30 July 2023

కర్బలా: చీకటి/అన్యాయం కి వ్యతిరేకంగా ఉద్యమం Karbala: A movement against darkness/injustice

 


దాదాపు పద్నాలుగు శతాబ్దాల క్రితం యూఫ్రేట్స్ నది ఒడ్డున ఉన్న కర్బలా (ఇరాక్) యుద్దభూమిలో, ఇమామ్ హుస్సేన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క ప్రియమైన మనవడు, తన అనుచరులతో కలిసి తన కాలంలోని అత్యంత శక్తివంతమైన నిరంకుశులలో ఒకరయిన యాజిద్ కు తలవంచడానికి నిరాకరించారు.

ఇమామ్ హుస్సేన్ నుండి బలవంతంగా విధేయత ప్రమాణం చేయిoచమని యాజిద్ అప్పటి మదీనా గవర్నర్‌ను ఆదేశించాడు. ఇమామ్ హుస్సేన్ యొక్క విధేయత యాజిద్ పాలనకు విశ్వసనీయతను ఇస్తుంది కాబట్టి విధేయత ప్రమాణం చేయిoచమని యాజిద్ కోరాడు. ఇమామ్ హుస్సేన్ మద్దతు తనకు అనేక విధాలుగా సహాయపడుతుందని యాజిద్‌కు తెలుసు. దానికి బదులుగా  ఇమామ్ హుస్సేన్‌కు ఐశ్వర్యం,అధికారం మరియు ప్రతిదీ అందించబడింది, కానీ ఇమామ్ హుస్సేన్‌ రాజీపడలేదు. కుటుంబం మరియు మహిళల భద్రత గురించి ఇమామ్ హుస్సేన్‌ బెదిరించబడ్డాడు కానీ ఇమామ్ హుస్సేన్ మోకరిల్లలేదు మరియు యాజిద్ యొక్క నిరంకుశ మరియు అణచివేత రాజ్యాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. ఇమామ్ హుస్సేన్‌ యజీద్ ను మరియు యజీద్ పాలనా వ్యవస్థను గుర్తించలేదు.

ఇమామ్ హుస్సేన్ పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ అపారమైనది. ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్-ఖట్టాబ్ ఇలా నివేదించారు: అల్లాహ్ యొక్క మెసెంజర్ హుస్సేన్ ఇబ్న్ అలీని తన భుజాలపైకి ఎత్తారు, ఒకసారి నేను దీనిని చూసి హుస్సేన్‌తో ఇలా వ్యాఖ్యానించాను, “ఓ బిడ్డా! మీరు ఎక్కిన వ్యక్తి గొప్ప వ్యక్తి!ప్రవక్త (స) ఇలా జవాబిచ్చారు, 'అవును,  నాపై స్వారీ చేసేవాడు గొప్పవాడు."

చెడుకు వ్యతిరేకంగా ఇమామ్ హుస్సేన్ చేసిన సాహసోపేతమైన పోరాటం గురించి మనం తరచుగా వింటాము మరియు దాదాపు ప్రతి ముస్లిం సమూహం ఇమామ్ హుస్సేన్ ని కర్బాలాలో చేసిన త్యాగం కోసం ప్రతి సంవత్సరం గుర్తుంచుకుంటుంది.

మక్కాలో కొద్దికాలం గడిపిన తర్వాత, ఇమామ్ హుస్సేన్ ధు అల్-హిజ్జా నెలలో మక్కాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇమామ్ హుస్సేన్ మక్కా నుండి ఇరాక్ వైపు బయలుదేరిన విషయం యాజిద్ బిన్ మువావియాకు తెలియగానే, యాజిద్ బిన్ మువావియా వెంటనే అప్పటి కుఫా నుమాన్ బిన్ బషీర్ గవర్నర్‌ను తొలగించి తన నమ్మకస్తుడు ఉబైద్ అల్లా ఇబ్న్ జియాద్‌ను గవర్నర్‌ గా నియమించాడు మరియు ఇమామ్ హుస్సేన్ ని చంపమనికి సంకేత పదాలలో వ్రాసాడు. యాజిద్ యొక్క లేఖను స్వీకరించిన తర్వాత, ఇబ్న్ జయాద్ కర్బలాలో ఇమామ్ హుస్సేన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు మరియు ఇమామ్ హుస్సేన్‌ పవిత్ర తలను డమాస్కస్‌లోని యాజిద్‌కు పంపాడు.

హిజ్రీ 61 మొహర్రం 10వ తేదీ ఆషూరా రోజున, ఇమామ్ హుస్సేన్ తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరినీ త్యాగం చేసిన తర్వాత, ఒంటరిగా యుద్ధరంగంలో నాలుగు వేలకు తక్కువ లేని యాజిద్ సైన్యానికి వ్యతిరేకంగా ఇమామ్ హుస్సేన్ ఒంటరిగా నిలిచాడు. ఇమామ్ హుస్సేన్ మానవాళికి అత్యంత విలువైన పాఠాన్ని నేర్పించాడు - 'అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం'. ‘యుద్ధం లో ప్రత్యర్ధి  ఎంత శక్తివంతుడైనా, నిరంకుశుడైనా, మనం ఒంటరిగా ఉన్నా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలని బోధించాడు.

