31 August 2023

భారతదేశానికి చెందిన ఫ్లయింగ్ ఏస్ ఇంద్ర లాల్ రాయ్ WWI సమయంలో బ్రిటన్ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు Indra Lal Roy, Flying Ace of India, sacrificed his life for Britain during WWI

 



భారతదేశం నుండి ఫ్లయింగ్ ఏస్ బిరుదు పొందిన మొదటి పైలట్ ఇంద్ర లాల్ రాయ్. అప్పుడు భారతదేశం స్వతంత్ర దేశం కానందున, రక్షణ సేవల సిబ్బంది అందరూ బ్రిటన్‌కు సేవలందించారు. రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్ మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో పనిచేస్తున్నప్పుడు, ఇంద్ర లాల్ రాయ్ తొమ్మిది వైమానిక విజయాలు సాధించాడు.

పీరా లాల్ రాయ్ మరియు లోలితా రాయ్‌ల రెండవ కొడుకుగా కోల్‌కతా (అప్పటి కలకతా)లో జన్మించిన ఇంద్ర లాల్ రాయ్  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, లండన్‌లో చదువుతున్నాడు. 4 ఏప్రిల్ 1917 న ఇంద్ర లాల్ రాయ్ రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్‌ లో చేరాడు మరియు జూలైలో రెండవ లెఫ్టినెంట్ హోదాతో నియమించబడ్డాడు.

ఫైటర్ పైలట్‌గా ఇంద్ర లాల్ రాయ్ 1918 జూలై నెలలో పదమూడు రోజుల వ్యవధిలో, తొమ్మిది జర్మన్ విమానాలను కాల్చి నాశనం చేశాడు మరియు భారతదేశం నుండి హీరోగా కీర్తించబడ్డాడు. కానీ ఇంద్ర లాల్ రాయ్ కెరీర్ అకస్మాత్తుగా విషాదంతో ముగిసింది.

జూలై1918 లో  మొదటి ప్రపంచ యుద్ధం పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాల సమూహం కు జర్మనీకి చెందిన జగ్ద్‌స్టాఫెల్ 29కి చెందిన శత్రు విమానాలతో ఘోరమైన వైమానిక పోరాటం ఫ్రాన్స్‌లోని కార్విన్ పట్టణం ఆకాశంలో జరిగింది.

జర్మన్ వైమానిక దళానికి చెందిన ఫోకర్ D.VII విమానం బ్రిటీష్ విమానాలపై  కాల్పులు జరిపింది.. జర్మన్ పైలట్ల భారీ కాల్పుల పలితంగా  RAF బ్రిటీష్ విమానం ఒకటి ఖాళీగా ఉన్న వ్యవసాయ భూమిపై కూలిపోయింది. RAF బ్రిటీష్ విమానం పైలెట్ ఇంద్ర లాల్ రాయ్ స్వయంగా బుల్లెట్లకు గురయ్యాడు మరియు మరణించాడు.

కొన్ని రోజుల క్రితం రాయల్ ఎయిర్ ఫోర్స్ చేత ఫ్లయింగ్ ఏస్ బిరుదుతో సత్కరించబడిన భారతదేశపు ధైర్యవంతులైన పైలట్లలో ఒకరయిన పైలెట్ ఇంద్ర లాల్ రాయ్ జీవితం ముగిసింది. తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం ఇంద్ర లాల్ రాయ్ ని మరణానంతరం విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ (DFC)తో సత్కరించింది.ఇంద్ర లాల్ రాయ్ 19 సంవత్సరాల వయస్సులో మరణించాడు,

వైమానిక దళం జారీ చేసిన ఒక ఉల్లేఖన Citation ఇంద్ర లాల్ రాయ్ గురించి  ఇలా పేర్కొంది: పదమూడు రోజులలో తొమ్మిది శత్రు విమానాలను నాశనం చేసిన ఇంద్ర లాల్ రాయ్ చాలా తెలివైన మరియు దృఢమైన అధికారి. శత్రు విమానాలను నాశనం చేయడంలో ఇంద్ర లాల్ రాయ్ అద్భుతమైన నైపుణ్యం మరియు ధైర్యాన్ని ప్రదర్శించాడు

డిసెంబర్ 1998లో, ఇంద్ర లాల్ రాయ్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతీయ తపాలా శాఖ ఇంద్ర లాల్ రాయ్ గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది. ఇంద్ర లాల్ రాయ్ నేటికీ భారతీయ ఫ్లయింగ్ ఏస్ ఫైటర్ పైలట్‌గా మిగిలిపోయాడు.

