భారతదేశం నుండి ఫ్లయింగ్ ఏస్ బిరుదు పొందిన మొదటి పైలట్ ఇంద్ర లాల్ రాయ్. అప్పుడు భారతదేశం స్వతంత్ర దేశం కానందున, రక్షణ సేవల సిబ్బంది అందరూ బ్రిటన్‌కు సేవలందించారు. రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్ మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో పనిచేస్తున్నప్పుడు, ఇంద్ర లాల్ రాయ్ తొమ్మిది వైమానిక విజయాలు సాధించాడు.
పీరా లాల్ రాయ్ మరియు లోలితా రాయ్‌ల
రెండవ కొడుకుగా కోల్‌కతా (అప్పటి కలకతా)లో జన్మించిన ఇంద్ర లాల్ రాయ్ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, లండన్‌లో
చదువుతున్నాడు. 4 ఏప్రిల్ 1917 న ఇంద్ర లాల్ రాయ్ రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్ లో
చేరాడు మరియు జూలైలో రెండవ లెఫ్టినెంట్ హోదాతో నియమించబడ్డాడు.
ఫైటర్ పైలట్‌గా ఇంద్ర లాల్ రాయ్ 1918 జూలై నెలలో పదమూడు రోజుల వ్యవధిలో, తొమ్మిది జర్మన్ విమానాలను కాల్చి నాశనం చేశాడు మరియు భారతదేశం నుండి హీరోగా కీర్తించబడ్డాడు. కానీ ఇంద్ర లాల్ రాయ్ కెరీర్ అకస్మాత్తుగా విషాదంతో ముగిసింది.
జూలై1918 లో మొదటి ప్రపంచ యుద్ధం పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాల సమూహం కు జర్మనీకి చెందిన జగ్ద్‌స్టాఫెల్ 29కి చెందిన శత్రు విమానాలతో ఘోరమైన వైమానిక పోరాటం ఫ్రాన్స్‌లోని కార్విన్ పట్టణం ఆకాశంలో జరిగింది.
జర్మన్ వైమానిక దళానికి చెందిన ఫోకర్ D.VII విమానం బ్రిటీష్ విమానాలపై కాల్పులు జరిపింది.. జర్మన్ పైలట్ల భారీ కాల్పుల పలితంగా RAF బ్రిటీష్ విమానం ఒకటి ఖాళీగా ఉన్న వ్యవసాయ భూమిపై కూలిపోయింది. RAF బ్రిటీష్ విమానం పైలెట్ ఇంద్ర లాల్ రాయ్ స్వయంగా బుల్లెట్లకు గురయ్యాడు మరియు మరణించాడు.
కొన్ని రోజుల క్రితం రాయల్ ఎయిర్ ఫోర్స్ చేత ఫ్లయింగ్ ఏస్ బిరుదుతో సత్కరించబడిన భారతదేశపు ధైర్యవంతులైన పైలట్లలో ఒకరయిన పైలెట్ ఇంద్ర లాల్ రాయ్ జీవితం ముగిసింది. తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం ఇంద్ర లాల్ రాయ్ ని మరణానంతరం విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ (DFC)తో సత్కరించింది.ఇంద్ర లాల్ రాయ్ 19 సంవత్సరాల వయస్సులో మరణించాడు,
వైమానిక దళం జారీ చేసిన ఒక ఉల్లేఖన Citation ఇంద్ర లాల్ రాయ్ గురించి ఇలా పేర్కొంది: “పదమూడు రోజులలో తొమ్మిది శత్రు విమానాలను నాశనం చేసిన ఇంద్ర లాల్ రాయ్ చాలా తెలివైన మరియు దృఢమైన అధికారి. శత్రు విమానాలను నాశనం చేయడంలో ఇంద్ర లాల్ రాయ్ అద్భుతమైన నైపుణ్యం మరియు ధైర్యాన్ని ప్రదర్శించాడు”
డిసెంబర్ 1998లో, ఇంద్ర లాల్ రాయ్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతీయ తపాలా శాఖ ఇంద్ర లాల్ రాయ్ గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది. ఇంద్ర లాల్ రాయ్ నేటికీ భారతీయ ఫ్లయింగ్ ఏస్ ఫైటర్ పైలట్‌గా మిగిలిపోయాడు.
No comments:
Post a Comment