ఇమామ్ హుస్సేన్ హత్యకు సంబంధించి ఇబ్న్ జియాద్ ఇలా అంటాడు.యాజిద్ నన్ను బెదిరించాడు మరియు ఇమామ్ హుస్సేన్‌ను చంపడానికి లేదా బదులుగా నన్ను చంపడానికి ఎంపికలు ఇచ్చాడు. నేను ఇమామ్ హుస్సేన్‌ని చంపాలని నిర్ణయించుకున్నాను. ఇమామ్ హుస్సేన్ ఇస్లాం పునాదులకు వ్యతిరేకంగా మరియు ఖిలాఫత్ ఇ రషీదా (పవిత్రమైన కాలిఫేట్) వ్యవస్థకు విరుద్ధమైన అన్యాయమైన వ్యవస్థను స్థాపించడానికి అనుమతించరని తెలుసు కాబట్టి యాజిద్, ఇమామ్ హుస్సేన్‌ను చంపడానికి మొండిగా ఉన్నాడు. ఇమామ్ హుస్సేన్ ప్రారంభించిన ఉద్యమాన్ని విరమించాలన్నారు.

ఇమామ్ హుస్సేన్ ప్రారంభించిన ఉద్యమం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా లేదా క్రూరమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు. అవినీతి, బంధుప్రీతి, వివక్ష మరియు అసభ్యతను ప్రోత్సహించే భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. యాజిద్ పాలన అనేది దౌర్జన్యం, అన్యాయం, అణచివేత మరియు అసత్యం ఆధారంగా ఇస్లాం ధర్మబద్ధమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినది. 

డమాస్కస్‌లో - ఇమామ్ హుస్సేన్ యొక్క పవిత్ర తలని యాజిద్ ముందు సమర్పించారు.

ఇమామ్ హుస్సేన్ యాజిద్ నిరంకుశ పాలన కు లొంగక ఇస్లాం మరియు అన్యాయం, ఇస్లాం మరియు అణచివేత లేదా ఇస్లాం మరియు నిరంకుశత్వం కలిసి ఉండలేవని ప్రపంచానికి స్వచ్ఛమైన సందేశాన్ని బోధించినారు.  

కర్బలా అనేది మొత్తం మానవాళికి మరియు ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన సంస్థ. పద్నాలుగు శతాబ్దాల క్రితం కర్బలా ఎడారిలో ఉన్న ఇమామ్ హుస్సేన్ పిలుపుకు ఇప్పుడు కూడా ప్రపంచంలోని నలుమూలల నుండి లక్షలాది మంది ప్రతిస్పందిస్తున్నారు.

కర్బలా సంఘటన తర్వాత అహ్లుల్‌బైత్ యొక్క కారవాన్‌ను డమాస్కస్‌లోని కోర్టుకు తీసుకువచ్చినప్పుడు, సయ్యదా జైనాబ్ బందీగా ఉన్నప్పటికీ ఇమామ్ హుస్సేన్ ప్రతినిధిగా మరియు మద్దతుదారుగా నిరంకుశ యాజిద్ పై అరిచారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ధైర్య మనవరాలు తన సోదరుడిలాగే అణచివేత పాలనను అంగీకరించలేదు. సయ్యదా జైనాబ్ తన సోదరుడు ఇమామ్ హుస్సేన్‌ను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇమామ్ హుస్సేన్ ప్రారంభించిన ఉద్యమం కర్బలా ఎడారిలో ఓడిపోయి ఉండవచ్చు; సయ్యదా జైనాబ్ తనతో పాటు ఈ వారసత్వాన్ని తీసుకొని ప్రతి తరo లో  విప్లవ బీజాలు నాటారు.

ఇమామ్ హుస్సేన్ లేదా సయ్యదా జైనాబ్ మరియు కర్బలాలోని ఇతర అమరవీరులకు నిజమైన నివాళి చెడు పై ధర్మాన్ని, అసత్యం పై సత్యo, అజ్ఞానం పై జ్ఞానాన్ని గెలిపించడానికి ప్రయత్నించాలి.  జాత్యహంకారం, మతవిద్వేషం మరియు మరే ఇతర వివక్షలో పాల్గొనకూడదని మనం ప్రతిజ్ఞ చేయాలి. నిరంకుశ అణచివేత పాలనకు వ్యతిరేకంగా అణచివేతకు గురైన వారితో నిలబడటం ఒక నిబద్ధత.

అవినీతి , నిజాయితీ లేనితనం, అబద్ధాన్ని బుజ్జగించడం, అజ్ఞానం, మతతత్వం మరియు కులతత్వం స్థానం లో ఇస్లాం యొక్క కాంతితో ప్రపంచాన్ని జ్ఞానోదయం చేయడం చాలా ముఖ్యం. ఈ గొప్ప సందేశాన్ని రాబోయే తరాలకు వినిపించడానికి ఇమామ్ హుస్సేన్ తన వద్ద ఉన్నదంతా త్యాగం చేశాడు. కర్బలా యొక్క గొప్ప సందేశం ను ప్రపంచం నలుమూలలకు విస్తరించడo ఇప్పుడు మన బాధ్యత.

No comments:

Post a Comment