షేక్ నిజాముద్దీన్ ఔలియా Sheikh Nizamuddin Auliya

 



షేక్ నిజాముద్దీన్ ఔలియా తన కాలంలో బహుళ ప్రజాదరణ పొందిన సూఫీ సెయింట్ మరియు షేక్ నిజాముద్దీన్ ఔలియా కు  ఢిల్లీలోను,ఉత్తర భారత దేశం లోను  అనేక వేల మంది శిష్యులు ఉన్నారు అయినప్పటికీ షేక్ నిజాముద్దీన్ ఔలియా కు కొంతమంది విరోధులు కూడా కలరు. 

 1324 లో ఘియాసుద్దీన్ తుగ్లక్‌ పరిపాలనా కాలం లో నాటి ఉలేమాలు, సనాతన మత గురువులు, షేక్ నిజాముద్దీన్ ఔలియా పట్ల అనుకూలంగా లేరు. తన ఇంట్లో షేక్ నిజాముద్దీన్ ఔలియా సూఫీ సంగీత ప్రదర్శనలను musical soirees నిర్వహించేవాడు. ఇది నాటి ఉలేమాలు, సనాతన మత గురువులకు నచ్చలేదు.  

షేక్ నిజాముద్దీన్ ఔలియా అలవాటు వివాదాస్పదంగా మారింది. షేక్ నిజాముద్దీన్ ఔలియా నిర్వహించే సూఫీ సంగీత ప్రదర్సనల అభ్యాసం చట్టవిరుద్ధమని ఉలేమాలు పేర్కొన్నారు మరియు వారు దీనిపై రాజ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు.

షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారు కు హాజరు కావాలని చట్టం కోరింది. షేక్ నిజాముద్దీన్ ఔలియా దానిని పాటించాడు.. ( యాదృచ్ఛికంగా, షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారును సందర్శించటం  మొదటిసారి  మరియు ఏకైక సారి.) షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారు లోకి ప్రవేశించిన వెంటనే, ఉలేమా షేక్ నిజాముద్దీన్ ఔలియా పై మందలింపుల వర్షం కురిపించారు 

షేక్ నిజాముద్దీన్ ఔలియా తనపై మోపబడిన అన్ని ఆరోపణలను ప్రశాంతంగా విన్నారు మరియు మాట్లాడే సమయం వచ్చినప్పుడు, తన వాదనకు రక్షణగా కొన్ని హదీసులను మర్యాదపూర్వకంగా ఉటంకించారు.

అయితే దీనికి ఉలేమాలు సంతోషించలేదు. షేక్ నిజాముద్దీన్ ఔలియా పేర్కొన్న నిర్దిష్ట హదీసులు షాఫి లకు మాత్రమే విధిగా ఉన్నాయని వారు షేక్‌ నిజాముద్దీన్ ఔలియా కు స్పష్టంగా చెప్పారు; హనాఫీలకు వర్తించవని పేర్కొన్నారు..

ఒక ప్రత్యేక ఖాజీ నేరుగా షేక్‌ నిజాముద్దీన్ ఔలియా ను బెదిరించాడు, నిజాముద్దీన్ ఔలియా తన మార్గాన్ని మార్చుకోమని లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరించినందుకు శిక్షకు  సిద్ధం కావాలని చెప్పాడు. షేక్ నిజాముద్దీన్ ఔలియా మాత్రం తనకు నచ్చినది చేయగలనని స్పష్టంగా చెప్పారు..

