అన్నం వార్చిన తర్వాత గంజిని చాలామంది పారబోస్తూ ఉంటారు. అదే పాత రోజుల్లో
అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు. అందుకే
వాళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలక్రమేనా గంజిని
పనికిరానిదిగా భావించి వృథాగా పాడేస్తున్నారు. గంజిలో అనేక పోషక విలువులు ఉన్నాయని
నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గంజిలోని పోషకాలు
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలిస్తే.. ఇక ఎప్పుడూ దాన్ని పారబోయరు.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించిన 2021 అధ్యయనం ప్రకారం, గంజిలో స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అతిసారం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. చిన్న గ్లాసు పలుచటి గంజి తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది. గంజిలోని పిండి పదార్ధం బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
హైడ్రేట్ చేస్తుంది..
అనారోగ్యం, తీవ్రమైన శారీరక శ్రమ శరీరాన్ని రీహైడ్రేట్
చేయడం చాలా ముఖ్యం. గంజిలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మీ
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను పునరుద్ధరించడానికి గంజి
సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను
నివారిస్తుంది.
ఇమ్యూనిటీ మెరుగుపరుస్తుంది..
ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో సమర్థవంతంగా పోరాడటానికి బలమైన
రోగనిరోధక వ్యవస్థ కీలకం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన 2022 అధ్యయనం ప్రకారం, గంజిలో విటమిన్ బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక
వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తాయి. రోజూ గంజి తాగితే ఇన్పెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
నెలసరి నొప్పులు తగ్గుతాయి..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గంజి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాలను ఉపశమనానికి, ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో
సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే.. ఒక కప్పు గోరువెచ్చని గంజి
తాగండి.
బరువు తగ్గుతారు..
బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. గంజిలో క్యాలరీలు
తక్కువగా ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందుకు
కారణం దీనిలో ఉండే పీచు పదార్థాలే. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు
అనిపిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
గంజిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మానికి అద్భుతాలు చేస్తాయి. ఎన్నో
దేశాలో మచ్చలేని, ప్రకాశవంతమైన
చర్మాన్ని పొందడానికి బ్యూటీ కేర్‌లో గంజిని వాడతారు. మీరు గంజిని టోనర్‌గా అప్లై
చేయవచ్చు. కాటన్ బాల్‌తో మీ ముఖంపై సున్నితంగా మర్దన చేయవచ్చు. సన్‌బర్న్ వంటి
చికాకు కలిగించే చర్మ పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు గంజి సహాయపడుతుంది.
No comments:
Post a Comment