10 July 2023

హుమాయూన్ సమాధి: మొఘల్‌ల వసతి గృహం Humayun’s Tomb: Dormitory of the Mughals

 

మొఘల్ చక్రవర్తి, హుమాయున్ పుస్తక ప్రియుడు.  హుమాయున్ ఫిబ్రవరి 1556లో తన లైబ్రరీ మెట్ల నుండి జారి పడిపోయాడు అప్పుడు హుమాయున్ చేతిలో పుస్తకాలు ఉన్నాయి.

భారత దేశంలోని అత్యుత్తమమైన మరియు బాగా సంరక్షించబడిన స్మారక కట్టడాలలో ఒకటైన హుమాయున్ సమాధి ఆగ్రాలోని తాజ్ మహల్‌కు నమూనాగా పరిగణించబడుతుంది. చక్రవర్తి షాజహాన్ చేత  తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1631-48లో ఏడు ఆధునిక అద్భుతాలలో ఒకటైన తెల్ల పాలరాయి తాజ్ నిర్మించబడింది.

 

హుమాయున్ సమాధిని 1562-72 సమయంలో హుమాయున్ భార్య హమీదా బాను బేగం నిర్మించారు. ఇది 1200 మీటర్ల ప్లాట్‌ఫారమ్‌పై ఉంది మరియు 47 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది భారతీయ వాస్తుశిల్పంపై పెర్షియన్ ప్రభావానికి తొలి ఉదాహరణ. హుమాయున్ సమాధి ఉన్న ఆవరణలో 100 కంటే ఎక్కువ ఇతర సమాధులను కలిగి ఉంది అందువలన  హుమాయున్ సమాధికి 'డార్మిటరీ ఆఫ్ ది మొఘల్స్' అని పేరు వచ్చింది

తోట ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రాతి ఫలకం stone plaque ప్రకారం, హుమాయున్ సమాధి భారీ పరిమాణంలో ఎర్ర ఇసుకరాయి మరియు తెల్లని పాలరాయి ఉపయోగించి నిర్మించబడినది. టెర్రేస్‌పై ఉన్న చిన్న పందిరిని మొదట మెరుస్తున్న నీలిరంగు టైల్స్‌తో కప్పారు మరియు తెల్లని పాలరాతి గోపురంపై ఉన్న ఇత్తడి ముగింపు finial 6 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

1508లో ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జన్మించిన హుమాయున్‌(అదృష్టం అని అర్ధం) అసలు పేరు మీర్జా నాసిర్-ఉద్-దిన్. 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ రాజవంశంలో రెండవ పాలకుడు హుమాయున్. 22 సంవత్సరాల వయస్సులో హుమాయున్ అనేక సమస్యలతో పోరాడాడు. షేర్ షా సూరి దాడులను ఎదుర్కొన్నాడు మరియు  సొంత సోదరుడు కమ్రాన్ తో  ఘర్షణ పడ్డాడు. హుమాయున్‌ 10 సంవత్సరాల అల్లకల్లోల పాలన తర్వాత అధికారాన్ని కోల్పోయాడు మరియు 48 సంవత్సరాల వయస్సులో చనిపోవటానికి ముందు కొంతకాలం అధికారం తిరిగి పొందాడు. హుమాయున్‌ మెట్ల మీద జారి క్రింద పడిపోయి మరణించిన లైబ్రరీ, పాత ఢిల్లీలోని పురానా ఖిలాలో ఉంది.

డిల్లి లోని నిజాముద్దీన్ ఈస్ట్‌లోగల హుమాయున్ సమాధి యొక్క అద్భుతమైన లక్షణం అందమైన ప్రకృతి దృశ్యం. నేటికి  బాగా అలంకరించబడిన మరియు నిర్వహించబడుతున్న ప్రవేశ ద్వారం నుండి ప్రధాన సమాధి (హుమాయున్ సమాధి)కి దారితీసే మంచి నడక మార్గం కలిగి  ఉంది.

హుమాయున్ సమాధి 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇది ప్రపంచంలోని మొట్టమొదటి తోట-సమాధులలో ఒకటిగా గుర్తించబడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమర్‌కండ్‌లోని గోర్-ఇ అమీర్ అనే వాస్తు శిల్పి  హుమాయున్ సమాధికి వాస్తు నమూనాను అందించాడు. స్థానిక పదార్థాలను విరివిగా ఉపయోగించడం మరియు గోపురం మరియు ఐవాన్ యొక్క కూర్పు దీని అద్భుతమైన లక్షణాలు. వాస్తుశిల్పులు పర్షియాలోని హెరాత్ నుండి వచ్చారు మరియు అందమైన తోట ఆకృతిలో మొత్తం నిర్మాణమునకు  సుమారు 8 సంవత్సరాలు పట్టింది.

హుమాయున్ భారతదేశానికి పర్షియన్ ప్రభావాన్ని తీసుకురావడంలో అపారమైన సహకారం అందించాడు. హుమాయున్ సఫావిడ్ కళను భారత దేశానికి  పరిచయం చేయడం జరిగింది  మరియు పర్షియన్ కళాకారులు మరియు చిత్రకారులను తీసుకురావడం వల్ల మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అభివృద్ధికి తోడ్పడ్డాడు. హుమాయున్ గొప్ప నిర్మాణ సృష్టి, ఢిల్లీలోని దిన్-పనా (మత ఆశ్రయం) కోటను షేర్ షా సూరి  నాశనం చేశాడు.

హుమాయున్ సమాధి పరిరక్షణ మరియు పునరుద్ధరణలో అగాఖాన్ ట్రస్ట్ పని చేసింది.హుమాయున్ సమాధి యొక్క పునరుద్ధరణ మరియు పరిరక్షణ ప్రాజెక్ట్ 2013 సెప్టెంబర్‌లో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ద్వారా పూర్తి చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టింది.

ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ AKTC హుమాయున్ సమాధి ప్రక్కనే ఉన్న నీలా గుంబాద్, ఇసా ఖాన్ తోట సమాధి, బు హలీమా తోట సమాధి, అరబ్ సెరాయ్ గేట్‌వేలు, సుందరవాలా మహల్ మరియు బుర్జ్, బటాషేవాలా గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, చౌసత్ ఖంభా మరియు హజ్రత్ నిజాముద్దీన్ బయోలి వంటి అనేక స్మారక చిహ్నాలను కూడా పునరుద్ధరించింది:.

No comments:

Post a Comment