స్వంతంగా మంచి ఆధ్యాత్మికవేత్త అయిన షేక్ బహావుద్దీన్ జకారియా మనవడు మౌలానా అలాముద్దీన్, షేక్ నిజాముద్దీన్ ఔలియాకు అనుకూలంగా ఉద్వేగభరితమైన వాదన చేసాడు. మౌలానా అలాముద్దీన్ స్థానిక మతాధికారుల నుండి ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండానే పశ్చిమాసియాలోని అనేక నగరాలలో  తానూ స్వయంగా సూఫి మ్యూజిక్ సెషన్స్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నాడు..దీనితో ఉలేమాలు మౌనం వహించారు మరియు నిజాముద్దీన్ ఔలియా తన సూఫీ స్థావరం కు తిరిగి రావడానికి అనుమతించబడ్డాడు.

షేక్ నిజాముద్దీన్ ఔలియా అమీర్ ఖుస్రూ మరియు జియావుద్దీన్ బరానీ (వీరిద్దరూ సుల్తానేట్ కాలం నాటి చరిత్రకారులు) ముందు తన నిరాశను బయటపెట్టారు. ఢిల్లీ నగరంలో, ఇస్లాం ప్రవక్త యొక్క హదీసులపట్ల  తగిన గౌరవం చూపబడటం లేదని షేక్ నిజాముద్దీన్ ఔలియా విలపించారు.అటువంటి నగరం ఎక్కువ కాలం వర్ధిల్లలేదు మరియు నగరం యొక్క వినాశనానికి ఉలేమాలు పూర్తిగా బాధ్యత వహిస్తారు.అని షేక్ నిజాముద్దీన్ ఔలియా అన్నారు.

షేక్ నిజాముద్దీన్ ఔలియాను బెదిరించిన ఖాజీ రెండు వారాల తర్వాత హఠాత్తుగా మరణించాడు. షేక్ నిజాముద్దీన్ ఔలియా కు జరిగిన అవమానం లో ఉలేమాలతో చేతులు కలిపిన సుల్తాన్ కొన్ని నెలల తర్వాత హింసాత్మక ముగింపును ఎదుర్కొన్నాడు.

1328లో మొత్తం డిల్లి లో ఉన్న ఉలేమాలను  ఆనాటి డిల్లి సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ నూతన రాజధాని దౌలతాబాద్‌కు రమ్మన్నాడు. వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి తిరిగి రాలేదు: కొంతమంది మార్గమధ్యంలో మరణించారు, ఇంకా చాలా మంది దౌలతాబాద్ చేరుకున్న తర్వాత మరణించారు.

ఢిల్లీ నగరం కూడా తన వైభవాన్ని,ప్రకాశాన్ని కోల్పోయింది: సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు డిల్లీ ఒక దెయ్యం పట్టణం (ghostGhost City) గా మారింది, మరియు తరువాత జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, డిల్లి నగరం దాని పూర్వ వైభవానికి తిరిగి రాలేదు.

27 August 2023

ఇస్లాంను రక్షించడానికి ఉలేమా బ్రిటిష్ వారి ముందు ధైర్యసాహసాలు ప్రదర్శించారు Ulema put up a brave front before the British to defend Islam

 



ఉలేమా లేదా ముస్లిం మత పండితులలు ఆధునిక భారత దేశ  చరిత్రలో, కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ పూర్వ భారతదేశంలో, చాలా మంది ప్రముఖ ఉలేమాలు సుల్తానులు లేదా మొఘలుల ఆస్థానాలకు అనుబంధంగా ఉండేవారు. ఉలేమాల నేతృత్వంలోని సెమినరీలు లేదా మదర్సాలు న్యాయనిపుణులు మరియు బ్యూరోక్రాట్‌లను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా పనిచేశాయి.

మొఘలుల పాలనలో, ఫతావా-ఇ-ఆలమ్‌గిరిని సంకలనం చేయడంలో ముఖ్య వ్యక్తి అయిన కుతుబుద్ దిన్ వారసులు, లక్నోలో ఫరంగి మహల్ ఉలేమాను స్థాపించారు. ఫరంగి మహల్ తొలి సెమినరీగా పరిగణించబడుతుంది.బ్రిటీష్ వారు స్థాపించిన కలకత్తా మదరసా యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఫరంగి మహల్ నుండి పట్టభద్రుడయ్యాడు.

