భారత దేశంలో రాజస్థాన్‌లోని టోంక్ రాజ్యాన్ని నవాబ్ అమీర్ ఖాన్ A.D. 1817 నుండి 1834 వరకు పాలించాడు. అమీర్ ఖాన్ ను మీర్ ఖాన్ లేదా అమీర్ ఖాన్ పిండార లేదా పిండారి అని పిలుస్తారు. అమీర్ ఖాన్ సలార్జాయ్ అని పిలువబడే బునర్ తెగకు చెందిన ఆఫ్ఘన్. అమీర్ ఖాన్ తాత, తాలే ఖాన్, పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా పాలనలో భారతదేశానికి వలస వచ్చారు.
తాలే ఖాన్ రోహిల్‌ఖండ్‌లో రోహిలా అలీ మహమ్మద్ ఖాన్ క్రింద పని చేసాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అయోన్లాను ముట్టడించినప్పుడు, తలే ఖాన్ ఎటువంటి బాహ్య సహాయం లేకుండా ఎనిమిది రోజులు తనను తాను రక్షించుకున్నాడు. చక్రవర్తి మహమ్మద్ షా, తాలే ఖాన్ ధైర్య ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయాడు మరియు తలేహ్ ఖాన్‌ను మొఘల్ సామ్రాజ్య సేవలో తీసుకోవాలని ప్రతిపాదించాడు.తాలే ఖాన్ మొఘల్ చక్రవర్తి ప్రతిపాదనను తిరస్కరించారు. తాలే ఖాన్ కుమారుడు హయత్ ఖాన్, మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ వద్ద కొంత భూమిని సంపాదించాడు. నవాబ్ అమీర్ ఖాన్ A.D. 1182 (1767)లో మొహల్లా సెరా టెరీనాలోని సంభాల్‌లో జన్మించాడు.
అమీర్ ఖాన్ ఇరవై సంవత్సరాల వయస్సులో, జీవనోపాధి కోసం మహదాజీ సింధియా సైన్యంలో చేరాలని ప్రయత్నించాడు కానీ అదృష్టం కలసిరాలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అమీర్ ఖాన్ కూలిగా పనిచేశాడు.ప్రారంభంలో అమీర్ ఖాన్ మరియు అతని సహచరులు సెబన్-డైస్ లేదా స్థానిక మిలీషియా యొక్క పురుషులుగా నియమించబడ్డారు. ఆ తరువాత కొంతకాలం అమీర్ ఖాన్ భోపాల్ పాలకుడు హయత్ మొహమ్మద్ ఖాన్ సైన్య సహయకునిగా నియమించబడినాడు అమీర్ ఖాన్ అక్కడ కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉన్నాడు. తరువాత అమీర్ ఖాన్ రాజ్‌పుత్ ముఖ్యులు-దుర్జన్ సాల్ మరియు జై సింగ్ ఖిచి కోసం పోరాడాడు,
అమీర్ ఖాన్ తన సైనిక ప్రతిభను ప్రదర్శించి 500మంది సైనికుల కమాండ్‌కు పదోన్నతి పొందాడు. తర్వాత అమీర్ ఖాన్, బాలా రావు ఇంగ్లియా సేవలోకి ప్రవేశించాడు, బాలా రావు ఇంగ్లియా అమీర్ ఖాన్‌ను 1500 సైనికుల కమాండ్‌కు పదోన్నతి కల్పించి ఫతేఘర్ కోటను అప్పగించాడు. కానీ దానిని అమీర్ ఖాన్ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు
A.D. 1768లో అమీర్ ఖాన్ జస్వంత్ రావ్ హోల్కర్‌కు గట్టి అనుచరుడిగా మారాడు. అమీర్ ఖాన్, దౌలత్ రావ్ సింధియా మరియు పీష్వా బాజీ రావు II లకు వ్యతిరేకంగా పోరాడాడు. 1798లో జస్వంత్ రావ్ హోల్కర్ సిరోంజ్, 1806లో టోంక్ మరియు పిరవా1809లో నింభహేరా చివరగా 1816లో ఛబ్రా అమీర్ ఖాన్‌కు అప్పగించారు. హోల్కర్ అమీర్ ఖాన్ యొక్క విశేష సేవలను గుర్తించి అమీర్ ఖాన్‌కు నవాబ్ అనే బిరుదును ప్రసాదించాడు. అమీర్ ఖాన్ జస్వంత్ రావ్ హోల్కర్ మద్య స్నేహం 1811లో జస్వంత్ రావ్ హోల్కర్ మరణించే వరకు కొనసాగింది.
