22 July 2023

మలేషియా అత్యునత సివిలియన్ అవార్డు హిజ్రా అవార్డు పొందిన భారతదేశ గ్రాండ్ ముఫ్తీ, షేక్ అబూబకర్ అహ్మద్‌

 

.

భారతదేశ గ్రాండ్ ముఫ్తీ, షేక్ అబూబకర్ అహ్మద్, మలేషియా యొక్క అత్యున్నత పౌర గౌరవమైన హిజ్రా అవార్డును పొందినందుకు అనేకమంది భారతీయ పండితులు అభినందించారు. మితవాద ఇస్లాం యొక్క ప్రతిపాదకులకు గౌరవ అవార్డు  ఇవ్వడంపై మలేషియా ప్రభుత్వ చర్యను  పలువురు భారతీయులు కూడా స్వాగతించారు.

కౌలాలంపూర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగిన ఉత్సవంలో భారత దేశ  గ్రాండ్ ముఫ్తీ, షేక్ అబూబకర్ అహ్మద్కు హిజ్రా అవార్డు ను  మలేషియా రాజు అల్-సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా అవార్డును అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, మత వ్యవహారాల మంత్రి డాక్టర్ ముహమ్మద్ నహీమ్ బిన్ ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు.

షేక్ అబూబకర్ ఇస్లామిక్ విజ్ఞానం, సామాజిక అభివృద్ధి మరియు శాంతి స్థాపన రంగంలో చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మక హిజ్రా  అంతర్జాతీయ అవార్డుతో సత్కరించారు. భారతదేశంలోని వివిధ వర్గాల మధ్య షేక్ అబూబకర్ మరియు అబూబకర్ సంస్థలు ప్రారంభించిన విద్యా కార్యకలాపాలను హిజ్రా అవార్డు కమిటీ గుర్తించింది.

గత సంవత్సరం, ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సాకు హిజ్రా అవార్డు లభించింది

అవార్డు అందుకున్న తర్వాత, షేక్ అబూబకర్ అహ్మద్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ సమాజానికి మరియు మానవాళికి వారు చేసిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు అని పేర్కొన్నారు.

షేక్అబూబకర్అహ్మద్కుమారుడు డాక్టర్అబ్దుల్హకీమ్మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, అణగారిన, వెనుకబడిన వర్గాల కోసం పండితుడిగా చేసిన సేవలకుగాను అవార్డుకు షేక్అబూబకర్అహ్మద్అర్హుడని అన్నారు.

“ప్రపంచంలోని అనేక దేశాలలో భారతదేశ బహుళ-సాంస్కృతిక వైవిధ్యం మరియు ఏకత్వానికి షేక్ ఎల్లప్పుడూ ప్రాతినిధ్యం వహిస్తున్నందున అవార్డు భారతదేశానికి ఒక గౌరవం" అని డాక్టర్అబ్దుల్హకీమ్తెలిపారు

షేక్ అబూబకర్ అహ్మద్ ఒక నగరంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత, ఆతిథ్యం మరియు ఆధ్యాత్మికత కోసం బహుళ-విభాగాల సంస్థను విజయవంతంగా స్థాపించారు.

షేక్ అబూబకర్ కేరళలో అనాధ శరణాలయంతో సహా మతపరమైన మరియు ఆధునిక విద్యా సంస్థల చైన్  నడుపుతున్నారు. షేక్ అబూబకర్ విద్యా రంగానికి చేసిన సేవలకు గాను అనేక గౌరవాలకు అర్హుడు. కేరళలో కొన్ని వందల ఎకరాల్లో నాలెడ్జ్ సిటీని నెలకొల్పడం ద్వారా షేక్ అబూబకర్ విశేషమైన పని చేశారు. విద్యారంగంలో తమవంతు సహకారం అందించాలనుకునే వారికి అబూబకర్ ఒక ఉదాహరణ.

ఇస్లామిక్ విజ్ఞానం, సామాజిక అభివృద్ధి మరియు శాంతి స్థాపనకు షేక్ అబూబకర్ విశేష కృషి చేసారు

గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ ఇస్లామిక్ జ్ఞానాన్ని ప్రోత్సహించడంలో మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో అంకితభావం చూపారు.

షేక్ అబూబకర్ అహ్మద్ అన్ని వర్గాల ప్రజలచే విస్తృతంగా గౌరవించబడతాడు. సర్వమత సంభాషణలో షేక్ అబూబకర్ అహ్మద్ సహకారం చెప్పుకోదగినది.

 

 

No comments:

Post a Comment