క్యూబా మెజారిటీ క్రైస్తవ దేశం. క్యూబా
లో ఇస్లాం అతిచిన్న
మైనారిటీ విశ్వాసాలలో ఒకటి. 2011 ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక
ప్రకారం, క్యూబాలో 10,000 మంది లేదా మొత్తం క్యూబా జనాభాలో 0.1% కంటే
తక్కువ ముస్లింలు ఉన్నారు. 2012 నాటికి, ఉన్న 10,000 మంది
క్యూబన్ ముస్లింలలో ఎక్కువ మంది మతాన్ని స్వీకరించినవారు(convertscnverts).
ఒక సమయంలో క్యూబాలో చదువుకొవడానికి అనేక మంది ముస్లిం విద్యార్థులు
ఆసక్తి చూపారు. విద్యార్థుల సంఖ్య సుమారు 1500–2000. ఆ విద్యార్థుల
బృందంలో పాకిస్థానీ మూలానికి చెందిన విద్యార్థులు, ఇతరులు ఉన్నారు.. 2001లో, ముస్లిం
వరల్డ్ లీగ్ (MWL) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ షేక్ ముహమ్మద్ బిన్ నాసిర్
అల్-అబౌడీ క్యూబాలోని ముస్లిం సమాజానికి కావలసిన మసీదులను నిర్మించడం మరియు
ముస్లింలలో ఇస్లామిక్ సంస్కృతిని వ్యాప్తి చేయడం కోసం మద్దతునిచ్చే ఇస్లామిక్
సంస్థను స్థాపించడానికి క్యూబా అధికారుల నుండి అనుమతి పొందేందుకు క్యూబాకు
వెళ్లారు..
జూలై 2015 నాటికి
టర్కిష్ మతపరమైన వ్యవహారాల ఫౌండేషన్ క్యూబన్ ముస్లింల కోసం మొదటి ప్రార్థన గదిని
ప్రారంభించింది మరియు టర్కీ నిధులతో క్యూబాలో మొదటి మసీదు నిర్మాణంలో ఉంది.
వలసరాజ్యాల కాలంలో (పదహారవ శతాబ్దం
చివరి నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు) క్యూబాకు ఇస్లాం పరిచయం చేయబడింది.
1808 మరియు 1848 మధ్య, క్యూబాకు
వచ్చిన ముస్లిములలో అధికులు అనగా దాదాపు 20,654 మంది పశ్చిమ ఆఫ్రికా నుండి. బానిసలుగా తేబడిన ఉన్న
ముస్లిం ఆఫ్రికన్స్. ఈ బానిసలలో ఎక్కువ మంది సెనెగాంబియాకు చెందిన మాండింగోMandingo from Senegambia లేదా
బ్రిటిష్ వలసవాదులచే మొహమ్మడియన్స్ Mohammedanists గా పిలువబడినవారు
పంతొమ్మిదవ శతాబ్దంలో అనేక రకాల
ఆఫ్రికన్ల సమూహాలు క్యూబాకు చేరుకున్నాయి హవానాలోని మిక్స్‌డ్ కమిషన్ కోర్టు యొక్క
రిజిస్ట్రీ క్యూబాలో ముస్లిం ఆఫ్రికన్ బానిసల రాకను డాక్యుమెంట్ చేసిన రికార్డులు
కలవు.
1959కి ముందు క్యూబాలో 5,000 కంటే ఎక్కువ మంది
ముస్లింలు ఉన్నారని నివేదించబడింది.చాలా మంది ముస్లిములు క్యూబాకు క్యూబన్ విప్లవం
తరువాత వలస వచ్చారు.
క్యూబా ముస్లింలు మధ్యప్రాచ్య దేశాల
రాయబార కార్యాలయాల ద్వారా అలాగే ముస్లిం దేశాల నుండి క్యూబాలో చదువుకోవడానికి
వచ్చే విద్యార్థుల ద్వారా ఇస్లాంను నేర్చుకున్నారు. 1970లు మరియు 80లలో క్యూబన్లలో
ఇస్లాం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. అప్పట్లో ప్రింటెడ్ మరియు ఆడియో-విజువల్
ఇస్లామిక్ సాహిత్యం క్యూబాలో దాదాపుగా లేదు. ఖురాన్ యొక్క స్పానిష్ అనువాదం మరియు
ఇతర ప్రధాన ఇస్లామిక్ పుస్తకాలు దేశంలో అందుబాటులో లేవు. క్యూబాలోని ముస్లిం
సమాజానికి విద్యావంతులైన మతపరమైన సిబ్బంది కూడా లేరు.దేశం ఆర్థిక సంక్షోభాన్ని
ఎదుర్కొన్న సమయంలో ఇస్లాం ప్రజాదరణ పొందింది మరియు 1990ల నాటికి మరింత
వ్యవస్థీకృతమైంది.
