27 August 2023

ఇస్లాంను రక్షించడానికి ఉలేమా బ్రిటిష్ వారి ముందు ధైర్యసాహసాలు ప్రదర్శించారు Ulema put up a brave front before the British to defend Islam

 



ఉలేమా లేదా ముస్లిం మత పండితులలు ఆధునిక భారత దేశ  చరిత్రలో, కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ పూర్వ భారతదేశంలో, చాలా మంది ప్రముఖ ఉలేమాలు సుల్తానులు లేదా మొఘలుల ఆస్థానాలకు అనుబంధంగా ఉండేవారు. ఉలేమాల నేతృత్వంలోని సెమినరీలు లేదా మదర్సాలు న్యాయనిపుణులు మరియు బ్యూరోక్రాట్‌లను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా పనిచేశాయి.

మొఘలుల పాలనలో, ఫతావా-ఇ-ఆలమ్‌గిరిని సంకలనం చేయడంలో ముఖ్య వ్యక్తి అయిన కుతుబుద్ దిన్ వారసులు, లక్నోలో ఫరంగి మహల్ ఉలేమాను స్థాపించారు. ఫరంగి మహల్ తొలి సెమినరీగా పరిగణించబడుతుంది.బ్రిటీష్ వారు స్థాపించిన కలకత్తా మదరసా యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఫరంగి మహల్ నుండి పట్టభద్రుడయ్యాడు.

ఫరంగి మహల్‌కు భారతదేశంలోని అన్ని సెమినరీలకు మతపరమైన విద్య కోసం అవసరమైన కరిక్యులం దార్స్-ఇ-నిజామిని వ్యవస్థీకరించడం. చేసింది.  దార్స్-ఇ-నిజామి ప్రకారం నేటికీ మదరసాలలో సిలబస్‌ బోధన కొనసాగుతోంది

ఫరంగి మహల్‌కు వ్యతిరేకంగా వచ్చిన షా వలియుల్లా దేహెల్వి ఉద్యమం మతపరమైన విద్య యొక్క కేంద్రాన్ని లక్నో నుండి ఢిల్లీకి మార్చింది.

షా వలీవుల్లా వారసులు చట్టపరమైన కోడ్‌లను అధ్యయనం చేశారు మరియు ముసాయిదా ఫత్వాలను రూపొందించారు. షరియాను అన్వయించడంలో హదీసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంతో పాటు, షా వలీవుల్లా గత చట్టాలకు (తఖ్లీద్) గుడ్డిగా కట్టుబడి ఉండకూడదని హెచ్చరించాడు. ఖురాన్ లేదా సున్నత్ నుండి న్యాయపరమైన మార్గదర్శకత్వం తీసుకోవాలని షా వలీవుల్లా సలహా ఇచ్చారు.

1857 తిరుగుబాటు తరువాత  మొఘల్ పాలన అంతరించినప్పుడు షా వలీవుల్లా మరియు అతని వారసుల అయిన ఉలేమాలను బ్రిటిష్ వారు అరెస్టు చేసి శిక్షించారు. షా అబ్దుల్ అజీజ్ (వలీవుల్లా కుమారుడు) బోధించే చోట ఒక్క కుచా చలాన్‌లోనే బ్రిటిష్ సైనికులు పద్నాలుగు వందల మందిని కాల్చిచంపారు.

తరువాతి కాలం లో సంస్కరణవాది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేత అలీఘర్‌లో మహమ్మద్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్ (తరువాత AMU) స్థాపించబడింది మరియు ఈ సంస్థ ముస్లింలను ఉలేమా ప్రభావం స్వతంత్రంగా తయారు చేసేందుకు ప్రయత్నించింది.. ఇది సంప్రదాయవాదులు మరియు ఆధునికవాదుల మధ్య ఘర్షణకు దారితీసింది

బ్రిటీష్ రాజ్ నుండి అడ్డంకులు ఉన్నప్పటికీ, ఉలేమాలు ఇస్లాం మరియు ఇస్లామిక్ సమాజం పై ప్రచురణలు మరియు మతపరమైన సమస్యలపై బహిరంగ చర్చల ద్వారా నిలబెట్టకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఉలేమాల మేధో శక్తి ప్రింట్ టెక్నాలజీ ఆవిష్కరణతో గరిష్ట స్థాయికి చేరుకుంది. అరబిక్‌కు బదులుగా ఉర్దూ వంటి స్థానిక భాషలలో మతసాహిత్యాన్ని ప్రచురించడం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉలేమాలు అనుసరించిన సమర్థవంతమైన వ్యూహాలలో ఒకటి

తరువాత ఉలేమాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరింత పూర్తి శక్తితో స్వాతంత్ర్య పోరాటం కొనసాగించారు. ఉలేమాలలో చాలా మంది స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారు

ఉలేమాలు ప్రసిద్ధ ఖిలాఫత్ ఉద్యమంలో మహాత్మా గాంధీని తమ మార్గదర్శిగా చేసారు మరియు ఉలేమాలలో చాలా మంది రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించారు కాంగ్రెస్‌పై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచారు.

నాడు బ్రిటీష్‌తో ధైర్యంగా పోరాడిన  ఉలేమాలు ఇప్పుడు సంస్కరణల యొక్క కొత్త తరంగానికి వినమ్రంగా లొంగిపోతున్నారు. ఇది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది.

No comments:

Post a Comment