ఫరంగి మహల్‌కు భారతదేశంలోని అన్ని సెమినరీలకు మతపరమైన విద్య కోసం అవసరమైన కరిక్యులం దార్స్-ఇ-నిజామిని వ్యవస్థీకరించడం. చేసింది.  దార్స్-ఇ-నిజామి ప్రకారం నేటికీ మదరసాలలో సిలబస్‌ బోధన కొనసాగుతోంది

ఫరంగి మహల్‌కు వ్యతిరేకంగా వచ్చిన షా వలియుల్లా దేహెల్వి ఉద్యమం మతపరమైన విద్య యొక్క కేంద్రాన్ని లక్నో నుండి ఢిల్లీకి మార్చింది.

షా వలీవుల్లా వారసులు చట్టపరమైన కోడ్‌లను అధ్యయనం చేశారు మరియు ముసాయిదా ఫత్వాలను రూపొందించారు. షరియాను అన్వయించడంలో హదీసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంతో పాటు, షా వలీవుల్లా గత చట్టాలకు (తఖ్లీద్) గుడ్డిగా కట్టుబడి ఉండకూడదని హెచ్చరించాడు. ఖురాన్ లేదా సున్నత్ నుండి న్యాయపరమైన మార్గదర్శకత్వం తీసుకోవాలని షా వలీవుల్లా సలహా ఇచ్చారు.

1857 తిరుగుబాటు తరువాత  మొఘల్ పాలన అంతరించినప్పుడు షా వలీవుల్లా మరియు అతని వారసుల అయిన ఉలేమాలను బ్రిటిష్ వారు అరెస్టు చేసి శిక్షించారు. షా అబ్దుల్ అజీజ్ (వలీవుల్లా కుమారుడు) బోధించే చోట ఒక్క కుచా చలాన్‌లోనే బ్రిటిష్ సైనికులు పద్నాలుగు వందల మందిని కాల్చిచంపారు.

తరువాతి కాలం లో సంస్కరణవాది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేత అలీఘర్‌లో మహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్ (తరువాత AMU) స్థాపించబడింది మరియు ఈ సంస్థ ముస్లింలను ఉలేమా ప్రభావం స్వతంత్రంగా తయారు చేసేందుకు ప్రయత్నించింది.. ఇది సంప్రదాయవాదులు మరియు ఆధునికవాదుల మధ్య ఘర్షణకు దారితీసింది

బ్రిటీష్ రాజ్ నుండి అడ్డంకులు ఉన్నప్పటికీ, ఉలేమాలు ఇస్లాం మరియు ఇస్లామిక్ సమాజం పై ప్రచురణలు మరియు మతపరమైన సమస్యలపై బహిరంగ చర్చల ద్వారా నిలబెట్టకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఉలేమాల మేధో శక్తి ప్రింట్ టెక్నాలజీ ఆవిష్కరణతో గరిష్ట స్థాయికి చేరుకుంది. అరబిక్‌కు బదులుగా ఉర్దూ వంటి స్థానిక భాషలలో మతసాహిత్యాన్ని ప్రచురించడం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉలేమాలు అనుసరించిన సమర్థవంతమైన వ్యూహాలలో ఒకటి

తరువాత ఉలేమాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరింత పూర్తి శక్తితో స్వాతంత్ర్య పోరాటం కొనసాగించారు. ఉలేమాలలో చాలా మంది స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారు

ఉలేమాలు ప్రసిద్ధ ఖిలాఫత్ ఉద్యమంలో మహాత్మా గాంధీని తమ మార్గదర్శిగా చేసారు మరియు ఉలేమాలలో చాలా మంది రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించారు కాంగ్రెస్‌పై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచారు.

నాడు బ్రిటీష్‌తో ధైర్యంగా పోరాడిన  ఉలేమాలు ఇప్పుడు సంస్కరణల యొక్క కొత్త తరంగానికి వినమ్రంగా లొంగిపోతున్నారు. ఇది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది.

