షేక్ నిజాముద్దీన్ ఔలియా తన కాలంలో బహుళ ప్రజాదరణ పొందిన సూఫీ సెయింట్ మరియు షేక్ నిజాముద్దీన్ ఔలియా కు ఢిల్లీలోను,ఉత్తర భారత దేశం లోను అనేక వేల మంది శిష్యులు ఉన్నారు అయినప్పటికీ షేక్ నిజాముద్దీన్ ఔలియా కు కొంతమంది విరోధులు కూడా కలరు.
1324 లో ఘియాసుద్దీన్ తుగ్లక్ పరిపాలనా కాలం లో నాటి ఉలేమాలు, సనాతన మత గురువులు, షేక్ నిజాముద్దీన్ ఔలియా పట్ల అనుకూలంగా లేరు. తన ఇంట్లో షేక్ నిజాముద్దీన్ ఔలియా సూఫీ సంగీత ప్రదర్శనలను musical soirees నిర్వహించేవాడు. ఇది నాటి ఉలేమాలు, సనాతన మత గురువులకు నచ్చలేదు.
షేక్ నిజాముద్దీన్ ఔలియా అలవాటు వివాదాస్పదంగా మారింది. షేక్ నిజాముద్దీన్ ఔలియా నిర్వహించే సూఫీ సంగీత ప్రదర్సనల అభ్యాసం చట్టవిరుద్ధమని ఉలేమాలు పేర్కొన్నారు మరియు వారు దీనిపై రాజ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు.
షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారు కు హాజరు కావాలని చట్టం కోరింది. షేక్ నిజాముద్దీన్ ఔలియా దానిని పాటించాడు.. ( యాదృచ్ఛికంగా, షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారును సందర్శించటం మొదటిసారి మరియు ఏకైక సారి.) షేక్ నిజాముద్దీన్ ఔలియా రాజ దర్బారు లోకి ప్రవేశించిన వెంటనే, ఉలేమా షేక్ నిజాముద్దీన్ ఔలియా పై మందలింపుల వర్షం కురిపించారు
షేక్ నిజాముద్దీన్ ఔలియా తనపై మోపబడిన అన్ని ఆరోపణలను ప్రశాంతంగా విన్నారు మరియు మాట్లాడే సమయం వచ్చినప్పుడు, తన వాదనకు రక్షణగా కొన్ని హదీసులను మర్యాదపూర్వకంగా ఉటంకించారు.
అయితే దీనికి ఉలేమాలు సంతోషించలేదు. షేక్ నిజాముద్దీన్ ఔలియా పేర్కొన్న నిర్దిష్ట హదీసులు షాఫి లకు మాత్రమే విధిగా ఉన్నాయని వారు షేక్ నిజాముద్దీన్ ఔలియా కు స్పష్టంగా చెప్పారు; హనాఫీలకు వర్తించవని పేర్కొన్నారు..
ఒక ప్రత్యేక ఖాజీ నేరుగా షేక్ నిజాముద్దీన్ ఔలియా ను బెదిరించాడు, నిజాముద్దీన్ ఔలియా తన మార్గాన్ని మార్చుకోమని లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరించినందుకు శిక్షకు సిద్ధం కావాలని చెప్పాడు. షేక్ నిజాముద్దీన్ ఔలియా మాత్రం తనకు నచ్చినది చేయగలనని స్పష్టంగా చెప్పారు..
స్వంతంగా మంచి ఆధ్యాత్మికవేత్త అయిన షేక్ బహావుద్దీన్ జకారియా మనవడు మౌలానా అలాముద్దీన్, షేక్ నిజాముద్దీన్ ఔలియాకు అనుకూలంగా ఉద్వేగభరితమైన వాదన చేసాడు. మౌలానా అలాముద్దీన్ స్థానిక మతాధికారుల నుండి ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండానే పశ్చిమాసియాలోని అనేక నగరాలలో తానూ స్వయంగా సూఫి మ్యూజిక్ సెషన్స్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నాడు..దీనితో ఉలేమాలు మౌనం వహించారు మరియు నిజాముద్దీన్ ఔలియా తన సూఫీ స్థావరం కు తిరిగి రావడానికి అనుమతించబడ్డాడు.
షేక్ నిజాముద్దీన్ ఔలియా అమీర్ ఖుస్రూ మరియు జియావుద్దీన్ బరానీ (వీరిద్దరూ సుల్తానేట్ కాలం నాటి చరిత్రకారులు) ముందు తన నిరాశను బయటపెట్టారు. ఢిల్లీ నగరంలో, ఇస్లాం ప్రవక్త యొక్క హదీసులపట్ల తగిన గౌరవం చూపబడటం లేదని షేక్ నిజాముద్దీన్ ఔలియా విలపించారు.అటువంటి నగరం ఎక్కువ కాలం వర్ధిల్లలేదు మరియు నగరం యొక్క వినాశనానికి ఉలేమాలు పూర్తిగా బాధ్యత వహిస్తారు.అని షేక్ నిజాముద్దీన్ ఔలియా అన్నారు.
షేక్ నిజాముద్దీన్ ఔలియాను బెదిరించిన ఖాజీ రెండు వారాల తర్వాత హఠాత్తుగా మరణించాడు. షేక్ నిజాముద్దీన్ ఔలియా కు జరిగిన అవమానం లో ఉలేమాలతో చేతులు కలిపిన సుల్తాన్ కొన్ని నెలల తర్వాత హింసాత్మక ముగింపును ఎదుర్కొన్నాడు.
1328లో మొత్తం డిల్లి లో ఉన్న ఉలేమాలను ఆనాటి డిల్లి సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ నూతన రాజధాని దౌలతాబాద్‌కు రమ్మన్నాడు. వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి తిరిగి రాలేదు: కొంతమంది మార్గమధ్యంలో మరణించారు, ఇంకా చాలా మంది దౌలతాబాద్ చేరుకున్న తర్వాత మరణించారు.
ఢిల్లీ నగరం కూడా తన వైభవాన్ని,ప్రకాశాన్ని
కోల్పోయింది: సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని మార్చాలని
నిర్ణయించుకున్నప్పుడు డిల్లీ ఒక దెయ్యం పట్టణం (ghostGhost
City) గా మారింది, మరియు
తరువాత జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, డిల్లి నగరం దాని పూర్వ
వైభవానికి తిరిగి రాలేదు.
No comments:
Post a Comment