు అన్ని జంతువులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో నాలుగు రథాలు, శిక్షణ పొందిన కుక్క, గుర్రం మరియు కొన్ని పందులు కూడా ఉన్నాయి. అది కొన్ని సంవత్సరాలలో బెయిలీస్ సర్కస్ గా ప్రసిద్ధి చెందింది.
బైలీ, ఓల్డ్ బెట్(ఏనుగు) తో కలసి అనేక సంవత్సరాలపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించాడు. దురదృస్టవశాత్తు జూలై 24,
1816న, ఓల్డ్ బెట్కు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు,
డేనియల్ డేవిస్ అనే వాగాబాండ్(తుంటరి)
కలసి ఏనుగు ను బెయిలీ ముందు కాల్చి చంపాడు.
ఓల్డ్ బెట్ మరణం తర్వాత, బెయిలీ సోమర్స్కు తిరిగి వచ్చాడు.1821లో, బెయిలీ ఓల్డ్ బెట్ అవశేషాలను న్యూయార్క్ నగరంలోని ఒక అమెరికన్ మ్యూజియమ్కు విక్రయించాడు. 1825లో బెయిలీ ఎలిఫెంట్ హోటల్ను నిర్మించడం ప్రారంభించాడు. 1825లో ఎలిఫెంట్ హోటల్ భవనం పూర్తయినది.
9 ఏప్రిల్ 1922న, జాన్ సుల్లివన్ అనే ఒక సర్కస్ ఏనుగు న్యూయార్క్ నుండి సోమర్స్లోని ఎలిఫెంట్ హోటల్ వరకు 53 మైళ్ల నడకను ప్రారంభించింది. నాలుగు రోజుల తర్వాత,
ఓల్డ్ బెట్ ఎలిఫెంట్ హోటల్ వద్దగల ఓల్డ్ బెట్ స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించింది.
ఎలిఫెంట్ హోటల్ ఇప్పుడు టౌన్ హాల్ మరియు ఓల్డ్ బెట్ (ఏనుగు) స్మారక చిహ్నం ఇప్పటికీ ఉంది. ఓల్డ్ బెట్ (ఏనుగు)విగ్రహం
ఒక విధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చిన మొదటి భారతీయ వలసదారులను స్మరించుకుంటుంది!
తొండాలతో అదృష్టాన్ని సంపాదించిన ఏకైక భారతీయ వలసదారులు!!!
No comments:
Post a Comment