భారతదేశపు అణగారిన వ్యక్తులకు స్వరం అందించిన B P మండల్ B P Mandal who gave voice to the India’s Marginalised persons

 



BPB. P. మండల్, మండల్ కమిషన్‌కు అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందినాడు.మండల్ కమీషన్ అణగారిన వర్గాల అభ్యున్నతికి కొత్త మార్గాలను తెరిచింది మరియు గొంతులేని వారి గొంతును అందించింది. మండల్ కమిషన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) కోసం 27% రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. మండల్ కమిషన్ నివేదిక భారతదేశంలో కుల, తరగతి మరియు సామాజిక న్యాయంపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది మరియు దేశ రాజకీయ మరియు సామాజిక దృశ్యాన్ని మార్చింది

BPమండల్ 1918 ఆగస్టు 25న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారతదేశంలోని ఓబీసీలలో ఒకటిగా పరిగణించబడే బీహార్‌లోని మాధేపురాకు చెందిన యాదవ్ కుటుంబంలో జన్మించారు. BPBPమండల్ తండ్రి రాస్ బిహారీ మండల్ దాత philanthropist. రాస్ బిహారీ మండల్ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు. బ్యాంగ్-భాంగ్ ఉద్యమం సమయంలో రాస్ బిహారీ మండల్ భారత్ మాతా కా సందేశ్ అనే పుస్తకాన్ని రాశారు.

BPBP మండల్ పాట్నా విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించారు. సమాజంలోని అణగారిన మరియు దోపిడీకి గురైన వర్గాల సాధికారత కోసం వాదించిన రామ్ మనోహర్ లోహియా మరియు జయప్రకాష్ నారాయణ్‌ల సోషలిస్ట్ ఆలోచనల ద్వారా ప్రభావితమయ్యాడు

.BPమండల్ తన రాజకీయ జీవితాన్ని 1941లో ప్రారంభించాడు, BPమండల్ 23 సంవత్సరాల వయస్సులో భాగల్పూర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అయ్యాడు. BPమండల్ భారత జాతీయ కాంగ్రెస్‌ తరుపున 1952లో మొదటి సాధారణ ఎన్నికలలో మాధేపురా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి, సోషలిస్టు పార్టీకి చెందిన  భూపేంద్ర నారాయణ్ మండల్‌ను ఓడించాడు..

బీహార్‌లో వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న కుల ఆధారిత వివక్ష మరియు దౌర్జన్యాలకు (ముఖ్యంగా 1954లో పామా సంఘటన సమయంలో) వ్యతిరేకంగా BPమండల్ తన స్వరాన్ని వినిపించాడు

BPమండల్ ప్రభుత్వం భూసంస్కరణలు చేపట్టాలని, భూమిలేని రైతులకు భూపంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. BPమండల్ 1967లో కాంగ్రెస్‌ను వీడి లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ (SSP)లో చేరారు. BPమండల్ SSP అధ్యక్షుడయ్యాడు మరియు మాధేపురా నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాడు. మహామాయ ప్రసాద్ సిన్హా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌లో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, BPమండల్ సైద్ధాంతిక విభేదాలతో లోహియాతో విడిపోయారు మరియు మార్చి 1968లో శోషిత్ దళ్ అనే పేరుతో స్వంత పార్టీని స్థాపించారు. ఇతర పార్టీల మద్దతుతో BPమండల్ ఫిబ్రవరి 1, 1968న బీహార్‌కి ఏడవ ముఖ్యమంత్రి మొదటి అట్టడుగు కులాల ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రాజకీయ అస్థిరత కారణంగా కేవలం 30 రోజుల తర్వాత రాజీనామా చేశాడు..

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీల విలీనంతో ఏర్పడిన జనతా పార్టీ సభ్యుడిగా BPమండల్ 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు . డిసెంబరు 1978లో ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ చేత రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఛైర్మన్‌గా BPమండల్ నియమించబడ్డారు. భారతదేశంలోని సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించి, వారి అభ్యున్నతి కోసం చర్యలను సూచించడానికి ఈ కమిషన్ ఆదేశించబడింది. కమిషన్ వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి 11 సామాజిక, ఆర్థిక మరియు విద్యా సూచికలను ఉపయోగించింది మరియు దేశవ్యాప్తంగా విస్తృతమైన సర్వేలు మరియు అధ్యయనాలను నిర్వహించింది. మండల్  కమిషన్ తన నివేదికను డిసెంబర్ 1980లో సమర్పించింది,

 మండల్  కమిషన్ భారతదేశ జనాభాలో 52% మంది OBCలు ఉన్నారని మరియు జీవితంలోని వివిధ రంగాలలో తీవ్రమైన లేమి మరియు వివక్షను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) కోసం ప్రస్తుతం ఉన్న 22.5% రిజర్వేషన్లకు అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో OBCలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని మండల్  కమిషన్ సిఫార్సు చేసింది, తద్వారా మొత్తం రిజర్వేషన్ కోటా 49.5%. అయ్యింది. విద్యాసంస్థలు, చట్టసభలు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో కూడా ఇదే తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని మండల్  కమిషన్ సూచించింది.

ముస్లింలలోని కొంతమంది OBCలు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నారని మండల్ కమిషన్ గుర్తించి, వారిని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. మండల్ కమిషన్ నివేదిక భారతదేశంలో కులం, తరగతి మరియు సామాజిక న్యాయంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక మైలురాయి పత్రం. ఏది ఏమైనప్పటికీ, వామపక్ష మరియు మితవాద పార్టీల మద్దతు ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా V. P. సింగ్ ఆగష్టు 7, 1990న దీని అమలును ప్రకటించే వరకు వరుసగా వచ్చిన ప్రభుత్వాలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు.

ప్రధానమంత్రి V. P. సింగ్ నిర్ణయం ఉన్నత కులాల విద్యార్థులు మరియు రిజర్వేషన్ వ్యతిరేక సమూహాలచే భారీ నిరసనలు మరియు ఆందోళనలను ప్రేరేపించింది, వారు మండల్ కమిషన్ నివేదికను  తమ అధికారాలకు ముప్పుగా భావించారు. మండల్ కమిషన్ రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది విద్యార్థులు ఆత్మాహుతి లేదా హింసకు పాల్పడ్డారు

మండల్ కమీషన్ నివేదిక  పట్ల అగ్రవర్ణాల ప్రతిస్పందన చాలా వరకు ప్రతికూలంగా ఉంది. అనేక అగ్రవర్ణ సమూహాలు రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించాయి మరియు అది తమ హక్కులకు ముప్పుగా భావించాయి. వారు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో పెద్దఎత్తున నిరసనలు మరియు ఆందోళనలు నిర్వహించారు. వారిలో కొందరు తమ అసమ్మతిని వ్యక్తం చేసేందుకు ఆత్మాహుతి లేదా హింసకు పాల్పడ్డారు

సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకుని, మండల్ కమీషన్ నివేదిక  రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ ఇంద్ర సాహ్ని మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే వరకు మండల్ కమీషన్ నివేదిక  అమలుపై స్టే విధించింది. ఇంద్ర సాహ్ని ఒక న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త, మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ భారత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నివేదికను అమలు చేయడాన్ని వ్యతిరేకించిన అనేక మందిలో ఇంద్ర సాహ్ని ప్రధాన పిటిషనర్.

రిజర్వేషన్ విధానం రాజ్యాంగం కల్పించిన అవకాశాల సమానత్వ హామీని ఉల్లంఘించిందని, వెనుకబాటుతనానికి కులం నమ్మదగిన సూచిక కాదని, ప్రభుత్వ సంస్థల సామర్థ్యం ప్రమాదంలో పడుతుందని ఇంద్ర సాహ్ని వాదించారు. ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే కేసును సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ విచారించింది, ఇది 1992లో తన మైలురాయి తీర్పును వెలువరించింది. కోర్టు OBCలకు రిజర్వేషన్ యొక్క చెల్లుబాటును సమర్థించింది కానీ కొన్ని షరతులు విధించింది-రిజర్వేషన్ల ప్రయోజనం నుండి "క్రీమీ లేయర్" లేదా OBCలలోని సంపన్న వర్గాలను మినహాయించడం, మొత్తం రిజర్వేషన్‌పై 50% సీలింగ్‌ని సెట్ చేయడం మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ను మినహాయించడం వంటి పరిమితులు.

భారతదేశంలోని కులం, తరగతి మరియు సామాజిక న్యాయం యొక్క సంక్లిష్టమైన మరియు వివాదాస్పద సమస్యలను తెరపైకి తెచ్చినందుకు మండల్ కమిషన్ కేసులో ఇంద్ర సాహ్ని పాత్ర ముఖ్యమైనది. మండల్ కమీషన్ పట్ల ఉన్నత కులాల స్పందన భారతదేశంలోని వెనుకబడిన తరగతులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన సామాజిక న్యాయ ఉద్యమం పట్ల వారి ఆగ్రహం మరియు ప్రతిఘటనను ప్రతిబింబిస్తుంది.

నవంబర్ 1992లో, సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ కొన్ని మార్పులతో మండల్ కమిషన్ నివేదికను సమర్థిస్తూ తన తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుమతించబడతాయని కోర్టు తీర్పునిచ్చింది, ఇది ఏ వెనుకబడిన తరగతి పౌరులకైనా రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాని(state)కి అధికారం ఇస్తుంది. వెనుకబడిన తరగతుల జాబితాను, రిజర్వేషన్ ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షించి సవరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సామాజిక న్యాయం సాధించాలంటే రిజర్వేషన్ ఒక్కటే సాధనం కాదని, వెనుకబడిన తరగతుల వారికి స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, కోచింగ్‌లు వంటి ఇతర చర్యలు అందించాలని కోర్టు సూచించింది.

OBCలలో 'క్రీమీ లేయర్' అనేది ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన సంపన్నులు మరియు బాగా చదువుకున్న సభ్యులను సూచించే పదం, వీరు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో OBCలకు 27% రిజర్వేషన్ కోటా ప్రయోజనాల నుండి మినహాయించబడ్డారు.

'క్రీమీ లేయర్' భావనను 1971లో సత్తనాథన్ కమిషన్ ప్రవేశపెట్టింది మరియు 1992లో ఇంద్ర సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. 'క్రీమీ లేయర్'ని నిర్ణయించే ప్రమాణాలు ఆదాయం, ర్యాంక్ మరియు హోదాపై ఆధారపడి ఉంటాయి.

OBC అభ్యర్థుల తల్లిదండ్రులు. క్రీమీ లేయర్కోసం ప్రస్తుత ఆదాయ పరిమితి రూ. సంవత్సరానికి 8 లక్షలు, ఇది చివరిసారిగా 2017లో సవరించబడింది. అయితే, ఆదాయ పరిమితిని పెంచాలని లేదా పూర్తిగా మినహాయించాలని డిమాండ్‌లు ఉన్నాయి, అలాగే భూమి, విద్య మరియు వృత్తి వంటి ఇతర అంశాలను ప్రమాణాలలో చేర్చాలని డిమాండ్‌లు వచ్చాయి. క్రీమీలేయర్ప్రమాణాలను సవరించే అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని, పార్లమెంట్ సమావేశాల్లో పలువురు ఎంపీలు లేవనెత్తారు.

ముగింపు:

మండల్ కమిషన్ నివేదిక అమలు వల్ల ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మాయావతి మొదలైన వెనుకబడిన తరగతుల ఆకాంక్షలు మరియు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీలు మరియు నాయకులు పుట్టుకొచ్చారు. ఇది కొత్త సామాజిక ఉద్యమాలు మరియు కూటముల ఆవిర్భావానికి దారితీసింది.

సామాజిక న్యాయం మరియు ప్రజాస్వామ్యం కోసం భారతదేశం యొక్క అన్వేషణలో మండల్ కమిషన్ నివేదిక ఆశాజనక చిహ్నంగా మారింది. B. P. మండల్ తన నివేదికను అమలు చేయకముందే ఏప్రిల్ 13, 1982న మరణించారు.

B. P. మండల్ అణగారిన మరియు దోపిడీకి గురవుతున్న ప్రజానీకానికి అండగా నిలిచిన ధైర్యం, దృఢ విశ్వాసం కలిగిన వ్యక్తి. B. P. మండల్ భారతదేశ సామాజిక నిర్మాణం మరియు రాజకీయాలలో సమూలమైన పరివర్తన యొక్క అవసరాన్ని ముందుగానే ఊహించిన దార్శనికుడు. B. P. మండల్ మరింత సమగ్రమైన మరియు సమానత్వ సమాజం కోసం వాదించిన సంస్కర్త. లక్షలాది మంది ప్రజలు తమ హక్కులు, గౌరవం కోసం పోరాడేలా స్ఫూర్తిని నింపిన నాయకుడు. B. P. మండల్ ఒక లెజెండ్.

25 August 2023

ఇస్లాం తోబుట్టువులకు హక్కులు మరియు బాధ్యతలు ఇస్తుంది Islam confers rights and gives responsibilities to siblings

 



కుటుంబ జీవితం లోని అన్ని అంశాలను ఇస్లాం వివరించును. ఇస్లామిక్ నీతి మరియు బోధనలు తోబుట్టువుల హక్కులు మరియు బాధ్యతలను వివరించును

ఇస్లాంలో తోబుట్టువులకు గల కొన్ని హక్కులు:

శుభాకాంక్షలు చెప్పడం, అస్సలాముఅలైకుమ్ అని పలకరించడం- ఇది అత్యంత సిఫార్సు చేయబడిన సున్నత్. ఇది తోబుట్టువుల మధ్య గల ప్రేమ మరియు సాన్నిహిత్యాన్ని పెంచును.

 మీకు ఎవరైనా గౌరవభావం తో సలాం చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్దతిలో ప్రతి సలాం చెయ్యండి. లేదా కనీసం  ఆ విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకొంటాడు (అన్-నిసా 4:86)

మన తోబుట్టువులు మార్గదర్శకత్వం కోసం మన వద్దకు వస్తే, మనం వారికి మార్గదర్శకత్వం అందించాలి. తోబుట్టువులకు  సలహా ఇచ్చే అధికారం మనకు ఉంది.

ఒక ముస్లిముకి  తన తోబుట్టువుల శవాన్ని ఖననం చేసే హక్కు ఉంది, ఇది చివరిసారి వారి పట్ల  మన శ్రద్ధ మరియు నివాళిని తెల్పును.  అదనంగా, దీనివలన ఒక హదీసులో చెప్పినట్లు  రెండు గొప్ప పర్వతాల వంటి గొప్ప ప్రతిఫలం లభించును. శవాన్ని ఖననం చేసిన వారికి రెండు ఖిరాత్‌ల బహుమతి లబించును.  ఖిరాత్ అంటే ఏమిటి?”: "రెండు గొప్ప పర్వతాల వంటిది." ( బుఖారీ మరియు ముస్లిం).

తగాదా తర్వాత శాంతి చేసుకోవడం అన్నదమ్ముల హక్కు. మనం జీవితాంతం కలిసి జీవించడానికి అల్లా సృష్టించిన తోబుట్టువులమే. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మద్య సంభందాలను సంస్కరించండి. అల్లాహ్ కు బయపడ౦డి, మీపై దయ చూపటం జరగవచ్చు.. (అల్-హుజురత్ 49:10)

అందరూ కలిసి అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. అయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పు తో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్లి దానినుండి కాపాడాడు. అల్లాహ్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు, బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్దించే సరియైన మార్గం మీకు లబిస్తుందేమో అని.. (ఆల్-ఇమ్రాన్ 3:103)

తోబుట్టువులుగా, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మరియు మన తోబుట్టువులను ఎప్పుడూ ఒంటరిగా వదిలివేయకూడదు. ఒకే సమస్యను పంచుకునే తోబుట్టువులను కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది మరియు ఉమ్మడిగా చేయడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. .

తోబుట్టువులు తప్పు చేయవచ్చు మరియు పాపం చేయవచ్చు. మనం ఓపిక పట్టాలి మరియు వారిని క్షమించాలి లేకుంటే తోబుట్టువులతో మన సంబంధం చెడిపోతుంది.