2024 ఎన్నికలకు ముందు 'పస్మాండ' ముస్లింలను బిజెపి వైపుకు ఆకర్షించడానికి పిఎం మోడీ 'పస్మాండ’ ముస్లిములను గురించి తరచూ ప్రస్తావిస్తున్నారు.
అయితే ఇదే సందర్భం లో ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు సమానత్వ మతాలనీ, అంటరానితనం లేదని, అందుకే 'దళిత ముస్లింలకు' ఎస్సీ హోదా కల్పించాల్సిన అవసరం లేదని పిఎం మోడీ ప్రభుత్వం
చెప్పింది
పిఎం మోదీ మాట్లాడుతూ, పస్మాండ ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని, వారి దుర్భరమైన జీవితాలకు కారణం ఉద్యోగ రంగo లో వారికి అవకాశాలు లేకపోవడమని అన్నారు. గత ప్రభుత్వాల నుంచి పస్మందాలకు ఎలాంటి ప్రయోజనాలు అందలేదని మరియు గత ప్రభుత్వాలు వారి గోడు వినిపించుకోలేదని అన్నారు
పస్మాండాలు సమానత్వం నిరాకరించబడి దోపిడీకి గురవుతున్నామని చెప్పడం సరైనదే. "అంటరానివారు"గా పరిగణించబడే పస్మాండ ముస్లింల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం అత్యంత సంతోషకర విషయం.
పస్మంద (పెర్షియన్) పదం, "వెనుక పడిపోయిన" వారిని సూచిస్తుంది. పస్మాంద ముస్లింలు వెనుకబడినవారు (శూద్ర) మరియు దళితులు (అతి-శూద్ర), కుల అణచివేత నుండి తమను తాము విముక్తి చేయడానికి శతాబ్దాల క్రితం ఇస్లాంను స్వీకరించారు.కానీ మతం మారడం వారికి విముక్తి కలిగించలేదు. నేటికీ కుల వివక్ష, వస్తు పస్మాండ ముస్లింలు లేమితో బాధపడుతూనే ఉన్నారు.
పస్మాంద ముస్లింలు విభజన మరియు అంటరానితనం యొక్క బాధితులు కూడా. ఇస్లాం సమానత్వం మరియు సోదరభావాన్ని నొక్కి చెబుతుంది, కాని ముస్లిం సమాజం యొక్క సామాజిక నిర్మాణం సమానత్వానికి దూరంగా ఉంది.
పిఎం మోదీ తన ప్రసంగంలో పస్మాంద ముస్లింలు అంటరానితనం బాధితులని అంగీకరించారు. పిఎం మోదీ చెప్పినట్లుగా, “పస్మాంద ముస్లింలు ఇప్పటివరకు సమానత్వం పొందలేదు; వారిని తక్కువ (నీచ)గా పరిగణిస్తారు మరియు అంటరానివారు (అచ్చుత్)గా పరిగణిస్తున్నారు.
పస్మoద ముస్లిముల పట్ల అంటరానితనo ఉందని పిఎం మోదీ అంగీకరించడం మరియు ఇది హిందూ హక్కుల ఇస్లాం మరియు క్రైస్తవ మతాలలో కులం మరియు అంటరానితనం యొక్క అణచివేత వ్యవస్థలు లేవని సుప్రీం కోర్టులో ప్రధాని స్వంత ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా ఉందని గమనించండి.
ఉదాహరణకు, మోడీ ప్రభుత్వం నవంబర్ 2022లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం ఇస్లాం మరియు క్రైస్తవ మతాలలో అంటరానితనం ఉనికిని తిరస్కరించింది
ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రతిస్పందిస్తూ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు
దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులను ఎస్సీ వర్గం నుంచి మినహాయించడం వివక్షతో కూడుకున్నదని, అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.
అయితే, "ఇస్లాం మరియు క్రిస్టియానిటీ వంటి మతాలలో "అంటరాని అణచివేత వ్యవస్థ" లేదనే కారణంతో దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను అంగీకరించలేమని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది
పస్మంద ముస్లింలు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారనే వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా, ప్రధాని మోడీ ఇప్పుడు వారికి ఎస్సీ హోదా పొడిగింపుకు అనుకూలంగా వాదనకు మద్దతు ఇచ్చారు.
అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయి
ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించిన దళితుల చేరిక కోసం తీవ్ర ఉద్యమం జరిగినా ఇప్పటి వరకు వారిని ఎస్సీ జాబితా లోకి చేర్చలేదు. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా, ఇస్లాం మరియు క్రైస్తవ మతాలలో సమానత్వo కలదనే వాదనతో దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించబడింది.
