భారతదేశంలోని పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ్యులలో ముస్లిం ప్రాతినిధ్యాన్ని నిరోధించడానికి దాదాపు పదేళ్లకు ఒకసారి డీలిమిటేషన్ కసరత్తు ద్వారా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట, వారి జనాభాను పక్కకు నెట్టడం ఎప్పటినుంచో జరుగుతుంది అని ఒక ఫిర్యాదు కలదు.
డీలిమిటేషన్ కసరత్తు ద్వారా ముస్లిం మెజారిటీ జనాభా
ఉన్న నియోజకవర్గాలలో ముస్లిం
ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి హిందూ దళితులకు రిజర్వ్ చేయబడ్డాయి.
· ఉదాహరణకు సెన్సస్ నివేదిక ప్రకారం, గోపాల్‌గంజ్ (బీహార్)లో ముస్లింల జనాభా 17 శాతానికి పైగా ఉంది, ఇక్కడ దళితులు 12 శాతం మాత్రమే ఉన్నారు, అయితే ఈ సీటు దళితులకు రిజర్వ్ చేయబడింది.
· కరీంగంజ్ (తెలంగాణ)లో కూడా ముస్లింలు 56 శాతం, దళితులు 12 శాతం ఉన్నారు, దళితులకు సీటు రిజర్వ్ చేయబడింది.
· బిజ్నోర్ (యూపీ)లోని నగీనా సీటులో 43.04% ముస్లింలు ఉండగా, దళితుల సంఖ్య 21% మాత్రమే, ఈ సీటు దళితులకు రిజర్వ్ చేయబడింది.
· బులంద్‌షహర్ (యుపి)లో దళితుల కంటే ముస్లింల జనాభా రెండు శాతం ఎక్కువ, అయితే ఇది దళితులకు రిజర్వ్‌డ్ సీటు.
·
గుజరాత్‌లో
ముస్లిం మెజారిటీ గల కచ్ మరియు అహ్మదాబాద్ పశ్చిమ నియోజకవర్గాల స్థానాలు కూడా దళితులకు రిజర్వు చేయబడినవి.
·
బీహార్‌లోని
గోపాల్‌గంజ్, తెలంగాణలోని కరీమ్‌గంజ్, యుపిలోని నగీనా మరియు బులంద్‌షహర్, గుజరాత్‌లోని కచ్ మరియు అహ్మదాబాద్ వెస్ట్‌లు ముస్లిం మెజారిటీ ఉన్నా దళితుల రిజర్వు స్థానాలకు ఆరు ఉదాహరణలు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న సీట్లను దళిత వర్గానికి రిజర్వ్ చేయాలనే ఆలోచన అధికారంలో ఉన్నవారు ఆడుతున్న తెలివైన గేమ్. ఫలితంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభకు చేరుకోలేకపోతున్నారు.
ఇందుకు భిన్నంగా దళితుల జనాభా ఎక్కువగా ఉన్న
నియోజకవర్గాలను అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో పెట్టారు. ఈ నియోజకవర్గాలు బీహార్‌లోని
ఔరంగాబాద్ మరియు యూపీలోని రాయ్ బరేలీ.
· ఔరంగాబాద్‌లో అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారు, అయితే ఈ సీటు అన్‌రిజర్వ్‌డ్ సీటు. అదే విధంగా రాయ్‌బరేలీలో 30 శాతం దళిత జనాభా ఉన్నప్పటికీ అది అన్‌రిజర్వ్‌డ్ సీటు.
2005లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ, ఆ తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రాలు మరియు కేంద్ర శాసనసభల్లో ముస్లింల ప్రాతినిద్యం పెంచడానికి ఎన్నికల సీట్లు రిజర్వ్ చేయాలనీ సిఫార్సు చేసింది. దళిత-గిరిజనులు, ముస్లింలు మెజారిటీగా ఉన్న స్థానాల్లో అలాంటి స్థానాలను దళిత-గిరిజనులు, ముస్లింలకు కేటాయించాలని కూడా సిఫార్సు చేశారు. డీలిమిటేషన్ ఎన్నికల కసరత్తు ద్వారా ముస్లిం మెజారిటీ సీట్లను ఎస్సీ కేటగిరీలో రిజర్వ్ చేయాలని సచార్ కమిటీ సూచించింది. అయితే, సచార్ కమిటీ నివేదిక సిఫార్సులు చేసి చాలా సంవత్సరాలు గడిచినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు.
