19 August 2023

ఆజాద్ హింద్ ఫౌజ్ INA యొక్క మొదటి మహిళా గూఢచారిణి నీరా ఆర్య 1902-1998

 

నీరా ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్(INA) యొక్క మొదటి మహిళా గూఢచారిగా ప్రసిద్ధి చెందింది. నీరా ఆర్య ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని ఖేక్రా నగర్‌లో 1902 మార్చి 5న జన్మించింది. నీరా ఆర్య తండ్రి సేథ్ ఛజ్జుమాల్, వ్యాపారవేత్త. సేథ్ ఛజ్జుమాల్ తన పిల్లలను  కోల్‌కతాలో చదివించాడు. చిన్నప్పటి నుండి, నీరా జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో ఆసక్తిని కలిగి ఉంది మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరింది.

నీరా ఆర్య వివాహం బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ శ్రీకాంత్ జై రంజన్ దాస్‌తో జరిగింది. శ్రీకాంత్ జై రంజన్ దాస్‌ బ్రిటిష్ ప్రభుత్వం లో CID ఇన్‌స్పెక్టర్‌. పెళ్లి అయిన కొంతకాలానికే నీరా ఆర్య మరియు శ్రీకాంత్ జై రంజన్ దాస్‌ మద్య విభేదాలు ప్రారంభమయ్యాయి 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంINAINAలో నీరా ప్రమేయం గురించి శ్రీకాంత్‌కు తెలియగానే, శ్రీకాంత్ జై రంజన్ దాస్‌, నేతాజీ  ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో నీరా ఆర్య ను ప్రశ్నించడం ప్రారంభించాడు. శ్రీకాంత్, నీరా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను హత్య చేయాలని కోరుకున్నాడు దానికి నీరా ఆర్య నిరాకరించినప్పుడు, నేతాజీని హత్య చేయడానికి నేతాజీ ఆచూకీని ఆమె వెల్లడించాలని శ్రీకాంత్ జైరంజన్ దాస్ కోరుకున్నాడు. నీరా బోస్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు, శ్రీకాంత్, నీరాను అనుసరించి బోస్ పై కాల్పులు జరిపాడు. కాల్పులలో బోస్ డ్రైవర్ మరణించాడు. ఇది విన్న నీరా తన భర్త శ్రీకాంత్‌ని కత్తి పొడిచి చంపినది. నీరాను బ్రిటిష్ వలస ప్రభుత్వం అండమాన్ మరియు నికోబార్ జైలులో నిర్బంధించింది.

స్వాతంత్ర నేతల గురించి, ముఖ్యంగా నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని బయటపెడితే బెయిల్ ఇప్పిస్తానని నీరాకు ఆశ పెట్టారు. . నీరా స్వాతంత్ర్య పోరాట నాయకుల గురించి వివరాలు ఇవ్వడానికి నిరాకరించింది. అండమాన్ జైలు లో నీరా అనేక రకాల శారీరక చిత్ర హింసలకు గురి అయ్యినది.   జైలు జీవిత కష్టాలను సహించి నీరా దేశం పట్ల భక్తితో కలిగి ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క మొదటి మహిళా ఆభరణం గా అవతరించింది, ఈ బిరుదు మరియు బాధ్యత నీరాకు బోస్ ద్వారానే అందించబడింది.

భారత దేశ స్వాతంత్రం పొందిన తరువాత నీరా జైలు నుండి విడుదలచేయబడి తన శేష జీవితం హైదరాబాద్ లోని ఫలక్ నామా ప్రాంతం లో పూలు అమ్ముకొంటు గడిపినది. నీరా ఆర్య 1998 జూలై 26న హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది.

చైనీస్ ఫిల్మ్ మేకర్ జాంగ్ హుయిహువాంగ్ నీరా ఆర్యపై జీవితచరిత్ర సినిమా తీయాలని యోచిస్తున్నారు. 

 

 

No comments:

Post a Comment