1990ల నాటికి, క్యూబా
ప్రభుత్వం ఇస్లాం ఆచరణను ఆమోదించింది. మొదట్లో, స్పానిష్‌లో
ఇస్లాం పుస్తకాలు లేకపోవడంతో క్యూబాలో ఇస్లాంను ఆచరించడం కష్టంగా ఉండేది-కానీ 2015లో
హవానాలో మసీదు నిర్మాణం పూర్తికావడంతో, ప్రజలు ఆరాధించడం
సులభమైంది. క్రమంగా క్యూబాలోని ముస్లింలు చాలా మార్పులకు లోనయ్యారు. అనేక క్యూబా
సంప్రదాయాలు ముస్లిం సంప్రదాయాలతో మిళితం అయ్యాయి. కొత్త ఉపాధ్యాయులు మరియు
ఆరాధించే బహిరంగ ప్రదేశంతో ఎక్కువ మంది క్యూబన్లు ఇస్లాం మతo౦ స్వీకరించారు మరియు క్రమంగా క్యూబాలో ఇస్లాం మతం వృద్ధి చెందుతుంది.
క్యూబాలో ఓల్డ్ హవానాలో అబ్దల్లా
మసీదు అనే మసీదు ఉంది, ఇది
రోజువారీ ప్రార్థనల కోసం అందరికీ తెరిచి ఉంది. క్యూబా ముస్లింలు సాధారణంగా తమ ఇళ్లలో
ప్రార్థనలు చేస్తారు. మాజీ అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో తన దేశంలోని ముస్లింల కోసం
ఒక మసీదును నిర్మిస్తానని అని వాగ్దానం
చేసినాడు. గతంలో, పాత
హవానాలోని కాసా డి లాస్ అరాబెస్ ("ది అరబ్ హౌస్") అని పిలువబడే
ప్రదేశంలో శుక్రవారం ప్రార్థనలు బహిరంగంగా నిర్వహించబడేవి.
అరబ్ హౌస్ 1940 లలో క్యూబాలో
నివసించిన సంపన్న అరబ్ వలసదారుకు చెందినది మరియు అరబ్ హౌస్ అండలూసియన్ నిర్మాణ
డిజైన్లపై నిర్మించబడింది. అరబ్ హౌస్ అరబ్ మ్యూజియం మరియు రెస్టారెంట్‌ను కలిగి
ఉంది. అరబ్ హౌస్ హౌస్ పునర్నిర్మాణం కోసం ఖతార్ US$40,000 విరాళంగా ఇచ్చింది, అయితే అరబ్ హౌస్ శుక్రవారం
ప్రార్థనల కోసం మాత్రమే తెరవబడుతుంది.
క్యూబాలో రెండు ఇస్లామిక్ గ్రూపులు
ఉన్నాయి: క్యూబన్ ఇస్లామిక్ యూనియన్, దీని అధ్యక్షుడు ఇమామ్ యాహ్యా పెడ్రో మరియు
క్యూబన్ అసోసియేషన్ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ ఇస్లాం, దీని ప్రెసిడెంట్ అబూ దుయానా నాయకత్వం
వహిస్తున్నారు
ఇతర సున్నీలు హవానాలోని సెర్రోలోని
ముస్లిం హసన్ అబ్దుల్ గఫూర్ ఇంటిలోని మాల్కం ఎక్స్ సెంటర్‌లో కేంద్రీకృతమై
ఉన్నారు. హసన్ అబ్దుల్ గఫూర్ 1994లో క్యూబాలో ఒక ఇస్లామిక్ సంస్థను స్థాపించిన మొదటి వ్యక్తి.
క్యూబాలోని ప్రముఖ ముస్లింలు:
• అలీ నికోలస్ కోస్సియో - మాజీ విదేశాంగ మంత్రిత్వ శాఖ
అధికారి ఇప్పుడు "వాయిస్ ఆఫ్ ఇస్లాం", రేడియో స్టేషన్ రిపోర్టర్...
• జువాన్ కార్లోస్ గోమెజ్ - ప్రొఫెషనల్ బాక్సర్ మరియు
మాజీ క్రూజర్‌వెయిట్ ఛాంపియన్
No comments:
Post a Comment