15 July 2023

పాఠశాలలు మరియు ఉన్నత విద్యలో ముస్లింల అధ్వాన్నమైన నమోదు-నివారణ చర్యలు The abysmal enrolment of Muslims in schools and higher education-Remidies

 


 

భారతీయ ముస్లింలు పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలలో అతి తక్కువ నమోదు రేటును కలిగి ఉన్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయాలు మరియు కేంద్రీ విద్యాలయాలు/సెంట్రల్ స్కూల్‌లు మరియు అన్ని IITలు మరియు IIMలను కలిగి ఉన్న 149 జాతీయ ప్రాముఖ్యత కలిగిన దేశ అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలలలో ముస్లిముల నమోదు శాతం అతి తక్కువుగా ఉంది.

జాతీయ ప్రాముఖ్యత కలిగిన దేశ ఉన్నత విద్యా సంస్థలలో, SC మరియు STల కంటే చాలా తక్కువ ముస్లిం విద్యార్ధులు ఉన్నారు.

2020-21 డేటా మరియు నివేదికల విశ్లేషణ ఈ అసమానతలను వెల్లడిస్తుంది.

1)JNVమరియు KVస్కూల్స్ లో ముస్లిం విద్యార్ధుల నమోదు శాతం:

భారతీయదేశ  జనాభాలో SCలు మరియు STలు వరుసగా 16.6% మరియు 8.6% మంది కలరు.

20-21లో మొత్తం 2.9 లక్షల మంది JNV విద్యార్థుల నమోదులో SCలు మరియు ST విద్యార్ధుల నమోదు  వరుసగా 25% మరియు 20% వద్ద చాలా ఎక్కువగా ఉంది.

భారతదేశ జనాభాలో ముస్లింలు 14.2% ఉన్నప్పటికీ, JNV విద్యార్థుల నమోదులో ముస్లిం విద్యార్ధుల నమోదు 4% కంటే చాలా తక్కువగా ఉంది.

20-21 UDISE డేటా కేంద్రీయ  విద్యాలయాల వంటి ప్రత్యేక పాఠశాలల్లో ముస్లిం విద్యార్ధుల నమోదు గణనీయంగా తక్కువగా ఉందని వెల్లడించింది.

20-21లో మొత్తం 13.9 లక్షల మంది విద్యార్ధులు  కేంద్రీ విద్యాలయాలయాలలో నమోదు చేసుకోగా అందులో కేవలం ముస్లిం విద్యార్థులు 4% నమోదు అయ్యారు.

SC మరియు ST నమోదుల నిష్పత్తి KVలలో 20% మరియు 6% వద్ద చాలా ఎక్కువగా ఉంది.

2)ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్ధుల నమోదు:

IITలు, IIMలు మరియు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఢిల్లీ మరియు అలీగఢ్ యూనివర్శిటీలతో సహా భారతదేశంలోని అన్ని ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలలో ఉన్నత విద్య లో ముస్లిం విద్యార్ధుల నమోదు అతి తక్కువుగా ఉంది.

20-21 ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) జాతీయ ప్రాముఖ్యత కలిగిన 149 సంస్థలలో SC మరియు ST విద్యార్థుల నమోదు శాతం వరుసగా 13.1% మరియు 6.1% అని వెల్లడించింది.

20-21 ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) జాతీయ ప్రాముఖ్యత కలిగిన 149 సంస్థలలో ముస్లిం విద్యార్ధుల నమోదు శాతం కేవలం 1.9% ఉంది. దాదాపు అన్ని ఉన్నత విద్యా సంస్థలలో ముస్లింల నమోదు సమానంగా దుర్భరంగా ఉంది.

2015-16లో, మొత్తం ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్ధుల నమోదు  4.7% ఉండగా, 20-21లో ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్ధుల నమోదు  4.6%కి పడిపోయింది.

2015-16 మరియు 20-21 రెండు కాలవ్యవధులలో  SC మరియు ST విద్యార్థులు నమోదులో చాలా ఎక్కువ రేట్లు కలిగి ఉన్నారు.

20-21 ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) జాతీయ ప్రాముఖ్యత కలిగిన 149 సంస్థలలో SC మరియు ST విద్యార్థుల వాటా 13.1% మరియు 6.1% అని వెల్లడించింది.

20-21 ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) జాతీయ ప్రాముఖ్యత కలిగిన 149 సంస్థలలో ముస్లిం విద్యార్ధుల నమోదు రేటు 1.9% గా ఉంది.

కాని ఈ దుర్భర పరిస్థితిలో కూడా పాఠశాలలు మరియు కళాశాలల్లో ముస్లిం బాలికల అనూహ్య నమోదు రేట్లు కలిగి ఉన్నారు.

ముస్లిం అబ్బాయిల కంటే ఎక్కువ మంది ముస్లిం బాలికలు 6-12 తరగతులకు సంబంధించిన ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక దశల్లో చదువుతున్నారు.

మరియు 20-21 AISHE నివేదిక ముస్లిం పురుషుల కంటే ఉన్నత విద్యలో చేరిన ముస్లిం స్త్రీలు స్వల్పంగా అధికంగా  ఉన్నారని సూచించింది.

ప్రతిష్టాత్మక పాఠశాల మరియు ఉన్నత విద్యా సంస్థలలో ముస్లిం నమోదును ఏ చర్యలు గణనీయంగా మెరుగుపరుస్తాయి? 

20-21లో 6-12 తరగతుల్లో ముస్లిం నమోదు రేటు అత్యల్పంగా SC మరియు STల కంటే చాలా తక్కువగా ఉంది. 6-12 తరగతుల్లో బలహీనంగా ఉన్న  ముస్లిం నమోదు రేటు బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇందుకు గాను ముస్లింలందరికీ 12 సంవత్సరాల నాణ్యమైన పాఠశాల విద్య మరియు రెండు సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యను అందించడం చేయాలి.

పేద మరియు దిగువ మధ్యతరగతి మరియు వెనుకబడిన, ముస్లిం విద్యార్ధులను  పాఠశాల మరియు ఉన్నత విద్య యొక్క సాధారణ మరియు ప్రతిష్టాత్మక సంస్థలలో నమోదును గణనీయంగా  మెరుగుపరచాలి.ఇందుకు గాను పాఠశాలలో మరియు ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్ధుల సమగ్ర గణాంకాలు సేకరించాలి. ఈ సమాచారంలో చాలా వరకు ఇప్పటికే వివిధ ప్రభుత్వ సంస్థలు సేకరించాయి, కానీ ప్రచురించబడలేదు.

ప్రచురించని డేటాలో MOE యొక్క UDISE నివేదికలు, NCERT యొక్క నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేస్ (NAS)లో ముస్లిం విద్యార్థుల అభ్యాస స్థాయిలు ఉన్నాయి.

ముస్లిం విద్యార్థుల ఎంపిక మరియు నమోదుకు సంబంధించిన డేటా కూడా లేదు. ప్రతిష్టాత్మకమైన JNV మరియు KV పాఠశాల నెట్‌వర్క్‌ల వెబ్‌సైట్‌లలో మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన 166 సంస్థలలో ప్రతి ఒక్కటి లో కూడా ముస్లిం విద్యార్థుల ఎంపిక మరియు నమోదుకు సంబంధించిన డేటా ప్రచురించబడాలి.

అభ్యర్థులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రచురించని ముస్లిం డేటా యొక్క మొత్తం శ్రేణిని వెలికితీసి బహిరంగపరచాలి మరియు పాఠశాల మరియు ఉన్నత విద్యలో ముస్లింల స్థితిగతులపై జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నివేదికలను సంకలనం చేయాలి మరియు క్రమం తప్పకుండా ప్రసారం చేయాలి. ఈ రెండు పనులకు, అలీఘర్ విశ్వవిద్యాలయం మరియు జామియా వంటి సంస్థలు మరియు బలమైన విద్యా విభాగాలు ఉన్న ఇతర సంస్థలు నాయకత్వం వహించాలి.

ముగింపు:

ముస్లింలందరికీ 14 సంవత్సరాల సార్వత్రిక నాణ్యమైన పాఠశాల విద్య అనే కొత్త లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్మాణాత్మక చర్య అవసరం. విద్యా పథకాలను పర్యవేక్షించడం మరియు మూల్యాంకనం చేయడం, ముఖ్యమైన సమస్యలను చర్చించడం మరియు పాలసీ మరియు కమ్యూనిటీ ఇన్‌పుట్‌లను అందించగల బలమైన రాష్ట్ర మరియు స్థానిక అధ్యాయాలతో కూడిన జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలి. ముస్లిం వర్గాలకు మరింత మెరుగైన నిర్మాణాత్మక సంస్థాగత కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది

 

No comments:

Post a Comment