"అస్పృశ్యత వలన తీవ్ర సామాజిక, విద్యా మరియు ఆర్థిక వెనుకబాటు" చూపే వర్గాలకే SC రిజర్వేషన్లు ఇవ్వబడతాయని గుర్తుంచుకోండి.
ఏది ఏమైనప్పటికీ, ఇస్లాం మరియు క్రైస్తవ మతాలలో కులం మరియు అంటరానితనం ఉనికిని చూపించడానికి అనుభావిక ఆధారాలు మరియు ఫీల్డ్ వర్క్ ల యొక్క పెద్ద డేటా/సమాచారం అందుబాటులో ఉంది
ఎస్సీ జాబితాలో ఉన్న హిందూ దళితులు మరియు ఎస్సీ జాబితా లో చేర్చకుండా దూరంగా ఉంచబడిన దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవుల సామాజిక, విద్యా మరియు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు కలుస్తాయి.
2008లో, ప్రొఫెసర్ సతీష్ దేశ్‌పాండే మరియు గీతికా బాప్నా భారత ప్రభుత్వం యొక్క జాతీయ మైనారిటీల కమిషన్ కోసం "ముస్లిం మరియు క్రిస్టియన్ కమ్యూనిటీలలో దళితులు" అనే శీర్షికతో ఒక స్టేటస్ నివేదికను తయారు చేశారు మరియు " దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదాను అందించడానికి ఒక బలమైన ఆధారం ను రూపొందించారు.”
దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవుల సామాజిక, విద్యా మరియు ఆర్థిక వెనుకబాటుతనంపై ప్రామాణికమైన డేటాను అందిస్తూ, వారు దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులపై "అంటరానితనం" కొన్నిసార్లు ఆచరిస్తారు అని రాశారు.
అదేవిధంగా, 2007లో భారత ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సిఫారసు చేసింది.
అయితే, మోడీ ప్రభుత్వం దానిని అంగీకరించలేదు మరియు మిశ్రా వద్ద అనుభావిక డేటా empirical data లేనందున దానిపై ఆధారపడలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది.
బదులుగా, దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చవచ్చో లేదో పరిశీలించడానికి మోడీ ప్రభుత్వం 2022 లో కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ముగ్గురు సభ్యుల కమిషన్‌కు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి K. G. బాలకృష్ణన్ నేతృత్వం వహిస్తారు.
సుప్రీంకోర్టు ముందు హాజరైన మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన న్యాయమూర్తి K. G. బాలకృష్ణన్ కమిషన్‌ను ఉటంకిస్తూ, కొత్త కమిషన్ తన నివేదికను సమర్పించే వరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.అయితే, మిశ్రా కమిషన్ నివేదికను తిరస్కరించి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజకీయ ప్రేరేపితమని విమర్శకులు వాదిస్తున్నారు
శ్రీ మోదీ ప్రభుత్వం నిజాన్ని అంగీకరించే సమయం వచ్చింది. మెజారిటీ రాజ్యం చేతిలో పస్మాంద ముస్లింలు వ్యవస్థాగత వివక్షకు అత్యంత దారుణంగా బలైపోయారంటే ఎవరు కాదనగలరు? మతపరమైన అల్లర్ల సమయంలో, వారు అత్యంత బలహీనమైన వర్గాలుగా ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల చూసినట్లుగా మత సమీకరణ సమయంలో బిజెపి కార్యకర్తలుగా ఉన్న పస్మాండ ముస్లింలను కూడా విడిచిపెట్టలేదు.
ప్రధాని మోడీ పస్మాంద ముస్లింలకు భద్రత కల్పించలేరా? మోదీ తొమ్మిదేళ్ల పాలన కూడా పస్మాంద ముస్లింలకు ఉపశమనం కలిగించలేకపోయింది
మైనారిటీలకు మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్ మరియు ప్రైవేటీకరణతో సహా సాంఘిక
సంక్షేమ పథకాలను వెనక్కి తీసుకోవడం పస్మాంద ముస్లింలను ప్రతికూలంగా ప్రభావితం
చేసింది. సామాజిక న్యాయం కోసం ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన సమయం
ఆసన్నమైంది.
**రచయిత అబయకుమార్ Abhay Kumar చెందిన
జర్నలిస్ట్. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్
బోర్డ్‌లో పొలిటికల్ సైన్స్ బోధించాడు.)
జూలై 8, 2023, ముస్లిం మిర్రర్
No comments:
Post a Comment