· బెంగాల్, అస్సాం మరియు బీహార్‌లలో 9 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ ముస్లిం జనాభా 50 శాతానికి పైగా ఉంది, అయితే ఈ స్థానాలు ముస్లింలకు రిజర్వ్ చేయబడలేదు.
· అస్సాంలో జారీ చేసిన డీలిమిటేషన్ ముసాయిదాలో ముస్లిం మెజారిటీ సీట్లను డీలిమిటేషన్ కమిషన్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించబడింది.. డీలామినేషన్ అమలైతే రాష్ట్రంలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుందని ముస్లిం వర్గాలు అంటున్నాయి. అస్సాంలో ముస్లింల జనాభా 33 కంటే ఎక్కువ కానీ శాసనసభలో ముస్లింల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.
· జమ్మూ కాశ్మీర్‌లో, ఇటీవల, డీలిమిటేషన్ కమిషన్ కాశ్మీరీ పండిట్‌లకు 2 సీట్లను రిజర్వ్ చేయాలని సిఫార్సు చేసింది. అయితే ఇలాంటి ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్ లేదు. జమ్మూ కాశ్మీర్‌లో చేసిన డీలిమిటేషన్ కసరత్తు కాశ్మీర్ లోని ముస్లిం ఆధిపత్య ప్రాంతంపై జమ్మూలోని హిందూ ఆధిపత్య ప్రాంతం ఆధిపత్యం కోసం జరిగింది.
డీలిమిటేషన్ కమిషన్ అనేది న్యాయస్థానంలో సవాలు చేయలేని నిర్ణయం. డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 10(2)లో కమిషన్ నిర్ణయమే అంతిమమని స్పష్టంగా రాసి ఉంది. కమిషన్ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానం మధ్యవర్తిత్వం arbitrate చేయదు మరియు కట్టుబడి ఉంటుంది.
భారతదేశంలో ముస్లింలు చుక్కాని/మార్గనిర్దేశం లేనివారు అనడం సముచితంగా ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, భారత దేశం లో ముస్లిం సమాజం యొక్క ఆకాంక్షలను వినిపించగల ముస్లిం నాయకులను ఎదగడానికి అనుమతించబడలేదు. దేశంలోని లౌకిక వర్గాలలో ముస్లిం నాయకత్వం పెంపొందించబడలేదు.
ముస్లింల పక్షాన మాట్లాడే బాధ్యత హిందూ నాయకత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో ములాయం సింగ్ యాదవ్, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ భారత ముస్లింల పక్షాన మాట్లాడడంతో వారు ముస్లిం రాజకీయాలకు కేంద్రంగా మారారు.
భారతదేశ ఎన్నికల రాజకీయాలలో 80 వర్సెస్ 20 ఫార్ములాను కనిపెట్టిన BJP దృష్టికోణంలో, ముస్లింలకు లేదా దాని నాయకత్వానికి దేశంలో రాజకీయ స్థలం లేదు. ముస్లింలు లేని 80 వర్సెస్ 20 ఫార్ములా ఆధారంగా బిజెపి రాష్ట్రాలు మరియు దేశాన్ని నడపగలదు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పోషించిన పాత ముస్లిం ఉన్నత వర్గాలను పక్కన పెట్టడంలో బిజెపి విజయం సాధించింది. ముస్లిం ఉన్నత వర్గాలను పక్కన పెట్టడం ద్వారా, ముస్లిం సమాజం తరపున చర్చలు జరపడానికి ముస్లింలలో ఎవరూ ఉండకుండా బిజెపి చూసింది.
బి.సి., ఒ.బి.సి., మహాదళిత్ మరియు దళితులను హిందువుల నుండి ముస్లిం కమ్యూనిటీకి మారిన వారిని బిజెపి పస్మాండ ముస్లింలుగా పిలుస్తుంది. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. పస్మందా ముస్లిముల వెనుకుబాటుతనం పై సానుభూతి చూపిస్తుంది. వారి ఓట్లు పొందటానికి అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది.
ఇటువంటి పరిస్థితిలో, భారతదేశంలో ముస్లింల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ముస్లింలు తమ పరిస్థితిని సమీక్షించుకుని,
తమ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడానికి లేదా అధ్వాన్నమైన
పరిస్థితులకు సిద్ధం కావడానికి ఇది సరైన సమయం.
మూలం: ముస్లిం
మిర్రర్, రచయిత:సయ్యద్ అలీ ముజ్తబా, జూలై 14, 2023
No comments:
Post a Comment