నవాబ్ అమీర్ ఖాన్ తన ఫిరంగిదళంతో మధ్య భారతదేశం మరియు రాజ్‌పుతానా లో ప్రముఖుడు గా మారాడు. ప్రధాన రాజ్‌పుత్ రాష్ట్రాలు - జైపూర్, జోధ్‌పూర్ మరియు ఉదయపూర్ అమీర్ ఖాన్ చేతిలో చాలా నష్టపోయాయి. పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్ సింగ్, కాబూల్‌కు చెందిన షా షుజా సహాయంతో మరియు ఆఫ్గనిస్తాన్ లోని గిరిజనుల సహాయంతో బ్రిటిష్ వారిని దేశం నుండి వెళ్లగొట్టాలని అమీర్ ఖాన్ ప్రయత్నించాడు. కాని అమీర్ ఖాన్ పథకాలు కార్యరూపం దాల్చలేదు.
నవాబ్ అమీర్ ఖాన్ 1817లో అమీర్ ఖాన్ టోంక్ నవాబ్‌గా ప్రతిష్టించబడినాడు. అమీర్‌ఖాన్ 1817లో అమిరుద్-దౌలా పేరుతో టోంక్ రాచరిక రాష్ట్ర మొదటి పాలకుడు అయ్యాడు. పిండారీ వ్యతిరేక డ్రైవ్ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం నవాబ్ అమీర్ ఖాన్ మరియు మధ్య భారతదేశం మరియు రాజ్‌పుతానాలోని ఇతర పాలకులతో సహకారాన్ని పొందేందుకు చర్చలు ప్రారంభించింది.
నవాబ్ అమీర్ ఖాన్ A.D. 1832లో గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ యొక్క దర్బార్‌కు
హాజరయ్యేందుకు అజ్మీర్‌ను సందర్శించాడు. నవాబ్ అమీర్ ఖాన్ జనవరి 9,
1832న హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ జనరల్ లార్డ్
విలియం బెంటింక్ ని మర్యాదపూర్వకంగా సందర్శించారు మరియు నవాబ్ అమీర్ ఖాన్ తన స్వేచ్ఛా మరియు స్పష్టమైన అభిప్రాయాలతో గవర్నర్ జనరల్ ను
అమితంగా ఆకట్టుకున్నారు. నవాబ్ అమీర్ ఖాన్ 17 సంవత్సరాలు టోంక్ రాచరిక రాష్ట్రమును పాలించాడు మరియు క్రీ.శ. 1834లో అరవై ఏడు సంవత్సరాల వయసులో మరణించాడు.
ఉదయపూర్ మహారాణా మరియు జోధ్‌పూర్ మహారాజా జస్వంత్ రావ్ హోల్కర్‌తో తన తలపాగాను
మార్చుకున్న వీర యోధుడు నవాబ్ అమీర్ ఖాన్. ఝలా జలీమ్ సింగ్ భార్యకు రాఖీబంద్ భాయ్ నవాబ్
అమీర్ ఖాన్. కూడా. అమీర్ ఖాన్ కుమారుడు, వజీరుద్-దౌలా, మొఘల్ చక్రవర్తి అక్బర్ IIకి దగ్గరి బంధువు. మన దివంగత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్
హుస్సేన్ అమీర్ ఖాన్ తెగకు చెందినవారు. 'భారతదేశం యొక్క ఈ చివరి గొప్ప పఠాన్ సైనిక మేధావికి చరిత్ర న్యాయం
చేసిందని చెప్పలేము.’. అని దివంగత డాక్టర్ కె.ఆర్. ఖనుంగో సముచితంగా వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment