1.ఒక ప్రవాహం వాల్టెయిర్‌కు దాని పేరును ఇచ్చినప్పుడు:
విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయం ఉన్న
వాల్టెయిర్ డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే రైల్వే డివిజన్లలో ఒకటి. ‘వాల్టెయిర్’
అనే పేరు
ఇంగ్లీషు పేరు కాదు, తెలుగు స్థానిక మాండలికం నుండి
వచ్చింది, అంటే ఏటవాలు ప్రవాహం. తెలుగులో ‘వాలు’ +
‘తేరు’ = ‘వాల్తేరు’ దీనిని ఇంగ్లీషులో వాల్టెయిర్ అని
పలికేవారు.
2.బొజ్జన్నకొండ పై పురాతన నిధి:
బొజ్జన్నకొండ, (అనకాపల్లి నుండి 3 కి.మీ, మరియు విశాఖపట్నం నుండి 40 కి.మీ)లో 1906లో అలెగ్జాండర్ రిమ్ పర్యవేక్షణలో తవ్వకాలు జరిపారు.
సముద్రగుప్తుల కాలానికి చెందిన బంగారు నాణెం,
చాళుక్య రాజు, కుబ్జ విషు వర్ధనుల రాగి నాణేలు, ఆంధ్ర శాతవాహనుల నాణేలు మరియు కుండలు ఈ ప్రదేశంలో
కనుగొనబడ్డాయి
3.ఉత్తరాంధ్రలో బౌద్ధ ప్రదేశాలు:
ఉమ్మడి విశాఖ జిల్లాలోని
బొజ్జన్నకొండ, తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, విజయనగరం జిల్లాలోని రామతీర్థం, శ్రీకాకుళం జిల్లాలోని దంతవరపుకోట వద్ద ఉన్న బౌద్ధ వారసత్వ
ప్రదేశాలు క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ.7వ శతాబ్దం మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో బౌద్ధం విలసిల్లిందని
చెప్పడానికి నిదర్శనం.
4.కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH):
36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ ను (KGH),
జూలై 19, 1923న అప్పటి మద్రాసు ప్రావిన్స్ ముఖ్యమంత్రి అయిన పానగల్‌కు
చెందిన దీవాన్ బహదూర్ రాజా పానుగంటి రామ రాయణి గారు ప్రారంభించినారు. బ్రిటిష్
ఇండియా ను పాలిస్తున్న బ్రిటిష్ చక్రవర్తి గౌరవార్థం ఆసుపత్రికి పేరు పెట్టారు. ఈ
ఆసుపత్రి ఉత్తర ఆంధ్ర జిల్లాల ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తుంది.
5.భీమునిపట్నం అతి పురాతన మునిసిపాలిటీ:
భీమునిపట్నం చారిత్రాత్మక పట్టణం, ఇది భారతదేశంలో రెండవ పురాతన మునిసిపాలిటీ.
భీమునిపట్నంలోని శ్రీ నరసింహ స్వామి దేవాలయం వేల సంవత్సరాల నాటిది మరియు సుమారు 800 సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడనది.
No comments:
Post a Comment